నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Monday, August 1, 2011
నే పుత్తిన లోజు లేపే...
నన్ను చూడగానే మా "బుజ్జి బ్లాగు" తప్పటడుగులతో పరిగెత్తుకు వచ్చింది.
"ఏంతమ్మా కన్నా..ఏంకావాలమ్మా?" అని ముద్దుచేసా..
"నే పుత్తిన్ లోజు చెయ్యవా ?" అని గారాలు పోయింది... "
అప్పుడే నీ పుట్టిన రోజు వచ్చేసిందా అని ఆశ్చర్యపోతూ..ఏం చెయ్యాలమ్మా?" ముద్దుగా అడిగా..
"పండగ చెయ్..అందర్నీ పిలు,,కేకు కొయ్,,స్వీట్ పెట్టు..హాట్ పెట్టు..."
పెద్ద ప్రోగ్రామే చెప్పింది బుజ్జి బ్లాగు. "ఎందుకమ్మా అంత హడావుడి...నువ్వేం చేసావని..నీకెవ్వరు తెలుసని?" నాకేదో బెరుకు.
"అదేంటోయ్..నేనూ అందరిలాగే పుత్తాను కదా..క్రితం సంవత్సరం ఆగస్ట్ రెండు నుంచి నేనందర్నీ చూస్తున్నా కూడా.." చిన్న వయస్సు ఉత్సాహం మరి..
"నిజమే అనుకో.." "మరి మా బ్లాగుంటలు, బ్లాగుమ్మలు అందరూ చేసుకుంటున్నారుగా...మరి నే చేసుకోకూడదా.." బుజ్జి బ్లాగు రీజనింగ్ అది.
"అవుననుకో..వాళ్ళందరూ..ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. ఎంతో మంది ఆనందించారు కూడానూ.." అని నసిగా.
"నేనూ చెప్పాగా...నవ్వులు చెప్పా, వేదాంతం చెప్పా, మీ నాన్నగారి గురించి చెప్పా కార్తీక భోజనాలు చేసా, కంప్యూటర్ కా షా టా లు వివరించా.. సంసారాల్లో సరిగమలు పాడా మరేమో" చాలా పకడ్బందిగా మాట్టాడుతోంది.
"చాల్లే..చాలు చాలు. చాలానే చెప్పావు ఒప్పుకుంటా.."
"చిన్న చితకా స్కిట్స్ ప్రదర్శించా...ఇవన్నీ ఒకరా ఇద్దరా 3442 మంది చూసారు తెలుసా.." సాక్ష్యాలతో ఆర్గూ చేస్తోంది.
"అదేం పెద్ద గిన్నీస్ రికార్డా ఏమిటి.."
"ఎందుక్కాదు...feedjit..చూడు అంతర్జాతీయంగా ఎంతమంది చూస్తున్నారో తెలుస్తుంది...అన్ని దేశాలవాళ్ళూ చూస్తున్నారు ఏంటనుకున్నావో"
"చూడరంటంలేదు.. "ఆగాగు...నేను నచ్చానని ఎప్పటికప్పుడు మెచ్చుకుంటూ ఎన్నో వ్యాఖ్యలు వున్నాయి తెలుసా.."
"దాందేముంది.. వాళ్ళు వ్రాసిన బ్లాగు(లు)---మనం బాగుంది(న్నాయి) అంటామో లేదో అని..."
"తప్పుడు కూతలు కుయ్యకు...న్యూ జెర్సీ నుంచి, దుబాయ్ నుంచి, జర్మనీ నుంచి 'కేక', 'కేక' అన్నవారున్నారు...వాళ్ళకే బ్లాగులు లేవు కదా.."
"కరెక్టే ! కాని నువ్వు చూపే వాటిలో మాంచి రుచి ఉండాలి..అందరికీ నచ్చాలి..గొప్పగా ఉందనాలి..అలా వుందా అని.."నసిగా
"అమాయకుడా..నే వనభోజనాలు చేసి పెడ్తే చాలా బాగున్నాయ్ అని 32 మంది కామెంటారు..తెలుసా ఇంకా చెప్పాలంటే చాలా విషయాలకి చాలా సార్లు మెయిల్స్ వచ్చాయ్ కూడాను...ఏంటనుకొన్నావో?" ధీమాతో అంది.
"సరేలే నీమాట నేను కాదనలేను. మన ఓపిక మేరకు మనం చేద్దాం సరేనా?.....ఎవరెవర్ని పిలుద్దాము చెప్పు..ఎలా సెలబ్రేట్ చేద్దాం?"
"ఎవర్నంటే....ముందు సురేఖని పిలుద్దాం."
"ఆవిడెవరు.."
"కృతఘ్నుడా...బ్లాగు ఐడియా ఇచ్చిందావిడే కదా..సారీ ఆయనేకదా? మన యమ్.వి.అప్పారావుగారు."
"నిజమే.రోజూ బ్లాగు బ్లాగు అంటూ ఏదేదో చెప్తూ ఉండేవారు..అది విని విని నేను బ్లాగులకి డిసైడయిపోయాను నిజమే. ఆయనకి కృతఙ్ఞతలు చెప్పాలి.. నెక్స్ట్ ఎవరు చెప్పు."
"బ్లాగురువు...జ్యోతి గారు ఆవిడ్ని పిలవ్వా?"
"అమ్మో ఆవిడ్ని తప్పకుండా రమ్మనాలి..బ్లాగు పాఠాలు చెప్పడమే కాదు..ఎన్నో కష్ట సమయాల్లో ఆదుకున్నారు." గురుభక్తి చూపా..
"ఓ సారి నే తప్పిపోతే ఆవిడ ద్వారానే మళ్ళీ దొరికానన్నావు..మరచిపోయావా?" బుజ్జి ఙ్ఞాపకశక్తికి జోహార్లు. "అలా ఎలా మరిచిపోతాను..ప్రకటన కూడా ఇచ్చాను.."
"వనభోజనాలు, మేగజైన్ కాన్సెప్ట్..ఆవిడ మస్తిష్క జనితాలే కదా?"
"..ఇంకా చాలా ఉన్నాయి..ఆవిడని తప్పక గౌరవిద్దాం. బులుసువారిని కూడా పిలుద్దాము. మనమంటే పాపం చాలా ఇదిగా ఉంటారు" అన్నా
"మిస్సన్న గారిని కూడా ఆహ్వానించు..ఏదైనా పద్యం వ్రాసినా వ్రాయొచ్చు."అంది బుజ్జి బ్లాగు..
"లండన్ నుంచి శివకుమార్, దుబాయ్ సుభద్ర గారు ఇలా చాలామంది ఉన్నారు....నేనందరినీ పిలుస్తాను.."
"ముఖం పుస్తకంలో కూడా చాలామంది స్నేహితులున్నారు కదా వాళ్ళనికూడా పిలు." లిష్టు కూడా పెద్దదే...పిలుస్తాను. అందర్నీ పిలుస్తాను ...కాని ఓ కండిషన్" బుజ్జి బ్లాగుకి కొంచెం సుద్దులు చెప్దామనిపించింది.
"కండిషనా..అదేమిటీ?"
"ఏం లేదు..ఇక ముందు ముందు మంచి మంచి రచనలతో అందర్నీ అలరించాలి. ఇంకా ఎక్కువమంది నిన్ను సెహభాష్ అనాలి..అప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది....ఓ కే నా? అప్పుడే నెక్స్ట్ పుట్టినరోజు చేసేది..ఇష్టమేనా" అడిగా బుజ్జి బ్లాగుని..
"వెఱ్ఱివాడా..బ్లాగుని మాత్రమే నేను...నువ్వు ఆక్కడ పెట్టిందే ఇక్కడ నీకు దక్కుడు. ఈ బ్లాగు బ్లాగోగులుకి కర్తవి నీవే! కర్మా క్రియా కూడా నీవే.....నేను సాక్షిని మాత్రమే........"
గ్లీతోపదేశం చేసి బుడి బుడి నడకలతో దర్జాగా హాస్యవల్లరికి చుట్టుకుంది బుజ్జి బ్లాగు...
"ఏడాదిలో ఈ వల్లరి ఎంత ఎదిగిపోయింది.." అయోమయంగా అటే చూస్తూ వేలు క్రింద ముక్కేసుకున్నాను.
(షరా:::తాపేశ్వరం మడత కాజాలు, కజ్జికాయలు, పిండి పులిహోర ...భోంచేసి వెళ్ళండి)
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
మీ బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
నాకు తొందరెక్కువ. ఒక రోజు, కాదు కొన్ని గంటలు ముందు చెప్పేసా.
ఇలాగే మీరు నవ్వుతూ, మమ్మల్నందరిని నవ్విస్తూ మీ బ్లాగు మరెన్నో పుట్టిన రోజు పండుగలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీరు అక్కడ పెట్టినవన్నీ తిని బ్రేవ్ మంటూ వెళుతున్నాను.
Many Many happy returns of the day. Keep spreading lots of smiles to the world.
Siva Kumar Dinavahi
Leicester, UK
Looking at the pictures of the sweets and pindi pulihora in the birthday offer - gives me a real needed flavour that has wiped off the pizza and pasta around me.
Hasya Vallari, puttina roju subhakankshalu :-)
మీ బ్లాగుకు యాపీ యాపీ బర్త్ డే...
మరి నాకు కిలో ఆత్రేయపురం పూతరేకులు, ఆరకిలో తాపేశ్వరం కాజాలు పార్సెల్ చేయాలి. ఇలా ఫుటోలు పెట్టి ఊరిస్తారా మరి. నాకిప్పుడు తినాలని ఉంది. మా చుట్టుపక్కల దొరకవు.. అదీ సంగతి..
Mee blogki many many happy returns of the day dad....ila photos tho saripetteste...chooste noruripothondi....
:)మీ వల్లరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు అలాగ ఫోటోలు పెట్టేస్తే ఎలాగా? ఇప్పుడు షాప్ కి పరిగెట్టాలి మేము..
హాప్పిహాప్పి బర్త్ డే మీ బ్లాగ్ కి....కాజాలు ఫొటో మాత్రం అదుర్స్ :)
ఏంతేంతి ! పుత్తిన లోజంటే మల్లీనా అలుకున్నా! మీ బ్లాగబ్బాయిదా! బలే బలే అప్పులే ఏలాదయ్యిందా?!!
లోజులు బలెబలె గా పలుగెత్తున్నాయేం! ఆ చీట్లు నాకూ పంపాలేం! నాకు చీత్లంటే ఇత్తమని తెలుసుగా!!
బోల్డు పుత్తిన్లోజు చుబాకాంచలు తీచేచుకొని నాకు కాజాలు ఇవ్వాలి !! నీ చులేకప్పారావు
బులుసువారికి,
ఆత్మీయం ముందువచ్చి ఏర్పాట్లన్నీ చూసుకోబట్టికదా .. కార్యక్రమం శోభాయమానం అయింది.. నేనందుకే అన్నా నేనంటే మీకు చాలా "ఇది" అని. "అదే" "ఇది"- మీ అభిమానానికి కృతఙ్ఞతలు...
Dear Siva, Thanq. for ur good wishes. Yes our traditional food is great...
Thank u krishna garu,I will reply ur mail seperate.
జ్యోతిగారు, మేము మీకు రైలువేటు దూరంలో ఉన్నాము..గౌతమి ఎక్కండి
గోదావరీ తీరంలో దిగండి (స్టేషన్ రాజమండ్రి). తాపేశ్వరం మడత కాజాలు,
కోటయ్య గుల్ల కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు మరియు మామిడి తాండ్ర...పిండి పులిహోర (ఇదిమాత్రం ఆవిణ్ణి అడగాలండోయ్).తిన్నన్ని
తినడం రైలులో పట్టినన్ని పెట్టి పట్టుకెళ్ళడం. మీకోసం మా తలుపులెప్పుడూ తెరుచుకునే వుంటాయి..అయితే కాలింగ్ బెల్ కొట్టాలి సుమా! ఇక మీదే ఆలస్యం.
శాంతీ, ఇంత త్వరగా చూడ్డం ఆశ్చర్యం..నీ కామెంట్స్ కు చాలా చాలా కృతఙ్ఞతలు..
కృష్ణప్రియ..ఒక్క పరుగు ఇటు పెట్టండి..బోల్డు బోల్డు పార్శిల్ కట్టి ఇస్తాను.మా బ్లాగు చూసి స్పందన తెలిపినందుకు కృతఙ్ఞతలు.
ఇందు గారు చాలా సంతోషమండి...చాలా చాలా అభివందనములు.
ఆలస్యంగా స్పందించినా అల్పమేమీ కాని అప్పారావు గారు
బుజ్జాయి భాషలో మీ అభినందన..చాలా బాగుంది.
మలీ... మలీ... మా బందేమో.....చాలా చాలా లేతయింది......మలీ ..... అందుకనీ....
పుత్తిన లోజని బ్లాగుకు
ఉత్తుత్తివి చీత్లు పెత్తి ఊలింతాలా ?
ఎత్తుకు ముద్దెత్తుకు త-
ప్పత్తులు కొత్తాలు వాల్లు పాపం లామా!
belated birthday wishes to your blog!!!!!
ప్రముఖ గాయని. జానకి గారు...పెద్ద పెద్దవారి కీర్తనలు ఎంత గొప్పగా పాడుతారో చిన్న పిల్లల భాషలో అంత చక్కగానూ మెప్పిస్తారు..ఆ ప్రతిభ అనన్యసాధ్యం...ఆ ప్రతిభ మీలోనూ దర్శనమిస్తున్నది.. మిస్సన్నగారు ! నా "పుత్తిన లోజుకి మిస్సన్నగారు ఓ పజ్జెం చెప్పకపోతారా" అన్న నా ఆశకు ప్రాణంపోసారు...ధన్యుణ్ణి.
థాంక్యూ డియర్ ప్రణవ్....బిలేటెడ్ రిప్లై టు యువర్ బిలేటేడ్ గ్రీటింగ్స్.
మిస్సన్న గారి పజ్జెం చూపల్ హిత్తు (సూపర్ హిట్)
"ఎన్నెల" మామీద పడలేదు...బ్యాడ్ లక్... ఆ ఎన్నెల వెలుగులో క్రొత్త స్పూర్తి పొందేవాణ్ణేమోనని....
మీ స్పందనకు కృతఙ్ఞతలు...మిస్సన్న గారు చూస్తారేమో..నేనూ మెయిల్ చేస్తా....
Post a Comment