Pages

Thursday, January 31, 2013

రాజమహేంద్ర వాసులకు... రాజమహేంద్రవర నగరానికి చుట్టుప్రక్కలున్నవారికి ... అంతేకాకుండా ఆఅధ్యాత్మిక విషయాల పట్ల అభిమానమున్నవారందరికీ.. విజ్ఞప్తి. రేపటినుండి అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి తొమ్మిది రోజులపాటు .. ప్రవచన విరించి, వాగ్దేవీ వరపుత్ర, సమన్వయ సరస్వతి ... బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారిచే అద్భుతమైన ప్రవచనములు జరుగనున్నాయి. "ఆదిత్య హృదయము - సూర్యారాధన" అన్నది విషయము.
శ్రీ షణ్ముఖ శర్మగారు లబ్ధ ప్రతిష్టులు. వారిగురించి ప్రత్యేకమైన పరిచయము అక్కరలేదు.  ఆహ్వానము జతపరుస్తున్నాను .. ఆసక్తి పరులు విచ్చేయవలసినదిగా మనవి.. మీకు పరిచయస్తులకు కూడా తెలియ పరచండి.