శ్రీ ఖర నామ సంవత్సరం శుభంకరమవ్వాలని
ఇందుశేఖరుని ప్రార్థిస్తూ....
ఉ గా ది శుభాకాంక్షలు.
తెలుగు వారి పండుగ చైత్ర శు.పాడ్యమి...ఉగాది.
వసంత ఋతువు..మనస్సుకు ఉల్లాసం కలిగే వసంత కాలం
క్రొత్త జీవితానికి సంకేతంగా చెట్లు పల్లవిస్తాయి. ...
ఆ పల్లవించేకాలానికి మొదటి రోజున ఉగాది జరుపుకుంటాం... ఈ క్రొత్త సంవత్సర శుభారంభవేళ ప్రతివారి మనోక్షేత్రంలో క్రొత్త సంకల్పాలు చిగురించి రూపు దిద్దుకుంటాయి..
తెలుగు సంవత్సరాలు అరవై... ఒక చక్రం...'ప్రభవ'తో మొదలై 'అక్షయ'తో ఒక ఆవృతం...మరల 'ప్రభవ'తో క్రొత్త చక్రం.... అలా అరవై పూర్తి చేసుకుని షష్టి పూర్తి సంబరం జరుపుకోవడం ఒక సంప్రదాయం...
ఐతే.....'ప్రభవ' నుంచి మొదలుపెట్టిన సంవత్సరాలలో కొన్నిపేర్లు సౌమ్యంగావుంటాయి...
'ప్రభవ, విభవ, విజయ,జయ, మన్మథ'...
కొన్ని కొంచెం తీవ్రంగానూ విపరీతంగానూ వుంటాయి....
'దుర్ముఖి, రాక్షస, ఖర, విరోధి, వికారి'....ఇలా.... మన జీవితంలో అనుకూలతలు ప్రతికూలతలు సామాన్యం.. దానికి సూచనగా దీనిని భావించవచ్చు...
స్వాభావికంగా కూడా ప్రతివ్యక్తిలోను...సాత్త్విక, రాజస, తామస లక్షణాలు వుంటాయి..కాలగమనంలో కూడా...మలయమారుతాలు, భయంకర త్సునామీలు, బాలభానుని నులివెచ్చని అరుణకిరణాలు, మధ్యాహ్న మార్తాండుని తీక్షణ వీక్షణాలు...పున్నమి వెలుగులు, అమావాస్య చీకటులు...అన్నీ చూస్తూనే వుంటాము....
అన్నీ వుండాలి...ఫెళ్ళున ఎండ కాస్తేనే కదా... చల్లటి వాన కురిసేది... సూర్యుని వెలుగేకదా చంద్రుని వెన్నెల... "అగ్ని సోమాత్మకం జగత్" అని శాస్త్ర వచనం...అంతా ఎండయినా కష్టమే..... అంతా వానైనా దుర్భరమే...జీవనయానానికి రెండూ అవసరమే
అందుకే వేప చేదైనా; మామిడి పులుపైనా; చెరుకు తీపైనా, వగరయినా, ఉప్పైనా, అరటి పండైనా, చింతపండైనా....అన్నీ వుంటేనే ఉగాది పచ్చడి మాధుర్యం.....
ఖ ర నా మ సం వ త్స ర ఉ గా ది శు భా కాం క్ష లు
4 comments:
అయ్యా! చక్కగా చెప్పారు.
చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలిసేది.
జీవితమే షడ్రుచుల సమ్మేళనం.
ఉగాది శుభాకాంక్షలు,
hello
saradaga ugadi gurinchi kotthaga emaina rasaremo chuddamani anukuni blogspot ki vachanu. Inthalo mee vratha thatasthinchindi. Chala chakkaga rasaru.
మిస్సన్నగారూ...మా ఉగాది పచ్చడి ఎవరూ రుచి చూడటంలేదేమిటా అని కించిత్ బాధ పడుతున్నప్పుడు...మీ వ్యాఖ్యతో సంతోషపెట్టారు...
బాధ, సంతోషం వెరసి ఉగాది...మీ అభిమానానికి కృతఙ్ఞతలు...
శిరీషగారూ..నా బ్లాగులోకి ఏదో expect చేసి వచ్చానన్నారు..నిరాశ పరచానా?మెచ్చుకున్నారు..thanks...పాతవి కూడా చూసి
స్పందిస్తే ....చాలా సంతోషిస్తాను...మీకు పింగళి పద్మినిగారు బంధువా...?
కొంచెం ఆలస్యం గా చెబుతున్నాను.
మీకు ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీకు సకల శుభాలు కలగజేయాలని కోరుకుంటున్నాను.
Post a Comment