ఏమండోయ్ భావగారూ...ఏమిటి బొత్తిగా దర్శనాలు లేవు?
చమత్కారమెందుకు భావగారూ...కనబడుతున్నాగా!
గొప్ప సరసులు భావగారు..కనబడకపోవడమంటే--బ్లాగులో దర్శనం లేదని నా భావం..
అలా వచ్చారా? కారణమంటూ ఏమీ లేదండి...ఆ మధ్య కాశీ ప్రయాణం..వచ్చాక సిక్కు.
అతడెవ్వరు?
అబ్బా సిక్కంటే పంజాబీ కాదు భావగారు. జబ్బుపడ్డానని.
ఆ తర్వాత?
కంప్యూటరు సిక్కు, ఇంటర్నెట్టు సిక్కు..
ఆ సిక్కుల గొడవల్లో పడడంవల్ల మీ బ్లాగు బ్లాగుడు లేదంటారన్న మాట!
అన్నమాటో తమ్ముడు మాటో కాని వున్నమాట అదే.
ఇప్పుడు ఆరోగ్యంగా వున్నరా...మందులేమన్నా...
ఎందుకేసుకోవటంలేదూ..మందులకు కూడా మందులు వేసుకుంటున్నాను.
భావగారు..మీవన్నీ చమత్కారాలే. మందులకు మందులేమిటండి?
చెప్తా ఓపిగ్గా వినండి...బి పి దానికో మందు.
దానితో కాళ్ళు వాచాయి..దానికో మందు..అది వేసుకుంటే వాపులు తగ్గాయి కాని..
మళ్ళీ కానీ ఏమిటి భావగారు?
ఇప్పుడు కాళ్ళ మంటలు..దానికి మందు..కాన్స్తిపషన్..దానికేస్తే...తలపోటు...దానికేస్తే..షుగరూ..నీరసం..టెన్షన్...బీపీ...దానికి ....
అదేమిటి భావగారూ బీపీకి వేస్తున్నారుగా...
ఆ బీపీ వేరు..అది నా బీపీ..ఇదివేరు.ఇది మందుల బీపీ.
మళ్ళీ కథ మొదలన్నమాట..సారీ ఉన్నమాట
మళ్ళీ....
ఇంక ఆపేయండి,భావగారు....నాకు బీపీ చక్రం మొదలయ్యెలా వుంది..నే వస్తా...
సరే భావగారు...మళ్ళి కలుద్దాం...
ఆలోచిద్దాం...శలవు.