Pages

Saturday, August 2, 2014

బ్లాగు పుట్టిన రోజు..(2010 టు 2014)


ఈ రోజుకి (2-8-2014) నాలుగెళ్లి ఐదు వచ్చాయి.. నా బ్లాగుకి.


“హాయ్ అంకుల్”... “హాయ్ ఆంటీ”
అనుకుంటూ నా వెనకాలే వచ్చేసింది నా బ్లాగ్ ..
“ఏంటా పలకరింపు?  వచ్చిన వాళెవరో చూసావా ?” అన్నాను.
“ఎవరూ” అని - ‘?’ మార్క్ ఫేస్ పెట్టింది..
“ఇంతకీ ఎందుకొచ్చారు?” అని మళ్లీ అడిగింది.
“తప్పమ్మా - అలా మొహమ్మీద అడక్కూడదు.” అని బుద్ధులు చెప్పా …
“రహస్యంగా అడగనా? ఐతే  నువ్వు చెప్పు, రహస్యంగా అడుగుతా” అని చెవులో గట్టిగా అడిగింది.
వచ్చిన వాళ్లందరూ ఘొల్లున నవ్వారు..
“‘హేపీ బర్త్ డే ’హాస్య వల్లరి” అంటూ బ్లాగుకి షేక్ హాండ్ ఇచ్చారు.
“ఓ .. ఈ రోజు నా బర్త్ డే ..” అని సిగ్గుతో మెలికలు తిరిగింది బ్లాగ్.
“చూసావా .. నువ్వు మరచిపోయావు, నీకు సర్ప్రైస్ చేద్దామని వీళ్లందరినీ పార్టీకి పిలిచా..”అన్నా..
“నేనేం మరచిపోలేదు.. చాక్లెట్స్ ఇద్దామని వెళ్తున్నాను .. నువ్వు పిలిచావు..” అంది బ్లాగ్.
“నీ పుట్టిన రోజు ఫంక్షన్ చేద్దామని - చాలామందికి రమ్మని చెప్పాను.. కొందరొచ్చారు.. కొందరు ఫోన్ లో నీకు గ్రీటింగ్స్ చెప్పమన్నారు.. రా వీళ్లందరి బ్లెస్సింగ్స్ తీసుకో” అని   మా బ్లాగును  అభిమానుల దగ్గరికి తీసుకు వెళ్లా ..

m.v.apparao(surekha) with sir Bapu.






“ముందర ఈయన బ్లెస్సింగ్స్ తీసుకో”
“ఎవరీయన ?”
“ఈయన ప్రఖ్యాత కార్టూనిస్ట్, ‘సురేఖ’ -  కార్టూన్స్ వేస్తారు..”
“తెలుసు తెలుసు, నమస్తే అప్పారావు అంకుల్. ఈయన చెప్తేనేగదా .. నువ్వు నన్ను క్రియేట్ చేసావు” అని అప్పారావుగారికి పాద నమస్కారము చేసింది..
నాకు చాలా సంతోషం వేసింది..



“ఈవిడ …” నే చెప్పబోతున్నాను..
“ఆంటీ ! ఎలా ఉన్నారు” అంటూ జ్యోతిగారి దగ్గరికి పరుగెట్టింది.
jyoti valaboju 
“జ్యోతి వలబోజుగారు నీకు గుర్తున్నారా ..” అని అడిగా..
“అయ్యో.. ఆంటీ తెలియక పోవడమేంటి, నేనో సారి తప్పిపోతే నన్ను వెతికి పట్టుకున్నారు. చిన్నప్పట్నించి నా ఆలనా పాలనా చూస్తున్నారు.. అంతే కాదు .. మీ గురువుగారు కదా..” అని నాతో అని,
“ఏంటాంటీ .. ఈ మధ్య నన్ను మరచిపోయారు.. అస్సలు నన్ను పలకరించడం లేదు” అని గారాం చేసింది..
“నే మరచిపోలేదు, నువ్వే నన్ను మరచిపోయావు,, ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు ఈ మధ్య” అన్నారు జ్యోతి.
అనగానే బ్లాగ్ నా కేసి తిరిగి “... చూడు, అంతా నీ మూలాన్నే  .. నువ్వే నన్నసలు ఎక్కడకీ తీసుకెళ్లటం లేదు .. చూడు పాపం, ఆంటీ ఎంత ఇదవుతున్నారో” అని నామీదకు యుద్ధానికొచ్చింది..
“సారీ జ్యోతి గారు,, ఏమిటో అసలు ఈ మధ్య మీ బ్లాగ్  చూడలేదు.. ఫేస్ బుక్ లోకి వెళ్తే, వెనక్కి రాలేము. అది అలవాటై పోయింది. అక్కడ అప్పుడప్పుడు మీరూ కనపడుతున్నారు..” అని సంజాయిషీ ఇచ్చుకున్నాను..
జ్యోతి గారు హుందాగా ఓ నవ్వు నవ్వేసారు..
“ఎలా ఉంది మీ బ్లాగ్ .. ఏవో వ్రాస్తున్నట్టున్నారు.” గంభీరంగా పలకరించారు..
“ప్రతి నెలా ఒకటో రెండో వ్రాస్తున్నానండి.. “
“ఎలా ఉంది ఫీడ్ బాక్ ?”
“ఫర్వాలేదండి.. ఈ మధ్య “హరాజీకాలు” అని ఓ ఆరు ఎపిసోడ్స్ వ్రాసాను.. చూసినవారు బాగుందని మెచ్చుకుంటున్నారండి.
“అదేమిటి “హరాజీకాలా” - అంటే?”
బ్లాగ్  కలగజేసుకుని “అంటే ఏమిటో  నాక్కూడా చెప్పటంలేదాంటీ .. సస్పెన్స్ ట.” అంది..
“ఓ .. సరే సరే  … బాగానే చూస్తున్నారన్నమాట.. కాని ఇవ్వాళ చూసాను, రీడర్ షిప్ బొత్తిగా 18000 కూడా లేదు..”అన్నారు జ్యోతి గారు..
నన్ను మాట్లాడనీకుండా బ్లాగే అందుకుంది.. “అంటేనండి, అప్పుడెప్పుడో నేను తప్పిపోయాను కదండీ, అప్పుడేమో మీరు పట్టుకుని తీసుకొచ్చారు కదండీ .. అప్పుడు మీటర్ ఆగిపోయిందండి..”
“అవునండి, నిజానికి దగ్గర దగ్గర 40వేలైందండి ..”అన్నాను నేను.
“గుడ్.. అయినా నాలుగేళ్ళు పూర్తయింది కదా.. ఈ పాటికి సంవత్సరానికి పాతిక వేలు చూసుకున్నా, లక్ష దాటాలి. మీరు వ్రాస్తారు  కదా .. బాగా వ్రాయండి మరి ..”
జ్యోతిగారిలో ఆ బూస్టింగ్ .. ఆ ఎంకరేజ్ మెంట్ .. అవే ఆవిడ స్పెషాలిటీ…

సరే వచ్చిన వాళ్ళదగ్గరకి తీసుకెళ్లి, ఒక్కొక్కరినే చూపించా ..
“ఈయన జోస్యుల, జర్నలిస్ట్” అన్నా
“తెలుసు, నీ పోస్ట్ బాగుందని చెప్పి చాలామందిని పరిచయం చేసారు కదా” అంది..
“ఈయన డి.యస్. సుబ్రహ్మణ్యం గారు, ఈయనా ఒక జర్నలిస్ట్”
“మీ రామాయణం చదివాను అంకుల్  .. చాలా చాలా బాగుంది..”అందరూ తెలిసినట్టే మాటాడుతోంది.  
“ఈయన రామనారాయణ గారు, మరో జర్నలిస్ట్”
“నీకు ఆపరేషన్ అయినప్పుడు గొప్ప కవరేజ్ ఇచ్చారు ఈయనే కదా, కదా అంకుల్” అంది.
“అవును.”అనక తప్పింది కాదు.. 
చిన్నారి  బ్లాగు మెమరీ నాకుకళ్లు చెమరుస్తున్నాయి  ..
“ఈయన వేపా, సుభాష్, పఠానేని, జనార్దన్,”
అంటుండగానే.. “నమస్తే అంకుల్స్, మీరందరూ వెంట వెంటనే మీ వ్యాఖ్యలు పెడ్తారు, దాంతో నాకు వెయ్యేనుగుల బలం వచ్చేస్తుంది.” మా బ్లాగుకి కవిత్వం కూడాను ..
“మాధురీ ఆంటీ ! మీరూ వచ్చారా ?” నే చెప్పకుండానే పలకరించేసింది బ్లాగ్..
తర్వాత శ్రీనివాస రెడ్డిగార్ని చూపించాను ..
“ఏంటి అంకుల్ .. బోస్టన్ నుంచి నా పుట్టిన రోజు కోసం వచ్చారా” .. అని
“అంకుల్ మీ తొలిపూజ పుస్తకం చాలా బాగుంది. తిరుపతి వెంకన్న బాబు గురించి చాలా బాగా వ్రాసారు.. వింటుంటే ఏడుపొచ్చేసింది..” అని కళ్ళు తుడుచుకుంది.
“చూడు ఈయన శివకుమార్, లండన్ నుంచి వచ్చారు.. అలాగే మాచిరాజు లలితా ఆంటీ సింగపూర్ నుంచి వచ్చారు.
అదిగో గీతా, భాస్కర్, న్యూ జర్సీ నుంచి వచ్చారు.వాళ్లు కూడా  చిన్న బాబుని, పాపను తీసుకొచ్చారు. ”
బ్లాగు అందరికీ వినయంగా నమస్కారాలు చేసి పలకరించింది.      
“గీతా ఆంటీ మీ పాప చాలా క్యూట్ గా ఉంది.. ఏం పేరు ?” అడిగింది బ్లాగు..
“శ్రీ హసంతిక” అని చెప్పారు గీత ..
“నవ్వుల పాప కదా? సరిగ్గా సరిపోయింది” అని నవ్వుతూ చెప్పింది.
ఈలోగా కె.వి. శాస్త్రి గారొచ్చారు.. “ఏంటంకుల్ ..ఇంత లేటా ?” అంటూ ,
“నా బ్లాగు చూసి వెంటనే పలకరిస్తారు మీరు, మీరే ఫంక్షన్ కు లేట్ గా వస్తే ఎలా అమ్మా..”
“లేదమ్మా, పూనే నుంచి ఫణిబాబుగారొస్తానన్నారు.. మళ్లీ ఆయనే  ఫోన్ చేసి రావటం లేదన్నారు.. ఆయనకోసం వెయిట్ చేసి చేసి, చివరికి లేట్ గా బయల్దేరా..”
“ఇక మొదలెట్టేదామమ్మా.. ఇప్పటికే ఆలస్యమయింది..” అన్నాను..
“మరి బులుసు అంకుల్ రాలేదు .” అంది బ్లాగు..
“కాని ఆయన ఫోన్ కు కూడా దొరకలేదు.. ఇండియాలో ఉన్నారో లేదో మరి ?”
బులుసు సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య కలవటంలేదు.. అప్పట్లో మా ఇంటికి కూడా వచ్చారు.. మంచి మిత్రులు..
“ప్రసాద్ గారు అమెరికాలో ఉన్నారు .. గ్రీటింగ్స్ పంపారు”.. అనిబ్లాగ్ తో  చెప్పా.
“విజయవాడ అంకులే కదా, నాతో ఫోన్ లో మాట్లాడారు”అని బ్లాగ్ అనగానే, అవాక్కయ్యాను.  
“అదిగో సుబ్బారావు అంకుల్ వచ్చారు.. మంచి పద్యం వ్రాయండి అంకుల్” అని ఆయనదగ్గరికి పరుగెత్తింది బ్లాగు..
(ఇంకా చాలామందిని ప్రస్తావించాలి అని ఉంది.. కాని స్థలాభావం..)
“రండి పార్టీ స్టార్ట్ చేద్దాం” అంటూ కేక్ కట్ చేయాడానికి కదిలింది, ఐదో ఏడాదిలోకి ప్రవేశించిన నా  బ్లాగ్..  

12 comments:

vepa said...

Marinni subhapradhamaina puttinarojulu jarupukovalani bhagavantunni pradistunnanu hanumamji. Vepavrrao

జ్యోతి said...

హ్యాపీ బర్త్ డే హాస్యవల్లరి

అఫ్పుడే నాలుగేళ్లయిందా?? అభినందనలు

kaartoon.wordpress.com said...

హాస్యవల్లరికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Rajasekhar Nanduri said...

హాస్యవల్లరి....నీకు జన్మదిన శుభాకాంక్షలు ....

నీ అల్లరికి సరిగ్గా సరిపోయే వయస్సు వొచ్చేసింది ...

నీ blogday , అదే బర్త్ డే , చాలాబాగా జరిగిందని party కి వచ్చిన అంకుల్స్ ఆంటీస్ నీకిచ్చిన అభినందనల్ల్ని చదివా...

నీ పార్టీ కొచ్చిన పెద్దలే కాకుండా...నాలాంటి చాలా మంది అజ్ఞాత అభిమానులున్నారని గుర్తుంచుకో ...

నీ ఎదుగుదల, నీ అల్లరి, నీ achievements , నీ ప్రజ్ఞ, నీ కీర్తి, అన్నింటినీ మించి నీ గొప్ప క్రియేటివిటీ చూస్తుంటే నీకు నాలుగేళ్ళు అంటే నమ్మబుద్ధి కావడంలే....70 ఎల్లా విజ్ఞత నిన్ను వెన్ను తట్టి నడిపిస్తోమ్దని అనిపిస్తోంది నాకు...

బ్లాగ్ బాయ్ కి మా ఆవిడా తరపున ఒక పాట .....

బ్లాగ్ వీరుడు, బ్లాగ్ వీరుడు కళ్ళలోనే ఇంకా ఉన్నాడు....

కీప్ బ్లాగ్గింగ్....న్యూ ఏజ్ technique ఫర్ కీపింగ్ ఫీట్ అండ్ healthy ...

Blogger said...

మరింత నవ్విస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ...

హనుమంత రావు said...

Happy for your encouragement dear sri Vepa, madam jyothi garu, kaartoon.wordpress.com, sri rajasekhar nanduri,and sri srinivas. I sincerely thank you all on behalf of chinna blog for your ready response and blessings. A good number of people have visited the bag from fb friends and responded on fb.. i thank them also...THANK YOU ONCE AGAIN.

YERRAPRAGADA PRASAD said...

మీ బ్లాగు అందరి "బాగు" కోరింది...
మీ బ్లాగు "బ్లాక్" అయ్యిపోకుండా మీ లవ్వు ఆపింది...
ఆ లవ్వు... నవ్వుల పువ్వులను అందరి మనస్సుల్లో "తురిమింది"
పరిహాసమే హాస్యము అని భావించే కొందరికి.హాస్యపు భాష్యం తెలిపింది...
అదేపనిగా నవ్వడం కాదు హాస్యమంటే...అందంగా నవ్వడం అని చూపింది..
హద్దులు దాటని.... పరిధులు మించని
...తోడులకోసం "సురేఖాన్" లజతకట్టింది.
హాస్య అల్లరులు కాకుండా హాస్య లహరులు విహరింపచేసింది.
మీ హాస్యలహరికి "శతమానం"
మన హాస్యలహరికి ఇదే మా"అభిమానం"
శుభాకాంక్షలతో..
*ఎర్రాప్రగడ ప్రసాద్, రాజమండ్రి....

హనుమంత రావు said...

ప్రసాద్ గారూ, చాలా బాగా వ్రాసారు.. అభినందనలు. పదముల కూర్చి ఆత్మీయతను వ్యక్తీకరించిన మీకు, రాజశేఖర్ గార్లకు కృతజ్ఞతలు...

బులుసు సుబ్రహ్మణ్యం said...

హాస్యవల్లరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
హాస్యవల్లరి ఇలాగే అల్లరి చేస్తూ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
హనుమంతరావుగారికి అభినందనలు,శుభాకాంక్షలు.

నన్ను తలచుకున్నందుకు ధన్యవాదాలు.
{నేను విదేశాలు తిరిగి వచ్చి చాలాకాలమైంది (కలలోనేనండి. దహా.}}.

హనుమంత రావు said...

dear subrahmanyam gaaru,
బహుకాల దర్శనం.. మీరు అలా అంతర్జాతీయ కలలు కనడం వలన, దేశవాళీని కదా నేను కనపడి ఉండను..అవకాశముంటే మా రాజమండ్రి గురించి కల కంటే, నన్ను చూడగలరు.. బ్లాగును ఆశీర్వదించినందుకు మనసారా అభినందనలు, అభివందనాలు.. శ్రీమతి గార్ని అడిగామని చెప్పి, నమస్కారములు తెల్పగోర్తాను.

Vennelakeratam Team said...

"వెన్నెలకెరటం" సాహిత్య బ్లాగుకు సభ్యత్వనమోదుకు ఆహ్వానం
http://vennelakeratam.blogspot.in/p/blog-page_4312.html

మిస్సన్న said...

ఏమైనా మీకు మీరే సాటి. చాలా ఆలస్యంగా చూశాను. శుభాకాంక్షలు.