Pages

Tuesday, April 26, 2011

కనబడుట లేదు...కనబడుట లేదు...కనబడుట లేదు











"ఏడాది వయస్సు....గుండ్రటి ముఖం....నవ్వుతూ వుండడం, నవ్విస్తూ వుండడం...అప్పుడప్పుడు రామా..కృష్ణా....వనభోజనాలప్పుడు ఒకసారి వండిన అనుభవం...పిచ్చాపాటీ....ఈ పరిచయం చాలు అనుకుంటా...కనపడ్డం లేదు."
అని ఓ ప్రకటన ఈయడానికి డిసైడయిపోయా....

ఎందుకైనా మంచిదని ముందు నాకు పరిచయమైన వార్ని అడిగిచూద్దాం అని,
సురేఖ (అప్పారావు) గార్నడిగా. ఆయన "మా వీధిలో చూసానండీ" అన్నారు....
తిరిగి రాలేదు మరి ఏమైనట్టు....మా ఫ్రెండ్ ఇంకో హనుమంతరావుగార్నడిగా..
వాళ్ళ వీధిలోకి రాలేదన్నారు..

మొన్న సీతారామ కళ్యాణం నాడు వడపప్పు, పానకం టైముకి -వెరీమచ్ హియర్.
చక్కగా హనుమస్సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని ఫోటో అడిగి తీసుకుని
ఆ తర్వాతనుంచి గైరుహాజరయితే ఏమనుకోవాలి ? కొందరు ఆ ఫోటో కూడా
చూసామన్నారు....

ఇలాంటప్పుడు జ్యోతి గారైతే మంచి సలహా ఇస్తారు..మాకు పెద్ద దిక్కు ఆవిడే...
ఆవిడ్ని మెయిల్స్ తో బాధపెట్టా...'పోలీస్ కి చెప్పమంటారా, పేపర్లలో ప్రకటనలా,
టి.విఆ...ఏంచేద్దాం...' అంటే ఆవిడ 'అదేమిటి మీ వీధిలో నాకు స్పష్టంగా కనపడుతుంటే
మీరు లేదంటారేమిటి ?'...తర్వాత ఆవిడే చెప్పారు...నా మీద కోపం వచ్చిందిట. అందుకే
నాకు కనపడకుండా అందరికీ కనపడడం...సరే సంప్రతింపులు
మొదలయ్యాయి...
ఈ మధ్య నేను యెక్కువగా తనకి పని చెప్పటం లేదట. అందువలన తాను ప్రొజెక్ట్
అవలేకపోతున్నదట..."అంటే కంప్యూటర్ కా షా టా ల లో ఇది కూడా ఒకటా" అని అడిగా....
జ్యోతి గారు నవ్వేసి "మరేమిటనుకున్నారు...ఇప్పుడు మీ రూట్ మార్చండి....
internet explorer ద్వారా కాకుండా...Firefox..ద్వారా వెళ్ళండి...తప్పిపోయిన
మీ బ్లాగు మీ ఇంటికొస్తుంది.." అన్నారు....
ఆ ప్రయత్నం ఫలించింది... నా బ్లాగు నన్ను చేరింది....
క్రొత్త క్రొత్త ఆలోచనలు కలగాలని దీవించండి....బ్లాగులో తరచూ కలుస్తాను....
ఈ విషయంలో జ్యోతివలబోజు గార్కి ప్రత్యేక కృతఙ్ఞతలు...
(వీధి అంటే బ్లాగు అని మీకీపాటికి అర్థం అయిపోయే వుంటుంది)

5 comments:

జ్యోతి said...

బ్లాగు మొదలెట్టి, రెండు మూడు టపాలు గెలికి వదిలేస్తే అలగదా మరి?? ఇకనైనా దాన్ని అలా వదిలేయకండి. మీరే దానికి దిక్కు.. పాపం కదా..

Unknown said...

చాలా చక్కగా రాసారు మీ అనుభవాన్ని....మీ బ్లాగ్ ద్వారా ఇంకా ఎన్నో విషియాలు మాకు తెలియ పరచాలి కదా మరి....అందుకె మీ బ్లొగ్ మీ దగ్గరికి చెరింది !
కాని ఏది ఏమైన అమ్మో...COMPUER K A S H A T A L U !!!!!!

పానీపూరి123 said...

ఇంట్లో(browser) కనబడుటలేదా?
మరి వీధి ( మాలిక,హారం,కూడలి, సంకలిని ) లో కనబడుతుంది!

హనుమంత రావు said...

జ్యోతిగారూ, పాఠం నేర్చుకున్నాను. బుద్ధి వచ్చింది..
సమస్య వస్తే మాత్రం ....త్వమేవ శరణం మమ!!!

విజయగారూ, నా (కంప్యూటర్) కా షా టా లు సానుభూతితో
అర్థం చేసుకున్నారు...కృతఙ్ఞతలు,,

కొన్ని వీధులు తిరిగేటప్పటికే సమస్యకు పరిష్కారం దొరికింది.
దొరకకపోతే తిరుగుదునేమో...నీరసానికి పానీ, పూరీ వుండనే
వున్నాయి...కదా ?

బులుసు సుబ్రహ్మణ్యం said...

IE లో తప్పిపోయిన వారు FF లో దొరుకుతారన్నమాట.
చూసారా నేను కూడా 'కా' నేర్చేసుకున్నాను.