Pages

Tuesday, September 2, 2014

NEWS FROM 'SAKSHI' DAILY .. 2ND SEPT.2014






‘సాక్షి’ .. సెప్టెంబర్ 2, 2014 .. తూర్పుగోదావరి .. మన రాజమండ్రి సిటీ .. 5వపేజీ

బుడుగు శిలావిగ్రహం నెలకొల్పాలి.

ముళ్లపూడి కలం, బాపు కుంచెలు ప్రాణం పోసిన బుడుగు శిలా విగ్రహాన్ని తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రిలో నెలకొల్పాలని, హాసం క్లబ్ కన్వీనర్ డి.వి.హనుమంతరావు అన్నారు. సోమవారం శ్రీరాంనగర్ లోని ప్రముఖ కార్టూనిస్ట్
ఎం.వి.అప్పారావు(సురేఖ) గృహంలో బాపు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ చేతినుంచి జాలువారిన అసంఖ్యాక కార్టూన్లలో నిత్యం కనపడే కామన్ మ్యాన్ - సగటు మనిషి విగ్రహాన్ని ఆయన అభిమానులు పూనేలో నెలకొల్పారని, అలాగే బుడుగు విగ్రహాన్ని నెలకొల్పాలన్నారు. నగరంలో బాపు చిత్రల్లు, కార్టూన్లతో ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  గేయకవి మహ్మద్ ఖాదర్ ఖాన్ బాపుతో తనకు గల అనుబంధాన్ని ఇలా వివరించారు. ‘ఒకసారి, ఎవరో ప్రముఖుడు నాకు బాపుని పరిచయంచేసారు. తొలి పరిచయంలోనే బాపు నన్ను ‘సాయిబు’ అని మహమ్మదీయులను అనడం తప్పా అని ప్రశ్నించారు. తాను ఈ పదాన్ని ఉపయోగిస్తే, వివాదం చెలరేగిందని బాపు అన్నారు. నేను ‘సాహేబ్’ అన్న పదం సాయిబుగా రూపాంతరం చెందినదని, ఆ పదాన్ని ఉపయోగించడంలో ఎటువంటి అనౌచిత్యమూ లేదని చెప్పినప్పుడు ఆయన సంతోషించారని మహ్మద్ ఖాదర్ ఖాన్ అన్నారు. పేపరు మిల్లు విశ్రాంత వెల్ఫేర్ అధికారి ఎస్.బి.చౌదరి, ఎం.వి. అప్పారావు తదితరులు పాల్గొని బాపుకు నివాళులర్పించారు.

(రాజమండ్రి కల్చరల్)   



No comments: