Pages

Thursday, May 26, 2011

హనుమజ్జయంతి





మంగళదాయకం మహవీర రూపం
ధ్యానయోగ్యం సంజీవనోద్ధారక సుందర రూపం
ఈప్సితార్థ ప్రదాయని శ్రీరామ దాస రూపం
పర్వతధారీ పవనపుత్ర ! జై జై శ్రీ సుందర హనుమ ||

వైశాఖ బ||దశమి హనుమజ్జయంతి..27.05.2011 శుక్రవారం...
ను ...----=ఓం-----ప్రణవం.----ప్రణవస్వరూపుడు హనుమ.
హనుమ తలపే రక్షణ...ధైర్యం....

బుద్ధిలో, బలంలో, తేజస్సులో, పరాక్రమంలో, ధైర్యంలో నీతో సరితూగే వ్యక్తి ప్రపంచంలో లేడు..అంత పరాక్రమ సంపన్నుడవైన నీవే సముద్రలంఘనం చేయగలవు, సీతమ్మ జాడ తెలుసుకోగలవు అని సముద్రతీరాన జాంబవంతుడు హనుమను పరిపరివిధాల ప్రేరేపిస్తాడు...హనుమ త్రివిక్రముడిలాగా విజృంభిస్తాడు...సింహగర్జన చేస్తాడు...తన గంభీరమైన వాక్కు వినిపిస్తాడు.....

పావనమూర్తి రామనరపాలకుపంపున నబ్ధి దాటెదన్
దేవవిరోధి దొంగిలించిన దేవిని జూచెద గానకుండినన్
లావున గడ్డతో బెఱికి లంకయ తెచ్చెద నట్లు గానిచో
రావణు బట్టి తెచ్చెదను రాముని సన్నిధి కెన్నిరీతులన్........(కవయిత్రి మొల్ల)

తాను తప్పక జానకీమాతను చూడ గలనంటాడు హనుమ... కారణం చేతనైనా సీత కనపడకపోతే లంకానగరాన్నే పెఱకి తీసుకువస్తానంటాడు....
వేగాన్ని యోగంగా మార్చుకుని హరిసత్తముడు అప్పటికే లంకా నగరం మానసికంగా జేరిపోతాడు...మొదట శ్రీ రాముని చూచినప్పుడు తన వాగ్వైభవంతో శ్రీరాముని మెప్పు పొందిన హనుమ...........ఇప్పుడు తన వాక్పటిమతో మానసికంగా లంక చేరిపోయాడు....... వాగ్వైభవం శ్రీరామానుగ్రహం.

పరమాత్మకు చేరువలోనేవున్న ఆత్మ--పరమార్థప్రదమైన పదార్థాలను బుద్ధికి అందిస్తుందిట.. బుద్ధి మనస్సును ఆలోచింపజేస్తుందిట..అలా ఆలోచించిన మనస్సు అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది...దానివల్ల వాయువు ప్రేరేపింపబడుతుంది.. వాయువు హృదయంలో ప్రవేశించి పైకి ప్రయాణించి రకరకాల స్వరాలను, నాదాలను, నినాదాలను పుట్టిస్తుంది...అంటే సకల వాగ్విలాసానికి అనల, అనిల సంయోగమే మూలం..అదే అంజనీ దేవీ, వాయుదేవుల కలయిక...ఫలితంగా ఉద్భవించినవాడు వాగ్విదాంవరుడు ఆంజనేయుడు...అతని వాక్కుకి తిరుగులేదు...ఇది శాస్త్ర వాక్యం..
---( శ్రీ ఇలపావులూరి పాండురంగారావుగారి, 'అనుదినరామాయణం' ఆధారంగా....)

రామానుగ్రహం కావాలి అంటే
శ్రీ రాముని పాదాలు పట్టుకోవాలి...
శ్రీ చరణాలు పట్టుకోవాలంటే.........
మారుతి చరణాలొదలడు...........
పవమానసుతుడు పట్టిన పాదారవిందాలకోసం........... ...
పవమానసుతుని పాదారవిందాలు పట్టుకోవాలి ఎప్పుడు...........ఎప్పుడోనా.................ఇప్పుడే........ రోజే...... హనుమజ్జయంతి.

No comments: