హాస్య వల్లరి
నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Monday, August 30, 2021
హాస్య వల్లరి: కృష్ణాష్టమి
హాస్య వల్లరి: కృష్ణాష్టమి:
" సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి
కతలాయ నడురేయి కలిగె శ్రీ కృష్ణుడు ||"
" సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ...
Wednesday, April 1, 2020
శ్రీ రామ నవమి
--- దినవహి వేంకట హనుమంతరావు
శ్రీ రామ నవమి - అభిజిత్ లగ్నం - వాడ వాడలా ఆనందోత్సవములు - సీతారాముల కళ్యాణం.
రాణ్మౌని వెంట నడచిన కోదండ పాణి మిథిలానగరానికి చేరారు.. శివధనుర్భంగమయింది.
సీతారాముల వివాహోత్సవం.
రాణ్మౌని వెంట నడచిన కోదండ పాణి మిథిలానగరానికి చేరారు.. శివధనుర్భంగమయింది.
సీతారాముల వివాహోత్సవం.
అయోధ్యనుండి దశరథుడు ఆనందంగా తరలి వచ్చాడు.,,,,
చలువ పందిళ్లు, విశాలమైన మంటపాలు. వివిధ పరిమళాలతో గుబాళించు పుష్ప మాలికల
అలంకారాలు, మామిడి తోరణాలు, నూతన వస్త్రాలతో శోభిల్లు నగరవాసులు, పట్టు చీరలు కట్టి,
సిగలో పూదండలు ముడిచి, పసుపు పారాణితో నిండైన కుంకుమ బొట్టుతో శోభాయమానముగా
కదలి వచ్చు ముత్తైదువలు… పెళ్లి సందడి మొదలయింది.

‘యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః
బ్రాతృభిః సహితో రామః కృత కౌతుక మంగళః…’
సర్వాలంకరణ శోభితుడై సుముహూర్త సమయానికి శ్రీరాముడు కళ్యాణ వేదికకు వచ్చాడు.
వేద వేదాంగ పారంగతులైన విప్రవరులు - వశిష్ట మహర్షి, శతానందుల ననుసరించి వేదమంత్రాలు
పఠింపగా, మంగళ వాయిద్యములు మారుమ్రోగగా, ఆనందము వెల్లి విరియ.... జనక మహీపతి....
వేద వేదాంగ పారంగతులైన విప్రవరులు - వశిష్ట మహర్షి, శతానందుల ననుసరించి వేదమంత్రాలు
పఠింపగా, మంగళ వాయిద్యములు మారుమ్రోగగా, ఆనందము వెల్లి విరియ.... జనక మహీపతి....
“తతస్సీతా సమానీయ సర్వాభరణ భూషితామ్........”
సర్వభూషణాలంకృత యైన సీతను తీసికొని వచ్చి అగ్నిహోత్రం దగ్గర
శ్రీరామునికభిముఖంగా కూర్చుండ జేసి…
“ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా…
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా
ఇత్యుక్త్వా ప్రాక్షిప ద్రాజా మంత్రపూతం జలం తదా..”
అంటూ సీత చేతిని రాముని చేతిలో ఉంచి మంత్ర జలములతో సీతను రామునికిచ్చాడు.
“దహరంబు కరుగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ” అంటారు త్యాగయ్య.
జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మ రాగాయితా
న్యస్తా రాఘవమస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః
స్రస్తాః శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః
శ్రీ సీతారాముల వివాహమందలి తలంబ్రాల ముత్యములు శుభము నిచ్చునవి యగుగాక అంటూ
వేదజ్ఞులు ఆశీర్వదిస్తూ స్వస్తి పలకడంతో పెళ్లి వేడుక పూర్తి అవుతుంది.
వేదజ్ఞులు ఆశీర్వదిస్తూ స్వస్తి పలకడంతో పెళ్లి వేడుక పూర్తి అవుతుంది.
వాడ వాడాలా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. నిత్య స్మరణీయం
సీతారాముల దాంపత్యం. వారి కళ్యాణ వైభోగం మరల మరల చూడాలని,
సీతారాముల దాంపత్యం. వారి కళ్యాణ వైభోగం మరల మరల చూడాలని,
మళ్ళీ మళ్ళీ వినాలని ఈ పర్వదినం కోసం మనమందరమూ వేయికనులతో ఎదురు చూస్తూ
ఉంటాము. భద్రాద్రిలో జరిగే కళ్యాణోత్సవము స్వయంగా చూడలేని వారి కోసం రేడియోల కాలం
నుంచి లబ్ధ ప్రతిష్టితులైన కవులూ పండితులూ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తుంటే చెవులారా వీక్షించే
వారము. ఆ తర్వాత బుల్లి తెరపై వ్యాఖ్యానం… నయనానందకరంగా చూస్తూ… శ్రవణానందకరంగా
ఆస్వాదించే వారము.... కొందరైతే ఇంటి పురోహితుల బ్రహ్మత్వంలో వారి వారి గృహాలలో కళ్యాణము
జరిపించుకోవడం, అదీ వీలుకాని వారు శక్తి కొలదీ సీతారాములకు పూజాదికములు జరుపుకుని
వేదవిదులను దక్షిణ తాంబూలాలతో సత్కరించడం మనకు తెలుసు.

అయితే ఈ సంవత్సరం కరోనా అనే మహమ్మారి విశ్వవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది.
తనకనుకూలమైన ఉపాధులలో ప్రవేశించి వారి జీవితాలతో ఆడుకుంటున్నది. జనాలను
భయపెడ్తున్నది. పాలకులు ఈ వైరస్ నివారణ చర్యలో భాగంగా కొన్ని ఆంక్షలు విధించడం వలన
బయటికి తిరగలేని పరిస్థితి. బహిరంగ ప్రదేశాలలో జన సమూహములు కూడదన్నారు.
దేవాలయములలో ఏ ఉత్సవాలు జరిగే పరిస్థితిలేదు. కనుక నిరాడంబరంగా కళ్యాణం
జరిపించమన్నారు. పురోహితులు కూడా గృహస్తులకడకు వచ్చే పరిస్థితి లేదు.

అయినా నిరాశ పడనక్కర లేదు.. ఆడంబరంగా చేసే కళ్యాణోత్సవమైనా… నిరాడంబరంగా చేసే
ఇంటిలోని పూజయినా ఆ లీలామానుష విగ్రహునికి ఒకటే. ‘రేపు నీకు యువరాజుగా పట్టాభిషేక’
మని తండ్రిగారన్నపుడెలా ఉన్నాడో, ‘నేటినుంచి వనవాస’మని ‘అది తండ్రిగారి మాట’ అని
తల్లి చెప్పినపుడూ అలాగే ఉన్నాడు. ‘ద్యుతిమాన్, ధృతిమాన్’ - అదీ శ్రీరామచంద్రుడు.

కనుక గురుదేవుల ఆజ్ఞానుసారము మన మన ఇళ్లలోనే పూజ చేసుకుందాము..
ఆ లీలా మానుష విగ్రహుని లీలగా ఈ ప్రస్తుత పరిస్థితిని భావిద్దాము. “చుట్టూ ఉన్న ప్రపంచాన్ని
చూసే దృష్టి మార్చుకో. చూపు లోపలికి త్రిప్పు.” అంటున్న రామసందేశాన్ని గ్రహిద్దాము.
హృదయ పీఠంపై ఆత్మారాముని ఆహ్వానించి. శక్తి రూపంగా ఉన్న సీతమ్మను ఆయనకు
వామాంకం పైఁ ధ్యానిద్దాము. ఆదిశేషుని అంశతో … పరబ్రహ్మమే లక్ష్యంగా పయనించే
కుండలినీ శక్తి… సుమిత్రానందనుడు ఒకప్రక్క., శంఖం పూరిస్తూ వేదనాదం వినిపిస్తూ
భరతుడూ.. అరిషడ్వర్గములను నిర్మూలించే శత్రుంజయుడు శత్రుఘ్నుడూ.. ప్రాణశక్తిగా
సంచరించే అనిల కుమారుడూ. సేవచేస్తుండగా.. ఇంద్రియానీకము దేవతా బృందమై
పరివేష్టితమవగా భక్తి నిండిన నేత్రద్వయము సకల నదీ జలముల వర్షింపగా శ్రీ రామ పట్టాభిషేకం
ఆనందంగా అంతరంగ పీఠిపై జరుపుకుందాము. శ్రీరామానుగ్రహము పొందుదాం.

రామచంద్ర చరితా కథామృతం, లక్ష్మణాగ్రజ గుణానుకీర్తనమ్,
రాఘవేశ తవ పాదసేవనం, సంభవంతు మమ జన్మ జన్మని.
“ఓ రామచంద్రా! నీ చరిత్ర కథ యను అమృతమును,
ఓ లక్ష్మణాగ్రజా! నీ గుణ కీర్తనమును,
ఓ రాఘవేశా! నీ పాద సేవయునూ
నాకు బ్రతి జన్మమందూ సంభవించుగాక…”
---000---
Tuesday, April 17, 2018
(అప్పట్లో మా మిత్రులతో కలసి రాజమండ్రిలో హాసం క్లబ్ నిర్వహించేవారం. "హా" అంటే హాస్యం,
"సం" అంటే సంగీతం.. రెండూ కలసి హాసం.. చాలా కాలం అంటే సుమారు 10 ఏళ్ళు విజయవంతంగా
నిర్వహించాము. ఇప్పటికీ మళ్ళీ మొదలు పెట్టండి అనేవాళ్ళు ఎక్కువ.. ఆ జ్ఞాపకాలలొంచి.....)
"సం" అంటే సంగీతం.. రెండూ కలసి హాసం.. చాలా కాలం అంటే సుమారు 10 ఏళ్ళు విజయవంతంగా
నిర్వహించాము. ఇప్పటికీ మళ్ళీ మొదలు పెట్టండి అనేవాళ్ళు ఎక్కువ.. ఆ జ్ఞాపకాలలొంచి.....)
‘హాసం క్లబ్’ కార్యక్రమాలలో నాకో అడ్వాంటేజ్ ఉండేది..…
మైకు నా చేతిలోనే ఉండేది.. అందుకని ఎప్పుడైనా ఏ జోకైనా చెప్పొచ్చు.. అవాకులు చవాకులు పేలొచ్చు..
జోకుకీ జోకుకీ మధ్య గాప్ ఫిలప్ చేయడం డ్యూటీ నాదే.. అప్పుడు చమత్కారాలు గుప్పేవాడిని..
జోకుకీ జోకుకీ మధ్య గాప్ ఫిలప్ చేయడం డ్యూటీ నాదే.. అప్పుడు చమత్కారాలు గుప్పేవాడిని..
అలాగే ఓ డిసడ్వాంటేజ్ కూడా ... ముందర నేనే సభ ప్రారంభిస్తాను, నా పేరు చెప్పుకొనే సందర్భం ఉండదు.
అలాగే వందన సమర్పణా నాదే , అక్కడా నేనెవరో చెప్పుకోకుండానే అయిపోతుంది.
ఇక నా పేరు ఎవరికీ పెద్దగా తెలిసే అవకాశముండేది లేదు. అంచేత .. అంటే ఉన్న పేరు ఉంది తప్ప
నేను ఫలానా అని తెలిసేది కాదు.. అదీకాక ఎవరైనా తప్పులు మాట్లాడినా, ఎవర్నైనా పిలవడం
నేను మర్చిపోయినా ..
మొట్టికాయలు నాకే… సరే జోకేవాడి కష్టాలు జోకేవాడివి ఏంచేస్తాం… ఓ సారి సభలో వేసిన జోకు మీకు చెబ్దామని. ..

‘హాసం’ బ్రెయిన్ చైల్డ్ ‘ హాసం క్లబ్ ‘ అన్నాం కదా.. అందుకని మా కార్యక్రమాల గురించి ప్రతీ పత్రికలోనూ వార్తలు,
విశేషాలు వస్తూ ఉండేవి. మొదటి రోజుల్లో మా ప్రోగ్రాం కరపత్రాలు హైదరాబాదు ఆఫీస్ నుండి వచ్చేవి.
ఫలానా టైముకు ఫలానా వేదికమీద కార్యక్రమం ఉంటుందని,..మా కన్వీనర్ల పేర్లు కూడా వేసేవారు..
ఆ కరపత్రాలు మేం ముందుగా పోస్ట్ లో అందుకుని, అందరికీ పంచేవాళ్లం.
మొదటి రోజుల్లో శ్రీరామనగర్ లో మన అప్పారావుగారి డాబా మీద మా కార్యక్రమాలు జరిగేవి..

ఒక రోజు కార్యక్రమంలో … సాయంత్రం 6 గంటలకు సభ. అందరూ వస్తున్నారు..
మే ప్రారంభించడం ఒక అరగంట లేటయింది.6-30 అయిపోయింది. నేను మైకు పుచ్చుకున్నాను.
అందరూ లేటుగా మొదలెట్తున్నందుకు తిట్టడానికి రెడీగా ఉన్నారు.. నవ్వుల కార్యక్రమంలో
సీరియస్ గా ఉంటే ఎలా ? వీళ్లను నవ్వించాలి..
మే ప్రారంభించడం ఒక అరగంట లేటయింది.6-30 అయిపోయింది. నేను మైకు పుచ్చుకున్నాను.
అందరూ లేటుగా మొదలెట్తున్నందుకు తిట్టడానికి రెడీగా ఉన్నారు.. నవ్వుల కార్యక్రమంలో
సీరియస్ గా ఉంటే ఎలా ? వీళ్లను నవ్వించాలి..
”సభా సరస్వతికి నమస్కారం ..(నా అలవాటైన బాణీ )..
“పీ.సి సర్కార్ (సీనియర్) పేరు మీరు వినే ఉంటారు. మన దేశం గర్వించదగ్గ గొప్ప ఐంద్రజాలికుడు.
ఆయనోసారి లండన్ లో తన ఇంద్రజాలం ప్రదర్శిస్తున్నాడు. మొదటిరోజు కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు
ప్రారంభమవాల్సి ఉంది. పావుగంట లేట్ అయ్యింది. విదేశీయులు చాలా panic అయిపోతున్నారు.
ఆయనోసారి లండన్ లో తన ఇంద్రజాలం ప్రదర్శిస్తున్నాడు. మొదటిరోజు కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు
ప్రారంభమవాల్సి ఉంది. పావుగంట లేట్ అయ్యింది. విదేశీయులు చాలా panic అయిపోతున్నారు.
“సర్కార్ మదలెట్టాడు. “ladies and gentlemen ! i am late to start the progm.by fifteen minutes,
I know. Sorry, sir ..I declare that I am not late. check your watches .. it is 7-00 only” అన్నాడట.
అందరూ వాచీలు చూసుకుంటే .. అందరి వాచీలు 7-00 చూపిస్తున్నాయిట ..
ఇది నా ఫస్ట్ ఐటెమ్ అన్నారుట సీనియర్ సర్కార్..

దానికీ దీనికీ ఏం సంబంధమనుకోకండి. మన హాసం కార్యక్రమం 6గంటలకు ప్రారంభించాలి,
కాని ఇప్పుడు 6-30 అయిందనుకుంటున్నారు మీరు.. మీ చేతిలో ఉన్న కరపత్రాలు చూడండి..
మన కార్యక్రమం 6గంటలకే.. “ అని నేను అనగానే … కొంచెం నిశ్శబ్దం .. వెంటనే కరతాళ ధ్వనులు…
కాని ఇప్పుడు 6-30 అయిందనుకుంటున్నారు మీరు.. మీ చేతిలో ఉన్న కరపత్రాలు చూడండి..
మన కార్యక్రమం 6గంటలకే.. “ అని నేను అనగానే … కొంచెం నిశ్శబ్దం .. వెంటనే కరతాళ ధ్వనులు…
[ఇలాంటి స్పాట్ జోకులు మంచి స్పందన కలిగించేవి..]
Wednesday, May 24, 2017
బ్లాగు మిత్రులతో ముచ్చట ....
బ్లాగు మిత్రులతో ముచ్చట ....
అందరికీ నమస్కారం. బ్లాగు జోలికి వచ్చి సంవత్సరం అయిపోతొంది. face book తో ఎక్కువ కాలం గడిపేయడం ఒక కారణం. నిజానికి face book లో ముఖం మీద లైకులు, కామెంట్ లు వెంట వెంటనే వచ్చేస్తాయి. దానితో అక్కడికి పరుగెడతాం కాని, సృజనాత్మకత బ్లాగులోనే ఉందనిపిస్తుంది. మరో కారణం దారుణమైన ఎండలు ఈ వేసవిలో బాధ పెట్టేస్తున్నాయి. బుర్ర కొంచెం కూడా పని చేయడంలేదు. అయినా సరే ఎలాగైనా బ్లాగుకు ఎదో ఒకటి వ్రాసి బ్లాగు మిత్రులతో పంచుకోవాలని ఉంది. మంచి పోస్ట్ త్వరలో పెడతాను.. మీ అందర్నీ ముందు పలకరిద్దామని, ఇలా ఇంత రాత్రి వేళ కంప్యూటర్ ముందు కూర్చున్నాను. ofcourse, ఇవాళ చల్లగాలి ఇప్పుడే తిరిగింది. అందుకని ఈ నాలుగు ముక్కలు వ్రాయాలనిపించింది. త్వరలో బ్లాగు లో పోస్ట్ చేస్తానని చెప్పడానికి వచ్చాను. దీవించండి.
Wednesday, June 22, 2016
మా నాన్నగారి 123వ జయంతి[22-6-1894 - 30-5-1982]
{ శ్రీ దినవహి సత్యనారాయణ }
ఈరోజు నాన్నగారి జయంతి..
నాన్నగారి గురించి --
నాన్నగారికి ఆత్మీయ మిత్రులు మహా పండితులు
కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారి మాటలలో --
సీ|| ఆబాల్యముగా నాంధ్రమందు గవిత్వంబు
నిర్మింప నేర్చిన నిపుణ బుద్ధి,
యాంగ్ల విద్యార్థి రాజ్యమునందు బట్ట భ
ద్రతకు భంగము గన్న రాఘవుండు,
హిందీ సరస్వతీ సౌందర్య సింథు వా
కంఠమ్ము గోలిన కలశభవుడు
పాళీ వచోదేవతా లీల లొకకొంత
చవిచూచినట్టి విజ్ఞానశీలి
తే.గీ || దినవహి పవిత్ర వంశ మౌక్తిక లలామ
మమల చరితుండు సత్యనారాయణుండు
అస్మదాప్త సుహృద్వర్యుడగుట నా య
దృష్ట వైశిష్ట్య మనుచుగర్వింపవలదె !
చం|| అతడు కవీంద్రుడై తెలుగు, నాంగ్లము, హిందియు బ్రాకృతంబులన్
మతి గ్రహించు పుణ్య మహిమంబు ఫలింపగ, రామ మానసో
ర్జిత పరమార్థవేత్త, తులసీకవి మంజుల శారదన్, యథా
స్థితముగ నాంధ్ర శారదగ దీరిచి దిద్దెను రాము పేరనే
గోస్వామి తులసీదాసు కృత శ్రీరామచరిత మానసమును తెలుగు వచనంలో అనువదించి పండిత పామరుల అభిమానము సంపాదించారు. ఈ గ్రంథం మూడు ముద్రణలు పొందింది. బెంగాలీ భాషలో ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన ‘షాజహాన్’ నాటకాన్ని తెలుగులో వ్రాసారు. ఇది కాక ‘ప్రేమచంద్ కథలు’, ‘మేవాడు పతనం’ అనే గ్రంధాలు వ్రాసారు పాళీ భాషలో గ్రామరు వ్రాసారు. గాంధీమహాత్ముని పిలుపుకు స్పందించి బి.ఏ చదువును మధ్యలో వదిలేసి జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొని … హిందీ భాషావ్యాప్తికి విపరీతంగా కృషి చేసారు.. జాతీయ పాఠశాలలో బోధకునిగా పని చేసారు. అప్పుడే నాన్నగారికి శ్రీ వెంపరాల వారితో ఆత్మీయస్నేహం …తర్వాత గుజరాత్ విద్యాపీఠ్ వారి బి.ఏ పట్టా పుచ్చుకుని అసిస్టెంట్ పంచాయత్ ఆఫీసర్ గా, కాటేజ్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ గా ఉద్యోగాలు చేసారు..
ఉన్నత వ్యక్తిత్వం..శ్రీరామ భక్తి .. మూర్తీభవించిన సౌజన్యం అదే నాన్నగారు --- ఈ మహనీయ మూర్తికి తనయునిగా గర్వపడుతూ వారి 123వ జయంతి నాడు సభక్తికంగా వినయాంజలి ఘటిస్తున్నాను.
((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((o0o))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
Subscribe to:
Posts (Atom)