


వనిత టి.వి లో ప్రసారమైన "ఇదీ అసలు కథ"కుగాను ఆ సంస్థవారికి నంది అవార్డువచ్చిందని తెలిసి ఆనందం కల్గింది. దాని రూపకర్త "ముళ్ళపూడి సాహిత్యసర్వస్వం" గ్రంధ సంకలనకర్త శ్రీ యమ్బీయస్ ప్రసాద్. 'హాసం' పత్రిక ద్వారా మీకూ నాకూ పరిచయమైన శ్రీ యమ్బీయస్ ప్రసాద్ గార్కి మా హాసం క్లబ్ కారణంగా నేను దగ్గరవడం నా అదృష్టం..ఇవ్వాళ అవార్డ్ వచ్చిందని చెప్తున్న మాట కాదిది. ఇవ్వాళ మనకున్న అతి కొద్దిమంది హాస్య రచయితలలో యెన్నదగిన సమర్ధత వున్న రచయిత శ్రీ ప్రసాద్. వారి రచనలన్నీ చదివానని అబద్ధమాడను..చదివిన అచలపతి కథలు, రాంపండులీలలు, పొగబోతుభార్య ..మొనవి వారి సునిశితహాస్యానికి చెప్పదగినవి. మనగురించి మనం ఆలోచించుకోవలసినఅవసరం వారి రచనల్లో కనపడ్తుంటుంది. "రేడియో, టీ.వీ ల పుణ్యమాఅని క్రికెట్ఆటను విని, చూసి తామేదో క్రీడాభిమానులనుకోవడం జనాలకి పరిపాటి అయింది. ఆరోగ్యంకోసం క్రీడలు ఆడాలికాని చర్చిస్తే సరిపోదు. ఆఫీసు పని ఎగ్గొట్టి క్రికెట్ కామెంటరీ విననివాడు "అన్ స్పోర్టివ్" అనేటంతవరకు పోయింది పరిస్థితి..." ఆలోచించాలనిపిస్తున్నది కదా...ఇది శ్ర్రీ ప్రసాద్ గారి అచలపతికథల్లో...
"ఇదీ అసలుకథ" విషయానికి వస్తే....వనిత టీవీలో...వారానికో రోజు రాత్రి10.30కి వచ్చేది...ఎన్నో మంచి మంచి సినీమాలు యెంచుకొని, వాటికి ఆధారమైనఅసలు సినీమా ఏ భాషలో వున్న అది చెప్తూ..యెక్కడ మార్చారో..దానివలనవచ్చిన స్వారస్యం చర్చిండం..ఏ నటుడు ఏ భాషలో బాగా చేసాడో సోదాహరణంగాచెప్పడం...ఆ సినిమా క్లిప్పింగులు, ఈ సినిమా క్లిప్పింగులు అన్నీ చూపడం,తన అందమైన వ్యాఖ్యానం....వాహ్...నిజంగా చాలా అద్భుతం. ఎంత శ్రమ పడ్డారోఆ కార్యక్రమం రక్తి కట్టించాలని...అదే ఆయనతో నేనన్నాను కూడా...ఏమైనా ఆయనశ్రమకు గుర్తింపు ఈ అవార్డు...శ్రీ ప్రసాద్ గార్ని మనసారా అభినందిస్తున్నాను.వనిత టీవీ వారుకూడా ఈ మహావ్యక్తిని సమ్మానించవలసినసమయం....ఇంత కష్టం పడుతున్న భర్తకు అంత శ్రమాపడి సహకరించిన వారి శ్రీమతికి కూడా అభినందనలు
నేను వ్రాసి, ప్రదర్శించిన స్కిట్స్ అవీ చూసి నన్ను హాస్య రచనలు చేయమని ప్రోత్సహించిన సౌజన్యమూర్తి శ్రీ ప్రసాద్. నేను బ్లాగులో హాస్యం వ్రాసే ప్రయత్నానికి అదో స్ఫూర్తి. ఈ హాస్యరచయితను మా హాసం క్లబ్ తన అయిదవ వార్షికోత్సవమప్పుడు ఆహ్వానించి హాసం పత్రిక వ్యవస్థాపకులు, శాంతా బయోటెక్నిక్స్ అధినేత శ్రీవరప్రసాదరెడ్డిగారి చేతుల మీదుగా సన్మానించగలగడం...హాసంక్లబ్ కు ఆనందకారణం...కన్వీనర్స్ లో ఒకడిగా నాకు గర్వకారణం. మరొకసారి వార్ని హాస్యాభిమానులైన మీ తరఫునానా తరఫునా అభినందిస్తూ... శలవు.
3 comments:
అవార్డు ఎంబీయస్ ప్రసాద్ తయారుచేసిన కార్యక్రమానికే కానీ, అవర్డు అందుకునేది ఆ కార్యక్రమ నిర్మాత, ఎంబీయస్ కాదు. దాన్లో ఎంబీయస్ శ్రమ ప్రసక్తేలేదు. సినిమా కథ, స్చ్రీన్ ప్లే, ఎడిటింగ్. దర్శకత్వం, సంగీతం బాధ్యతలన్నీ ఒకరే నిర్వహించినా ఉత్తమ సినిమా అవార్డు అందుకునేది ఎలాంటి పని చేయకున్నా నిర్మాతనే కదా!
మురళీక్రిష్ణగారూ
ఈ విషయాన్ని మీరు దయచేసి అవార్డు పెద్దల దృష్టికి
తీసుకుని వెళ్లగలరు. వీలుంటే పత్రికల్లో మీ అభిప్రాయం
ప్రకటించబడేలా ప్రయత్నించండి. మీకు కష్టం కాదు కదూ :)
యమ్బీయస్ ప్రసాద్ గారి ఈ-పుస్తకాలు ఇప్పుడు కినిగెలో లభిస్తున్నాయి. వివరాలకు ఈ లింకు నొక్కి చూడండి.
Post a Comment