మేము గత ఏడు సంవత్సరాలుగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న 'హాసం' క్లబ్ ఈనెలలోముళ్లపూడి రమణగారిపరంగా జరిగింది...ఆ విశేషాలు మీతో పంచుకుందామని:::::: రమణీయం హాసం క్లబ్ కార్యక్రమన్
రాజమండ్రి నగరములోని హాసాభిమానుల ప్రోత్సాహంతో హాసం క్లబ్ ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఎనిమిదవసంవత్సరంలో ప్రవేశించింది. రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయంలో మార్చి 27వ తేదీ సాయంకాలం గం.6 కు తమ 76వ కార్యక్రమాన్నివిశేషంగా హాజరైన నగర వాసుల సమక్షంలో విజయవంతంగా నిర్వహించింది హాసం క్లబ్. శ్రీ ముళ్లపూడి రమణీయం అంటూ "రమణగారి స్పెషల్" గా ఆద్యంతమూ హాస్యసంగీత భరితంగా ఈ కార్యక్రమం జరిగింది... బాపు..రమణల ఇష్టదైవం శ్రీరాముని స్తుతిస్తూ శ్రీమతి డి.విజయలక్ష్మి ప్రార్థనచేసారు. ఫిజిక్స్ లెక్చరర్ శ్రీచాగంటి శరత్ బాబు, తెలుగు ఆచార్య డా.అరిపిరాల నారాయణరావు, బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి, యల్ ఐ సి డెవలెప్ మెంట్ ఆఫీసర్ యెర్రాప్రగడ ప్రసాద్.,నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్, రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సి.బి.ఆర్.కె శర్మ, ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ మొదలైనవారు శ్రీ ముళ్లఫూడివారి వ్యక్తిత్త్వాన్ని అనేక కోణాలలో పరిశీలించి వివరించారు. బాపురమణల సినీమాల్లోని పాటలు....శ్రీమతి డి.విజయలక్ష్మి (నిదురించే తోటలోకి);శ్రీ యు.వి.సత్యనారాయణ (టా...టా...వీడికోలు); శ్రీ యస్.కృష్టారావు (ఏదో..ఏదో అన్నది ఈ మసక వెలుతురు; గోగులు పూచే.గోగులుపూచే) శ్రీ శేఖర్ (గుట్టమీద గువ్వ కూసింది)...శ్రావ్యంగా పాడి వినిపించారు. 'జ్యోతి' మాసపత్రికలోని "భామా కలాపం"...స్కిట్ శ్రీమతి శారద, శ్రీమతి విజయలక్ష్మి ప్రదర్శించారు...శ్రీ రమణగారి జోకు ఆధారంగా శ్రీమతి శారద తాను వ్రాసిన "తాళం వేసిన సంగీతం" స్కిట్ శ్రీమతి విజయలక్ష్మిగారితో కలసిప్రదర్శించారు.ముత్యాలముగ్గులో రావు గోపాలరావు,మాడా సంభాషణ ఆధారంగా వ్రాసిన "సమ్మానం" స్కిట్ శ్రీ డి.వి.హనుమంతరావు,శ్రీనూజెళ్ళ సూరిబాబు ప్రదర్శించారు.శ్రీమతి టి.సీతా మహలక్ష్మిగారు శ్రావ్యంగా పద్యాలు చదివారు.శ్రీ మంత్రి..బుడుగును ప్రదర్శించారు. శ్రీ పి.భీమన్నగారు ఒక మాజిక్ ఐటమ్ ద్వారా శ్రీ రమణ, శ్రీ బాపుల దృఢమైన స్నేహాన్ని ప్రదర్శిస్తే, శ్రీ గమిని రంగయ్యగారు తన గణితశాస్త్ర ప్రఙ్ఞతో శ్రీ రమణగారి పుట్టిన తేదీలోని చమత్కారము చెప్పారు. ఆంధ్రా బ్యాంక్ ఆఫీసర్ శ్రీ టి.హనుమంతరావు, సి.టీ.ఆర్.ఐ.సైంటిస్టు. శ్రీ సి.ఏ.రాజు మంచిజోకులు వినిపించారు. కన్వీనర్ శ్రీ అప్పారావు... శ్రీ రమణగారి రచనలలోని మాధుర్యాన్ని సమయోచితంగా చెప్తూ..తనకు శ్రీరమణగారితో గల అనుబంధాన్నినీరు నిండిన కళ్ళతో వివరిస్తుంటే ప్రేక్షకుల హృదయాలు చెమ్మగిల్లాయి.. శ్రీ రమణగారి హాస్యాన్ని మేళవిస్తూ కన్వీనర్ శ్రీ డి.వి.హనుమంతరావు ఆసక్తిదాయకంగా సభను నిర్వహించారు. ప్రముఖ గాయకుడు జిత్ మోహన్ మిత్రా, చిలకమర్తి ఫౌండేషన్ కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాద్, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి.యస్.కృష్ణారావు, స్టేట్ బ్యాంకు ఆఫ్ యిండియా రిటైర్డ్ ఆఫీసర్శ్ పి.వి.శర్మ, కె.యస్.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ కంట్రాక్టర్ టి.విశ్వనాధం, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.జగపతిరావు, ఫిజియో థిరపిస్ట్ జి.యస్.యన్.మూర్తి, కవి విశ్వప్రియ, డా.పి.వి.యస్.ఆర్.పంతులు, బి.జె.పి.కార్యవర్గ సభ్యులు కరటూరి శ్రీనివాసరావు, తెలుగు ఉపన్యాసకులు శ్రీమతి ఎ.యస్.వి.మహలక్ష్మి., మొ వివిధ రంగాలకు చెందిన ప్రభృతులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాపురమణల మిత్రులు, అభిమాని శ్రీ యమ్ యస్ మూర్తిగారు కాకినాడనుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. రమణ బాపులు పుట్టినది తూ.గో.జి ప.గో.జి అయినా గోదావరి ఒకటే అయినట్టు... హాస్యం, బొమ్మా వేరైనా కార్టూన్ ఒకటే అయినట్టు....బాపూ రమణలు వేరైనా వారిద్దరూ ఒకటే రెండు కాదు....అది మా మాట మనందరి మాట..... పసుపు, సున్నం కలిస్తే పండు పారాణి అవుతుంది. బాపు రమణల స్నేహరాసిక్యత ఆంధ్ర సరస్వతి పాదాలకు ఆరని పారాణి......... ప్రముఖ రచయిత శ్రీ శ్రీరమణ చెప్పిన ఈ పలుకులు అక్షరసత్యాలు... రసవత్తరంగా రమణీయంగా సాగిన నాటి కార్యక్రమం జాతీయ గీతాలాపనతో జయప్రదంగా ముగిసింది.
(ఈ ఫోటోలు ఎక్కడివి అంటున్నారా ...అప్పు చేసానండి .. అప్పారావు దగ్గర ...అప్పారావు అప్పులు తీసుకుంటాడు కాని ఇస్తాడా...అదా మీ అనుమానం .. అప్పారావు కి ముళ్ళపూడి పేరు చెప్తే ఇస్తాడు ..అది రహస్యం. అలా తెచ్చానన్న మాట...ఎవరికీ చెప్పకండి.మా అప్పారావు గారికి అభినందనలతో...డి.వి.హెచ్ రావు.)...
2 comments:
నా ఫొటోలు అప్పు తీసుకొన్నారు సరే! ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నట్లు చెప్పలేదు.
అసలు నే వచ్చానా లేదా అని అవమానం(అదేనండి మా ముళ్లపూడి బుడుగు భాషలొ
అనుమానం) కలుగుతున్నది!
చాలా థాంక్స్...వేడి వేడిగా చూసాసారన్నమాట...వేడి మీ వ్యాఖ్యలో
కూడా తగిలింది...ఇంతకీ అడిగేది అప్పారావా....అప్పారావుగారా ....
అప్పారావైతే సర్వాంతర్యామియే కాకుండా...అంతర్వాహినిగా
అంతటా వుంటాడు...మనకి కనపడడు..మనం వెళ్ళి చూడాలి...
అప్పారావుగారైతే...ఆయన లేని హాసంక్లబ్ కార్యక్రమమా...ఇస్సీ!
విధి బలీయముకదా....వున్నారండి బాబూ...కళ్ళమ్మట నీళ్ళు
పెట్టుకుని మాకు నీళ్ళు రప్పించారామటని వ్రాసా కదా..
మరల ఒకసారి అవలోకించగలరు.
Post a Comment