Pages

Monday, July 9, 2012

హలో బ్లాగున్నారా ?




1.Guest Couple, 2. Bulusu Subrahmanyam gaaru with camera 3.Guest and Me 4. Srimati ME and Srimathi GUEST.(date of photos 9th july and not as you see on photo)

సింహాద్రి అప్పన్నగారి ఫోన్... ఎవరీ సింహాద్రి... మీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది...
"హలో..ఎవరండీ...?"
"నేను మీ ఇంటికి వస్తున్నాను.. రెండురోజుల్లో.. "
"ఎందుకుట ?" అడిగా...
"నవ్విస్తా..." 
"మీకదేం సరదా ? ఇంతకీ మీరెవ్వరు...?" ...
"నేనండీ బులుసు సుబ్రహ్మణ్యాన్ని... నవ్వితే నవ్వండి బ్లాగు ఓనరు."
"మీరా?"
"మీరాను కాదండీ..సుబ్రహ్మణ్యాన్నండీ... ఇంతకీ ఇటు నేనేనా.. అటు మీరేనా ?"
"నేనే...మీరే/\మీరే నేను..." ఏమిటేమిటో... అన్నట్టుగానే సుబ్రహ్మణ్యంగారు సతీ సమేతంగా ఈ రోజు ఉదయం మా ఇంటికి వచ్చారు.. బ్లాగులోనే పరిచయం..ఎప్పుడు ఎదురుపడలేదు. ఆయన రావడం చాలా ఆనందమైంది. సుమారు రెండుగంటలు మా ఇంట్లో ఉన్నారు.. చమత్కార సంభాషణలు సరదాగా సాగేయి... లక్ష్మీ అని పిలవబడే వారి శ్రీమతి అంటే మన ప్రద్యుమ్నుడిగారి భార్య చాలా ఆనందంగా మాట్లాడారు.. మళ్లీ వస్తారట.. ఈ చుట్టుప్రక్కల అన్నీ చూపించి, వారి కారులో పెట్రోలు బంకుదాకా తీసుకెళ్లి పెట్రోలు పోయించాక నాకు థాంక్స్ .. టా టా ఏకకాలంలో చెప్తారట... నేను పర్సు మూయకుండా ఆటో ఎక్కి ఇంటికి చేరాలట. ఇదంతా చెప్పడానికి నేపథ్యం.. మా ఆపెను ఆయన చెల్లిగా గౌరవిస్తున్నారట.. అందుకని బావమరదిగా నా బాధ్యత నిర్వర్తించాలట.. .. మా అన్నగారెందుకు ఇస్తారని ఆవిడ నాకు సప్పోర్ట్ ఇచ్చారు.. ఇన్ని చెప్పినాయన మా ఇంట్లో కాఫీమాత్రమే తీసుకున్నారు.. మందేసుకోవాలి కనుక ఏలూరునుంచి వస్తూ దారిలో తినేసామన్నారు... బ్లాగుల పరిచయం ఇంత ఆత్మీయం అయినందుకు ఆనందమైంది. మా ఇంటికి దగ్గరగా ఉన్న అప్పారావుగారింటికి (అంటే సురేఖగారు) వెళ్లాము. అప్పారావుగారు "ఈగ"సినీమా చూసిన విషయం చెప్పారు. ఈగ బాగుందన్నారు.   బాపుగారి విషయం వచ్చినప్పుడు బాపుగారిపై ఎంత బాగున్నా ఈగను వ్రాలనీయలేదు... చక్కటి చర్చ ఒకటి మా మధ్య సాగింది.. ఇన్ కెమెరా.. బాపు రమణలను అంతగా అభిమానించే మా అప్పారావుగారిలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు.. అక్కడనుంచి సుబ్రహ్మణ్యంగారు వారి పనికై బయల్దేరారు..
ఇంతకీ ఆయన ఎందుకు వచ్చారో తెలుసా ? ఈమధ్య చిన్నవయస్సులోనే స్వర్గస్తుడైన మన బ్లాగ్ మిత్రుడు సరస్వతుల శంకర్ అంత్యక్రియల్లో ఆఖరిరోజు కార్యక్రమానికి.. ఆ శంకర్ ను ఈయన వీడియో చాట్ లోనే చూసారట... సుబ్రహ్మణ్యంగారి హృదయ సంస్కారానికి శిరసా అంజలి ఘటిస్తున్నాను.. బ్లాగులో ఇంత మంచి మిత్రులు ఉన్నందుకు సంతోషిస్తూ, బ్లాగు సంస్కృతిని కాపాడుకుందాం అని కోరుకుంటూ....

12 comments:

రాజ్ కుమార్ said...

Kevvvv u r so lucky sir.. Nice pics

శశి కళ said...

యెంత చక్కటి అనుభందాలు మన అందరి మద్య
యెంత చిక్కగా అల్లుకుని పోయాయి

బులుసు సుబ్రహ్మణ్యం said...

నా తరఫునా, నా శ్రీమతి గారి తరఫునా మీకు, మీ శ్రీమతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఆతిధ్యానికి, ఆత్మీయతకి కృతజ్ఞతలు.

మా ఆవిడ ఫోటోలు బ్లాగు కెక్కించినందుకు ఆమె ఆనందభరితయైనది. మీకు నా ద్వారా కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలిపింది.
ఇప్పటిదాకా నేనా పని చేయనందుకు నాకు......

నేనూ ఫోటోలు తీసాను కానీ ఫోటోలో ఎవరూ పడలేదు. కెమేరానే కింద పడింది.....దహా.

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

హలో బాగున్నాను. శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం దంపతులను మా ఇంటికి తీసుకు వచ్చినందుకు ముందుగా మీకు
నా ధన్యవాదాలు. మా ఇద్దరి మధ్య జరిగిన వాదాలు ( బాపు గారి పుస్తకం మీద ) చెప్పినందుకూ మరోసారి ధన్య
వాదాలు.

Anonymous said...

మంచి విషయం చెప్పేరు. బులుసు వారితో మీ పరిచయం.

ఆ.సౌమ్య said...

అప్పన్న గారిని కలిసిన అదృష్టవంతులలో నేనూ ఉన్నాను. ఆయన్ని కలిసిన మొదటి వ్యక్తినో, రెండోదాన్నో!

మీ ఆనందం నాకు అర్థం అవుతోంది :))

హనుమంత రావు said...

రాజకుమార్ గారు, థాంక్సండి.. బులుసు వారు వస్తానని ఫోన్ చెయ్యగానే నేనూ ..కెవ్వు....

శశికళ గారూ, చక్కగా చెప్పారు.. ఈ బ్లాగుల్లో అనుబంధాలు జీవితంలో మరో మలుపు

సుబ్రహ్మణ్యంగారు, ఆతిథ్యమా ? అదో జోకా .. ఏమిచ్చామని. ఆత్మీయత అంటే మీ తర్వాతే అన్నది అనుభవమైంది. మీ శ్రీమతి గారికి మీకేవో..అన్నారు. మా సోదరి మహా ఇల్లాలు.. మీరు చెప్పేdi జోకుగానేభావిస్తాం తప్ప నిజమనుకోము నిజంగా.. కెమెరా మీ జోకులకి పడిపోయి ఉంటుంది.. మేమే పడిపోతున్నాంగా...

అప్పారావుగారూ, మీ సహృదయానికి ధన్యవాదములు

కష్టే ఫలే గారూ,, బులుసువారితో పరిచయం నిజంగా మంచి విషయం.. అందుకే చెప్పా

సౌమ్యగారు, మీ మీద ఈర్ష్య.. ముందు మీతో పరిచయమైనందుకు.. అందరితోనూ ఆత్మీయతను పంచుకునే బులుసువారి సహృదయం అభినందనీయం కదా?

మొత్తంగా అందరికీ:::: ఒక మంచిమనిషి మా ఇంటికి వచ్చిన ప్రభావం చూసారా... మీ అందరూ ఆత్మీయంగా పలకరించారు.. ఈ ఆత్మీయత నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను.

Unknown said...

MOM,DAD,AUNTY AND UNCLE looking grt.so nice to c u all taking ur friendship through blogs to newer heights.congratulations.
daughter of MR.BULUSU SUBRAHMANYAM

హనుమంత రావు said...

Siri, thank you for your affectionate sentiments. Story, Screenplay, Direction and everything is Dad..we r simply instrumental.

janaa said...

అయ్యా! మీ బ్లాగుల్లొకె వెడుఠున్నకొద్దీ ఏదొ కలల ప్రపంచం లొకి పెద్దపెద్ద వాళ్ళ మధ్యలొకి వచ్హినట్టు ఫీలవుతున్నాను.మీకు నా ధన్యవాదాలు త్వరలొ అందరినీ పరిచయం చేసుకొవాలని ఆశపడుతున్న.....మీ JANARDHAN

హనుమంత రావు said...

జనాగారు ! ఇప్పుడే మీ వ్యాఖ్య చూసా.. నా పోస్ట్ కు మీ స్పందన నాలో ఉత్సాహాన్ని నింపింది.. చాలా చాలా సంతోషం.. మీ జనప్రియ బ్లాగు చూసా.. ఇంకా ఏమీ పోస్ట్ చేయలేదు.. ఉద్యమించండి... నా పాత పోస్టులు కూడా చూసి స్పందించండి..

Ennela said...

idi jarigi inni rojulayina pimmata nenu spandinchadam avasaramaa ledaa ani inkaa alochistunnaa..idi choosi janaalu " navvi poduru gaakaa-naaketi siggu" ani ikkada chipaayinchesaa..mimmalnandarinee choodadam chaalaa chaalaa baagundi..

naa koththa post topic" bulusu gaari family meeda ennela alakalu"..this is because, maa intiki rammani yenni saarlu cheppinaa raaledu mari!