Pages

Friday, July 1, 2011

ప్రపంచ జోకుల దినోత్సవం

రండి...రండి...ఇవ్వాళ ప్రపంచ జోకుల దినోత్సవమట..చివరికొచ్చేసింది.
అందరు జోకులు చెప్పి నవ్వుకోవాలిట. అలా మా అప్పారావుగారి
బ్లాగులోకి వెళ్తే తెలిసింది..
సరే ! మీరు చెప్తారా ? ..(చిన్ననవ్వుతో) నన్నే చెప్పమంటారా?
నే చెప్తాననుకోండి మరి మీరు నవ్వుతారా?...ఆఁ నవ్వుతారులెండి.
మీది మా దొడ్డ టేస్ట్..నాకు తెలియదా ఏంటి?
ఔనండీ ? నాకు తెలిసుండి అడుగుతాను సంవత్సరానికి ఒక్కసారి
నవ్వుకోవాలని అండం ఏమిటండీ అసలు ? ఇదెలా ఉందంటే
మా ఇళ్ళల్లో 'నందికేశ్వరుడి నోము' అని ఆడంగులు చేస్తూ ఉంటారు..
ఆ నోముకి ఒకటో రెండో ఐటమ్స్...లైక్--చలివిడి, సాతాళించిన శనగలు,
పులగం,ఉండ్రాళ్ళు, అట్లు, అన్నప్పరమాన్నం ఎట్సెట్రా ఎట్సెట్రా చేస్తారు.
అఫ్ కోర్స్...అన్నీ ఒకరోజేకాదు.రెండు రెండు కాంబినేషన్ కూడా ఉంటాయి..
దాందుంపతెగ ఒక్కొక్కప్పుడు ఆ చలిమిడి తెమలదు. ఇక మొగుళ్ళు
(ఇక్కడ బహువచనానికి కొత్తర్థాలు తీయవద్దు ప్లీజ్)ఊరు మీద పడతారు.
ఎందుకంటే అవి సూర్యాస్తమయానికి ముందుగా తినాలి. చిన్న పిసరు కూడా
పాడేయకూడదు..అది కండిషను .టైము దాటితే నోము ఫెయిల్..
అలా వుంది... సంవత్సరానికి ఓ సారి జోకేయాలిట...అందరూ నవ్వాలిట...
నవ్వడానికి కండిషన్ ఏంటండీ బాబు ?... "ఎందుకీ సోదంతా? జోకేసిది
ఉందా లేదా" అని మీ ప్రశ్న. అవునా ? మీరేంటి మీ పొజిషన్ లో నేనున్నా
అలాగే అడుగుతాను... అదీకాక పాపం. మీరప్పుడే నవ్వడం మొదలెట్టేసారు
కూడాను.నేనూ అంతే మా ఆవిడ జీడిపప్పు ఉప్మా చేస్తున్నానంటుంది. నేను
తినడానికి ప్రిపేర్ అయిపోయి నవలడం మొదలెట్టేస్తా..తీరా ప్లేట్ లో
చూస్తే పోపన్నం "అన్నం మిగిలి పోయిందని పోపు తగిలించాను..
నోరు మూసుకుని తినండి.." అంటుంది.. నా టాలెంట్ పై అంత నమ్మకం
ఆ ఇల్లాలుకి. సరే నండి మొదలెట్టేస్తా....
అసలు జోకులు ఒకటో రెండో పుంజీలేట ! వాటి ఎక్స్టెన్షన్ మిగతా జోకులట.
మన రమణ గారు చెప్పారట !
ఉదాహరణకు: రాముకి ఓ సారి సోము కనపడ్డాడు.
"ఒరేయ్ సోమూ నువ్వు పరగడుపుని ఎన్ని ఇడ్డెనులు తింటావురా ?"
" అయిదు తింటానురా " అన్నాడు సోము.
"తప్పురా--మొదటిది తినగానే పరగడుపు పోతుందిగా"
"అవునుకదూ? బాగా చెప్పావురా" అన్నాడు సోము.
ఇది అసలు జోకు...ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్:

సోము ఆ జోకు విన్నాక భీముని కలిసినప్పుడు:
"ఒరేయ్ భీమూ..పరగడుపుని నువ్వు ఎన్ని ఇడ్డెనులు
తింటావురా ?" అని అడిగాడు
దానికి భీము.."ఓ నాలుగు తింటారా" అన్నాడు
వెంటనే సోము
"చంపావురా..అయిదు అని ఉంటే భలే జోకు చెప్పేవాడిని..".
ఇక మీరు నవ్వొచ్చు...నవ్వు రాలేదా...
అయితే మళ్ళీ చదవండి..రా లే దా... మళ్ళీ..మళ్ళీ
నవ్వొచ్చే దాకా చదవండి...
ఎందుకు రాదో చూద్దాం..నవ్వినట్టు వచ్చి తీరుతుంది.

3 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ వేళ జోకుల దినోత్సవమా? రెండు మూడు నెలలక్రితం హాస్య దినోత్సవం అన్నారు. అన్ని రోజులూ హాయిగా నవ్వుకోండి. నవ్వడానికి కారణాలు ఉండవు.

పసిపాప తప్పటడుగులు వేస్తూ, పడుతూ లేస్తుంటే అప్రయత్నంగా నవ్వు వస్తుంది ఆనందంతో.
అదేమిటి మీ ముందు నడుస్తున్న ఆయన అరటి తొక్క మీద కాలు వేసి జారిపడితే నవ్వుతారా లేదా.

మీకు 'ర' పలుకుతుంది 'ల' లాగా. నరవరా ఓ కురువరా అని పాడండి. నవ్వని వాడిని చూపించండి.
నవ్వడానికి బోలెడు కారణాలు. దీనికో రోజు అంటేనే హాస్యాస్పదం.
మీజోకు బాగుందండోయ్. మొదటిమాటే నవ్వేశాను.

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

ఆ హా ! హా హా హా హా హా.......:)

హనుమంత రావు said...

బులుసు వారికి..కృతఙ్ఞతలు.. మొదటి మాటే నవ్వేసాను..అంటే నా బ్లాగు చూసాక మొదటి మాటు కలిగిన నవ్వా, నేను వ్రాసిన మొదటి మాటకు నవ్వా(అదేదో కూడా చెప్పండి..నేనూ నవ్వుకుంటాను)..ఏమైనా మాటేసి నవ్వలేదని పూర్తిగా నమ్ముతున్నాను.

అప్పారావుగారి మనస్పూర్తి నవ్వుకు..మనస్పూర్తిగా కృతఙ్ఞతలు.