పొట్టాటోపం
---డి.వి.హనుమంత రావు
చాలామంది నన్ను బాలూలా వుంటానని అంటూ వుంటారు.
అదేనండీ యస్ పి గారిలాగా అనే. నా మానరిజమ్స్ అలా వుం
టాయని కొందరు మిత్రులు, బంధువులూ కూడా అంటూ
వుంటారు. ఇది తెలియని వారికెవరికైనా యిది చెప్తే అయితే ఓ పాట
పాడమంటారు. ఆ పాడు మాటలేమిటి చెప్పండి. (తప్పట్టుకోకండి.)
అపాటగాడ్ని పాడమనడం, జ్వరబాధితుడ్ని విందుభోజనం
చేయమనడం లాంటివి యిబ్బందికరం కదండీ. బాలూలా
వున్నానని అన్నారంటే బాలూ లావున్నానని అన్నది కూడా వారిభావమై
వుండవచ్చు. చాలా సందర్భాలలో అంటే 'పాడుతా తీయగా' లాంటి
కార్యక్రమాలలో బాలూగారు తనమీద తానేజోక్ చేస్తూ చాలా
చమత్కారంగా మాటలాడుతూవుండడం మనం చూస్తూనే
వున్నాము. ఆయన గొప్పపాటకారే కాదు మాటకారి కూడా.
అంచేత నే చెప్పొచ్చేదేమంటే ఆయన గాత్రం కాదు కాని ఆయన
గాత్రంతో కొంచెం సామ్యం నా పట్లకొందరి పరిశీలన అనికూడా అనుకోవచ్చు.
నా ఈ లావు తీయనిది...తీయలేనిది. 'లావొక్కింతయు లేదు'
అనే పద్యాలు రాగయుక్తంగా పాడే మాట దేవుడెరుగు ..మరే
యుక్తంగానూ పాడేసాహసం చేయను. ఒక విషయం మాత్రం నిఝం.
'అన్యథా శరణం నాస్తి...యస్ పీ గారూ! త్వమేవశరణం మమ'.
నేను కూడా నామీద జోకులు వేసుకుని,అప్పుడప్పుడు కోపం
వస్తున్నా నిగ్రహించుకుని, ఆ యాపరిస్థితులనించి బయట పడే
ప్రయత్నం యథాశక్తి చేస్తున్నాను....కొంచెం వివరిస్తాను, అవధరించండి...
"ఏంటి గురూగారూ పొట్ట అలా పెంచేస్తున్నారు" అని చాలామంది
ప్రశ్నిస్తూ వుంటారు. "పొట్ట యిలాగేకదండీ మరి పెంచాలి" అని నా
సమాధానం. అదేమిటో కడవంత పొట్ట కూసింతవాడిక్కూడా లోకువండి.
ఏంచేస్తాం చెప్పండి...ఒక్కోప్పుడు వేదాంతం చెప్పేస్తా...."అయినా నే పెంచే
దేముందండీ, అదే పెరుగుతుంది పిచ్చిముండ. నేను నిమిత్తమాత్రుణ్ణి"
అంటా. కొన్ని సందర్భాలలో చిన్న సైజు లెక్చరు యిచ్చేస్తూ వుంటా...
మీరూ చదవక తప్పదు. (నా పొట్టమీద సానుభూతితో మరి యింత
దూరం వచ్చిన సహృదయులు మీరు.) -- "బుర్రలు తీసి బుర్రలు పెట్టి
రాజకీయాలలోకి వచ్చి చెలామణీ అవుతూ, అడ్డమైనదారులూ త్రొక్కి
డబ్బుసంపాయించినా; పగలంతా గొడ్డు చాకిరీ చేసి (పోనీ అలా
తృప్తిపడి) సాయంవేళ, అదే స్వర్గమనుకుంటూ మద్యంలో పరవళ్ళు
త్రొక్కినా; కూర్చొని బంతి భోజనాలుచేసినా, నిలబడి బఫే(లో)భోజనాలు
చేసినా..... వీడి జుట్టుముడి వాడికి, వాడి జుట్టు ముడి వీడికి వేసి
మంత్రాంగాలు చేసినా: ఆ మాట కొస్తే ఏ గడ్డి కరచినా, ఏ నడ్డి వంచినా
ఈ పాడు(పాటల 'పాడు' కాదని మనవి)పొట్ట కోసమే కదండీ.
అలాంటప్పుడు నా యీ పొట్టపై మీకేల(మీకంటే మీకని కాదండీ)
అంత అసూయ ఈర్ష్య, జుగుప్స,యెన్వీ, మత్సరం" అని
ఆవేశంగా చెప్పి ఆయాస పడి పడీ, వూగిపోయి పోయి,
నిలబడిపోతాను.
నాలా పొట్టలతో భారపడేవార్ని చూస్తే నాకు బోల్డుపొట్టానుభూతి.
కొందరు పొట్టల స్వంతదారులు నా ముహం చూసో, నా పొట్ట
చూసో (అనుమానంగా యెందుకు చెప్తున్నానంటే, వారు ఏమీ
తెలియని అమాయకత్వం ముఖానికి పులుముకునివుంటారు
అన్నమాట)... 'ఏమిటోనండీ, ఈ మధ్య లావెక్కిపోతున్నాను.
చాలామంది పొట్ట పెంచేస్తున్నావ్ అంటున్నారు.' అంటారు.
అలాంటివార్ని 'నా ప్రక్కన నిలబడండి,యిప్పుడు చూడండి,
కావాలంటే ఫోటోలు తీయించుకోండి.' అనిఆహ్వానిస్తాను.
ఇలా చేయడంవలన, నా పొట్ట ముందు వారి పొట్ట చిన్నది అని
తాత్కాలికంగానైనా ఆనందం కలుగుతుంది.ఫలితంగా యింకొంచెం
ఆస్తి అదేనండి పొట్ట పెంచుకునే ధైర్యం తెచ్చుకుంటారు.
పొట్టలలో కూడా కొన్ని అంతర్ముఖాలు, కొన్ని బహిర్ముఖాలు. మొదటి
రకం యెంతతిన్నా కనపడవు. అదే రెండోరకమైతే కొంచెం తింటేనే
ఆయాసమూ ఆకారమూ రెండూ పెరుగుతాయి. ఓ యింత
తినేసాడేమో అనిచూసేవారికి అపోహకూడా కలగవచ్చు....
పోనీ తినేసాక ఓ మూల నిశ్శబ్దంగా కూర్చుంటారా అంటే...సంగీతఙ్ఞానం
ఒకటి వీరికి.....సరళీస్వరమో జంట స్వరమో(యిద్దరూ or plus
ఒకచోట చేరితే) వారి వారి స్థాయిలబట్టి స్థాయీబేధాలతో
సహా నిద్రాకచ్చేరీతో అలవోకగా విందు చేసేస్తారు. సంగీతానికి
గురకకూ పోలికేమిటనకండి...కావాలంటే యిద్దర్ని కాని యెక్కువకాని
గురకవిద్వాంసుల్ని ఓ గదిలో పరుండబెట్టి అప్పుడు వినండి....
వారి వారి గురకల్లో ఓ క్రమం, ఓ లయ,ఓ రిథమ్...అనుమానముంటే
ప్రయోగించండి.
పొట్టలవల్ల అన్నీ కష్థాలేనా...కాదు, కొన్ని వుపయోగాలు
కూడా వున్నాయి. జంతికలో చేగోడీలో పళ్ళెంలో పెట్టుకుని,
ఆ పళ్ళెం పొట్టమీద పెట్టుకుని, ఓ పడక్కుర్చీలో పవ్వళించి,
యెక్కువదూరం ప్రయాణశ్రమ లేకుండా వంగకుండా యిట్టే అలా నోటిలో
వేసుకోవచ్చు.... ఆ పళ్ళెం తీసేసి... యింట్లో పేచీ పెడ్తున్న
మనవడ్ని పొట్టమీదపడుకోబెట్టుకుని, ఇన్ నో టైమ్, నిద్రపుచ్చి
అంతఃపురస్త్రీల మెప్పుపడయవచ్చు.(మీరు ఆ సమయంలో
నిద్రలోకి జారుకుంటే...మీ సంగీతకచేరీ పిల్లవానికి నిద్రాభంగం
కలిగితే, ఆ సదరు పిల్లవాడు పాతబకాయిలతో సహా రోదించవచ్చు.
ఫలితంగా మరి.....తస్మాత్ కొంచెం జాగ్రత్త అవసరం). ఏదైనా రష్ గా
వున్నబస్సులో యెక్కి నించోవలసివస్తే మీ పొట్టయిచ్చేకుషన్ యెప్ఫెక్ట్ తో
మీ ముందువాడు స్టాప్ వచ్చినా రిలాక్స్ అవుతూనేవుండవచ్చు.
ఆలోచనలు తట్టాలంటే గోక్కోడానికి మీకు బుర్ర. మాకు బొర్ర(తెలంగాణా).
కొన్ని సంఘటనలు...నేను ఎంజాయ్ చేసినవి...
ఓ సారి ఓ ప్రయాణంలో నేనూ, శ్రీమతీ, మా తోడల్లుడూ, మరదలు
కాకినాడ వెళ్తున్నాము. దారిలో ఓ జంట కలిసారు. వారూ కాకినాడ
వచ్చి పనిచూసుకుని మరల సామర్లకోట వచ్చి వైజాగ్
వెళ్ళాలి. దానికివీలుగా సామర్లకోటలో కారు చేయించుకున్నాము.
భోజనాల టైమ్ కదా ...యింకొకాళ్ళని యేం యిబ్బంది పెట్తామని
కాకినాడలో హోటల్లో భోంచేసి మళ్ళీ కారెక్కాము గమ్యం చేరడానికి.
అప్పుడు నాకు ఆ భగవంతుడెంత కరుణామయుడో అనిపించింది.
అన్నంతిన్నాక పొట్టలు ముందుకే పెరిగే యేర్పాటు చేసాడా
శక్తిమంతుడు....అలా కాకుండా ప్రక్కలకు పెరిగివుంటే కారు
సరిపోకపోనుకదా....ఆ విషయమే కూడావున్నవారికి చెప్తే--
క్రొత్తవారిద్దరికీ నవ్వాపుకోలేక పొలమారింది. ఆవిడైతే
'అన్నయ్యగారూ! యింక జోకులొద్దండి...నవ్వాపుకోవడం
చాలా కష్టమయిపోతోంది.' నవ్వులోకలిపి
మరీఅంది. వారి సెన్సాఫ్ హ్యూమర్ కి హాస్యాంజలి.... ఆ సందర్భాన్ని
మీరూ భావిస్తే యెంజాయ్ చేయగలరని నేను భావిస్తూ మీతో
ప్రస్తావిస్తున్నానిక్కడ.
బొజ్జదేముడు మనందరికీ దేముడు. ఈ మధ్యనే బొజ్జగణపయ్యకు
పూజలు చేసి ఆయన అనుగ్రహం పొందాం కూడా. గతంలో
ఓ వినాయక చవితి ముందరి రోజు నేనూ మా ఆవిడా ఓ మిత్రు
డింటికి వెళ్ళాము. మా ముగ్గురాడపిల్లలకూ పెళ్ళిళ్ళై వారి వారి
అత్తారిళ్ళల్లో వున్నారు. అంచేత యేపండుగయినా మేమిద్దరమే...
ఆ నేపధ్యంలో.... ఆ మిత్రుడికి నలుగురు మగపిల్లలు. పెద్దాడికి
పదేళ్ళుంటాయేమో. అతడు నన్నడిగాడు...
"అంకుల్! వినాయకచవితి సామాన్లు కొన్నారా?"
"కొన్నానయ్యా, కాని బొమ్మ యింకా కొనలేదు."
"ఇంకా కొనలేదా! రేపేకదా వినాయకచవితి? యింకెప్పుడు
కొంటారు?"
"ఫర్వాలేదులే, రేపు కొంటాను"
"రేపైతే బొమ్మలు దొరకవేమో అంకుల్"
అతని కుతూహలంలోని అమాయకత్వానికి నవ్వుకుంటూ
"దొరకవంటావా...సరే యేంచేస్తాం...దొరికితే కొంటాను...లేకపోతే
బనీనువిప్పేసి పూజామందిరంలో నేనే కూర్చుంటాను....."అన్నా
బొజ్జ నిమురుకుంటూ.
ఆ చిరంజీవి యిక నవ్వాడూ....తలచుకు తలచుకు ...నే వూహించిన
దానికన్నా యెక్కువ నవ్వాడు. ఇప్పటికీ గుర్తువచ్చినప్పుడు
నవ్వుకుంటూనే వుంటాడట.. ఇపుడు అతను యస్.సి.రైల్వేలో
టికెట్ కలక్టర్.

7 comments:
pottatopam ante yedo potato sangathi anukunna potta pagilela navvesanu nenu..
బావుంది మీ "పొట్ట బాగోతం"
పొట్టోపోఖ్యానం పొట్టచెక్కల్వుతుందేమోనని భయపడుతూ
లేస్తూ చదవడం పూర్తిచేశాను. అవునూ మీ పొట్టనిండా
ఎన్ని ఐడియాలండీ! ఒక్కొక్క ఐడియా వదిలేస్తుంటె పొట్ట
ఖాళీ అయి అదే చిన్నబోతుంది.వాకింగులూ సైక్లింగులూ
దండగ!
pottopakhyanam excellent babai
potta ante/unte migatha variki
asuya aaa edupu enchetanante
pottara navvukodaniki / potta chekkalayyela navvukodaniki POTTA
vallaki ledu kabattee...
nenu adhrushtavanthudini aaa vishayamlo .... nenu enjoy chesthunnanu
naa chinnappudu maa mastaru vore
eee vayasulo potta vasthundemetera neeku anevaru ekkadanunchi vasthunnado naakaithe appudu thelisedu kaadu, ela raakunda untundo aayaniki thelisedi kaademo endukante mastariki kuda baagane undedi POTTA.
Colleagues appudappudu mee potta peruguthondi ani vyangyamuga antuntaru kaani naakaithe aa commentlo eershya kanipinchedi
takuplo potta vunna andamu/ comfort / look aaa darjayi veru
aahladamgaa / haayiga vundi
potta , dhanipai neevu vrasinadi
Nagesh D s s
నాకు మట్టుకు నా పోట్ట కష్టాలే తెచ్చింది మాష్టారు.ప్రతి ఆరు నెలలకి ఫాంటులు మార్చడమెందుకు అని ఓ అర డజను పంచలు కొని పాడేసింది మా ఆవిడ.ఆ పంచె మీద బెల్ట్ పెట్టుకుందామంటే ఆ సైజు బెల్ట్స్ దొరకటం లేదు. ఘట్టిగా ఊపిరీ పీలిస్తే పంచె ఊడిపోతోంది.కష్టమ్స్ అండ్ కష్టమ్స్ ఓన్లీ. ఎనీ సజెషన్స్?
పొట్ట మీద ఇంత హాస్యమా. నేనొప్పుకోను.
హహ్హహ్హా.. భలే ఉందండీ మీ పొట్టాట్టోపం..:) నవ్వుకోలేక చచ్చా..:)
శ్రీ సుబ్రహ్మణ్యంగారూ..... నమస్కారం....కడుపులో దాచుకోకుండా
వున్నవన్నీ బ్లాగులో పెట్టానే? మరీ పొట్టోనర్స్ పట్ల యింత
నిరాదరణా అని పొట్టచేతపట్టి బ్లాగు బ్లాగూ తిరిగా...
కుడి పిడికిలి బిగించి సహస్రారస్థానంలో పెట్టి, ఎడమ చేయి మడిచి,
నడుము ఎడమ భాగంలో వుంచి, కొద్దిగా రైట్టర్న్ యిచ్చుకుని....
'ఇస్సీ!" అంటూ పంచభూతాలలోని ఆపః,వాయు...రెండూ మీ
చైనావాడిలావదిలాను. గంగాస్నానం పొందిన మా శ్రీమతే సాక్ష్యం.
అందర్నీ ప్రోత్సహించే బులుసువారుకూడానా....హీ టూ...అని
విచారిస్తున్న తరుణంలో పాతవారూ కొందరు క్రొత్తవారూ స్పందించారు.
అమ్మయ్యా ! డిపాజిట్ దక్కింది. ఇప్పుడు మీరు...నా హాస్యానికి మీరు
ఒప్పుకున్నా ...కోకున్నారాస్తాను. మీరు అలా అండం నాకో పెద్ద రివార్డ్
మీ ద్వారా అందరికీ విఙ్ఞప్తి....బ్లాగులు అందరివీ చూడండి....స్పందన
తెలుపండి....the child that is there in every body expects
a pat on the back for the work he has done...శలవు---
దినవహి.
Post a Comment