రాజమండ్రి...13
రాజమండ్రి అంటే ఎంత ఇదో...
...డి.వి.హనుమంతరావు.
రాజమండ్రి మీద నాకు ఎంతో ప్రేమ.. చెప్పాను కదండీ.....అప్పటికీ ఇప్పటికీ రాజమండ్రిని ఎవరైనా ఏమైనా అంటే నాకు భలే కోపం వస్తుంది.. అప్పుడైతే బహిరంగంగా ప్రకటించేవాణ్ణి.. ఇప్పుడు పెద్దవాణ్ణి కదా ....లోపలే దాచుకుంటాను... ఆ రోజుల్లో ఎప్పుడైనా శలవలకు కాకినాడ వెళ్లడం ఒక సరదా...అక్కడ మా పిన్నిగారింట్లో దేవీ నవరాత్రిపూజలు చాలా బాగా చేసేవారు.. ఆ పదిరోజులు చుట్టు ప్రక్కలఊళ్లలో ఉన్న మా బందువులు కూడా మా పిన్నిగారింటికి వచ్చేవారు... ఉదయం సాయంత్రం పూజలు, మంత్రపుష్పాలు వేద స్వస్తి .. తరవాత అందరూ కలసి భోజనాలు, సందడే సందడి... చాలా బాగుండేది... మా మామయ్యగారిది ఆ ప్రక్కనే ఉన్న వేములవాడ గ్రామం.. మా పిన్నికి పిల్లలు లేరు.. మా మామయ్యగారి పిల్లలు చదువులకోసం కాకినాడలో ఉండి పిన్నిగారింటనే ఉండేవారు... దసరా పూజలు చూడాలని, సమవయస్కులతో సరదాగా గడపాలని ఉత్సాహంగా వెళ్లేవాణ్ణి....
మామయ్యగారి పిల్లలూ నేను కలిస్తే ఎంతసేపూ రాజమండ్రి కాకినాడల్లో ఏది గొప్ప ? ఇదే చర్చ.. పిన్నిగారిది జమీందారీ కుటుంబము.. పెద్ద ఇల్లు.. దొడ్లలో కాపురాలున్నవాళ్ల పిల్లలు కూడా కాకినాడ పక్షాన చర్చలో పాల్గొనేవారు.. వాళ్లందరూ నేనొక్కణ్ణే.. కాకినాడలో రోడ్స్ చాలా ప్లాన్డ్ గా ఉంటాయి... సిటీ బస్సులు చక్కగా పద్ధతిగా తిరుగుతాయి... మెడికల్ కాలేజ్ ఉంది... అక్కడ అప్పట్లోనే కాన్వెంట్ ఉండేది.. కేరళ క్రిస్టియన్స్ అనుకుంటా నడిపే వాళ్లు.....సినీమా హాల్స్ అన్నీ ఒకే రోడ్ లో ఉండడం కాకినాడవాసులకు ఒక అడ్వాన్టేజ్.. ఆ పాయింట్స్ కాదనలేము...
మన ఊరిగురించి మాట్లాడదామంటే ఇరుకు రోడ్స్ మనకు వీక్ పాయింట్.. మొన మొన్నటిదాకా రాజమండ్రి మెయిన్ రోడ్ అటూ ఇటూ లెక్కవేస్తే మూడు అడుగులు ఉండేదేమో.. గట్టిగా ఎగిరితే అటుప్రక్క కొట్లోంచి ఇటు వైపు పడొచ్చు.. నిజం ! పైగా రాజమండ్రిలో మెయిన్ గా... ఫ్లోటింగ్ పాప్యులేషన్ . ఉదయంఅవుతూనే.. అటు కొవ్వూరు, పసివేదల చాగల్లు లాంటి ఊళ్లనుంచి అమ్మలక్కలు రైళ్లలో దిగిపోయేవారు.. ఇటు తొర్రేడు, కాతేరు.. అందరూ సంపన్న కుటుంబీకులే ... అందరూ రాజమండ్రిలో బట్టలు, ఇత్తడి సామాను, బంగారాలు.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల షాపింగ్ చేయడానికి వచ్చేసేవారు..... ప్రొద్దున్ననుంచి బాగా చీకటి పడేవరకు ఊరులో జనం, పొరుగూరి జనం కలసి ఆ మెయిన్ రోడ్ లో అయితే గొప్ప సందడి. ఆ వీధి పొడుగునా నడవడానికే చాలా కష్టమయ్యేది.. అప్పట్లో మాక్కూడా ఏ వస్తువు కావాలన్నా ఫోర్ట్ గేట్ సెంటరుకు రావలసిందే..
అంటే కోట గుమ్మం సెంటర్.. కోటకు సంబంధించిన గుర్తులు ఏవీ లేవు కాని ..ఆ చుట్టుప్రక్కల తవ్వకాలలో పాత కాలంనాంటి శాసనాలు, రాతి విగ్రహాలు కనపడ్డాయి.. కుమారీ టాకిసు దగ్గర ఉన్న రాళ్లబండి సుబ్బారావుగారి మ్యూజియంలో అవి భద్రపరచారు...... ఇప్పటికీ జనబాహుళ్యంలో ఉన్న కోట గుమ్మం, కందకం రోడ్ లాంటి పేర్లు మాత్రం రాజరికపు వ్యవస్థ ఉండేది అని చెప్తాయి.. అలాగే దొరికిన శాసనాలు, విగ్రహాలు కూడా రాజమండ్రి యొక్క చారిత్రిక నేపథ్యాన్ని గుర్తుకు తెస్తాయి..
సరే ఆ సెంటర్ కు ప్రతి చిన్న వస్తువుకు రావలసి వచ్చేది.. టూత్ పేస్ట్ కావాలన్నా బెజవాడో, ఏరుకొండో... వెళ్లాల్సిందే.... అంటే బెజవాడ వెంకన్న అండ్ సన్స్, యేరుకొండ వెంకన్న అండ్ సన్స్ అనే రెండు ఫాన్సీ స్టోర్స్ ఉండేవి.. యేరుకొండవారి షాపులో లోపలికి వెడ్తుండగానే ఎదురుగా వేంకటేశ్వరస్వామి ఫోటో పెద్దది గోడకు ఉండేది.. దాని ముందు రెండు పెద్ద కొబ్బరి చిప్పలు సరిగా సెంటరుకు పగిలి అటూఇటూ పెట్టేవారు.. చుట్టూ సీరీస్ బల్బులు వెలుగుతుంటే అగరొత్తుల ఘుమ ఘుమలు స్వాగతం పలికేవి... వెంకన్నగారు ఆ కొట్టు యజమాని.. ఆయనకు నలుగురైదుగురు కొడుకులుండేవారు.. వారందరూ శనివారం తల అంటుకున్న తలలతో, నుదుట కుంకుమతో శోభాయమానంగా ఉండేవారు....ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ పలకరించేవారు... బెజవాడ వెంకన్నగారి షాపులో పెద్దాయన సిల్వర్ హెయిర్. తెల్లటి జుట్టు.. పొట్టి చేతుల ఖద్దరు చొక్కా.... చక్కగా రిసీవ్ చేసుకునేవారు... ఇప్పుడు ఆ షాపులున్నాయి కాని, వారసులు పంచుకుని షాపుల పేర్లు రకరకాలుగా మార్చేసారు... ఇప్పటికీ అక్కడ ఉన్న ఫాన్సీషాపులు చాలా మటుకు బెజవాడ వారి కుటుంబీకులవే.. అన్నిరకాల కుంకుమలు, పెళ్లి దండలు, అత్తరువులు, సెంటులూ.. దీపావళి వచ్చిందంటే టపాసులు అన్నీ అమ్ముతుంటారు...
కాకినాడ వాళ్లకి మన రోడ్స్ ఇరుకని వాదించేవారు... మీ రాచవీధి, మెయిన్ రోడ్ దొప్పెడుంది... అనేవారు..
నేను: నిజమే, కాని మేం ఏదన్నా క్లాత్ బేనర్ కట్టాలంటే ఎక్కువ పురికోస లేకుండా సెంటర్ కు కట్టొచ్చు.. మీరైతే ఆ చివరనుంచి ఈ చివరికి ఎంత తాడయినా సరిపోదు.. అదీకాక అంత తాడు కట్టి చిన్న బేనరు కట్టినా అసహ్యంగా ఉంటుంది... మెయిన్ రోడ్ లో మేమైతే వర్షం వచ్చినా షాపు నుంచి షాపుకు తడవకుండా వెళ్లొచ్చు.. ఆసదుపాయం మీకేది..? పెద్ద రోడ్ అయితే ఆ చివరొకడూ, ఈ చివరొకడు.. ఒకడికీ ఒకడికి పొత్తేది.. మా ఊళ్లో రాసుకు, పూసుకు తిరుగుతుంటే ఆప్యాయతలు తొణికిసలాడతాయి... ఇలా ఎదుర్కొనేవాణ్ణి...
సిటీ బస్సులు అప్పట్లో కాకినాడలో టైమ్స్ మెయింటైన్ చేస్తూ చాలా బాగా నడిపేవారు.. మన ఊరిలో లేటుగా ప్రారంభమయ్యాయి.. బస్సులు పెరిగినా అన్నీ గోకవరం స్టాండు నుంచి, ధవళేశ్వరమే ఎక్కువగా వెళ్లేవి.. శ్యామలా సెంటర్ అయితే మరీ తమాషా.. ధవళేశ్వరం వైపు వెళ్లే బస్సులన్నీ అక్కడే ఉండేవి.. అన్ని ఇంజనులు ఆన్ చేసి ఉంచేవారు.. డ్రైవరు సీటులో రెడీగా ఉండేవాడు.. మన ఏ బస్సు ఎక్కుదామా అని ఆలోచిస్తుంటే బస్సు ఆక్సిలేటర్ నొక్కి డుర్రుమనిపించేవాడు.. వెళ్లిపోతోందేమోనని కంగారుగా బస్సెక్కగానే లోపలున్న కండక్టరు డబ్బులుచ్చుకుని, టిక్కట్టు కొట్టేవాడు... ఏంచేస్తాం.. కూర్చోక తప్పేది కాదు.. ముందు బస్సులు ఒకటొకటిగా వెళ్లిపోయేవి, మనబస్సు సారధులిద్దరూ...అప్పుడు తాపీగా దిగి బాతాఖూనీ..... మిర్తిపాడు వైపు ఓ బస్సు ఉండేది.. ఆ బస్సు రిటర్న్ లో గోకవరం బస్టాండులో గంటల తరబడి ఆగిపోయేది.. అద్దీ సి టీ బ స్సు.... ఇప్పుడు మనకున్న సిటీబస్సులను సమర్ధించాలంటే మనకి డిఫెన్స్ లేదు... అందుకని అడ్డంగా డబాయించేవాణ్ణి.....ఆరోగ్యానికి నడక ఉత్తమము., అందుకని మేం బస్సులెక్కము.. మీరు అస్తమానం బస్సుల్లో తిరుగుతారు.....ఆరోగ్యాలు జాగ్రత్త మరి...అని...
రాజమండ్రిలో సిటీబస్సులు రానప్పుడు శ్యామలా సెంటరులో మోటారు సైకిల్ రిక్షాలు ఒకటో రెండో ఉండేవి...ఆటోలకన్నా ఇవి కొంచెం డిఫరెంట్. అంతకన్నా ముందు జట్కాబళ్లు.. ధవళేశ్వరం గుర్రాలని గొప్ప పేరు.. ఒక అడుగు ముందరికేస్తే రెండడుగులు వెనక్కి వెళ్తాయట... భమిడిపాటి వారి రచనల్లో కూడా ధవళేశ్వరం జట్కా ప్రసక్తి వస్తుంది.. నేనెక్కలేదు కాని, చూసిన గుర్తు.... సినీమా హాల్స్ విషయంలో మనకో ప్లస్ పాయింట్.. అప్పట్లో మన ఊరిలో కాకినాడకన్నా ఎక్కువ హాల్స్ ఉండేవి... అశోకా (అంతక్రితం అది గజలక్ష్మిట), శ్యామలా, రామా (ఇప్పుడు నాగదేవి), జయ (ఇప్పుడు విజయ), కృష్ణా (ఇప్పుడు సాయి కృష్ణా), మినర్వా (అన్నపూర్ణగా మారి చరిత్రలోకి పోయింది), హనుమాన్ (జయశ్రీ అయి, తర్వాత సూర్యగా అయింది). కాకినాడలో మనకన్నా ఒకటి తక్కువ అనుకుంటా... ఆ పాయింట్ పట్టుకుని గట్టిగా వాదించేవాణ్ణి... మన ఊరు ఒక చైతన్య ప్రవాహం... కలప, అల్యూమినియం, గ్రాఫైట్...బిజినెస్సులు. బంగారం వ్యాపారానికైతే... ఇటు విజయవాడ, అటు విజయనగరం..తో సమానమైన మార్కెట్టు మనది...అంత కాంపిటీటివ్ ...
ఆధ్యాత్మిక పరిమళాలు చెప్పనక్కరలేదు.. సాహిత్య గోష్టులు సరే సరే....కృష్ణాష్టమి రోజుల్లో...గోదావరి తీరంలోని ప్రతి వీధిలోనూ వేద ఘోషే....పుష్కరాలొచ్చాయంటే ప్రతి ఇల్లూ అన్నపూర్ణ స్వరూపమే.. ఎంత చెప్పినా తరగని రాజమండ్రి విషయాలు గుర్తొస్తే మళ్లీ ముచ్చటిస్తాను.. మీకు ఇంట్రెస్ట్ గానే ఉందని నమ్ముతున్నాను....

స్కూలు పుస్తకాల సీజన్ వచ్చిందంటే రామా అండ్ కో, వేంకట్రామా అండ్ కో అవే ఫేమస్.. వాళ్లు పబ్లిష్ చేసిన పుస్తకాలు పాఠ్యపుస్తకాలుగా ఉండేవి.. కాళహస్తి తమ్మారావు, రౌతు బుక్ డిపో .. ఓరియంటల్ లాంగ్ మన్స్ మొదలైనవి కూడా ఉండేవి.. కాలేజీ రోజుల్లో ఆంధ్రాబుక్ షాప్ ఉండేది శ్యామలా థియేటర్ ప్రాంతంలో... అత్యవసరమయితేనే అక్కడకు .. ఎందుకంటే ఆ ఓనర్ ... అబ్బో చాలా౦; కోపంగా ఉండేవాడు.
గుండువారి వీధిలో ఎంత బిజినెస్ అండి బాబు.. అంతా కాస్ట్ లీ బిజినెస్.. బంగారం, వెండి అక్కడ ప్రధానంగా ... ఇప్పటికి అంతే... బాలాజీ వేణుగోపాల్ అని ఒక ఇత్తడి షాపు... మార్వాడీస్.. లోపలికి వెళ్తే పెద్ద కాంపౌండ్, ఒక పెద్ద ఇల్లు అన్నమాట.. ఒక్కో ఐటమ్ ఒక్కో గదిలో ఉన్నట్టు ఉండేది.. ఇత్తడి ఇస్త్రీపెట్టెలు, రకరకాల బిందెలు, దేముడి సామాన్లు... ఒకరకం కాదు,,, అన్నీ తలోగదిలోనూ ఉండేవి... కళ్లవేడుకగా ఉండేది... అక్కడే ఓ బంగారం వర్తకులు... శివలాల్ అని పేరు గుర్తు... మా పిన్నిగారి దత్తుని వివాహమప్పుడు బంగారం, వెండి కొనడానికి వెళ్లాం... కొనేవాళ్ళు డబ్బిస్తుంటే లెక్కెట్టుకుని అక్కడ కూర్చున్నతను ఆ ప్రక్కనున్న గదిలోకి కట్టలు కట్టి విసిరేసే వాడు .. భలే తమాషాగా అనిపించింది.. ఆ తర్వాత , హడావుడి తగ్గాక సేఫ్ లో పెడ్తాడన్నమాట...అంత హడావుడిగా ఉండేవి అక్కడ బేరసారాలు.. ఆ వర్తకుల్లో చాలామందికి అక్కడ నివాస భవనాలు కూడా ఉన్నాయి.. వైశ్యులు, మార్వాడీలు, బ్రాహ్మణులు... అందరూ ఉంటారు.. పైకి కనపడే చిన్నవీధి కాకుండా లోపల్లోపల పూతరేకు మడతల్లా ఇరుకు సందులు అందులో దివ్య భవంతులు.. ఆశ్చర్యంగా ఉంటుంది.. ఆ వీధి చూస్తుంటే వెంటనే కాశీనగరం గుర్తుకొస్తుంది.... ఇంకొంచెం ముందుకు వెడ్తే నూనె కొట్ల సందు.. అన్నీ నూనెకొట్లే... మెయిన్ రోడ్ లోనే కూరగాయల దుకాణాలు...నవ నవలాడుతూ,,పచ్చగా కనువిందుగా కూరల అంగళ్లు.. కళ్లతో చూస్తే చాలు కడుపు నిండిపోతుంది....ఈ దుకాణాలు ఇప్పుడు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోకి మారిపోయాయి....
వంకాయలవారి వీధి మొగదలలో అన్నదమ్ములు ఇద్దరు అరటాకులు అమ్మేవారు.. పేద్ద ఆకు.... మట్ట దగ్గరకు కోసి, అయిదేసి కలిపి అమ్మేవారు.. అయిదు ఆకులంటే ఒక కవిరి అనేవారు... ఒక కవిరి కొంటే ముచికాకులు అయిదూ కాక, చిన్న చిన్న ఆకులు పన్నెండో పదిహేనో అయ్యేవి.. పదిహేనుమంది సునాయాసంగా వాటిలో తినడానికి వీలుండేది... సుమారు మూడు నాలుగు అడుగుల పొడుగున్న అంత పెద్ద అరటాకుల కట్ట ఇంటిదాకా ఆకు చిరగకుండా తేవడం ఒక ఫీట్.. ఇప్పుడు ఆ కవిరే అయిదు ముచికాకులు ఇస్తారు..చిరగకుండా ఉంటే అయిదుగురు వాటిల్లో తినొచ్చు... అప్పుడు అది పావలా... ఇప్పుడు అయిదు రూపాయలు... అయినా మా రాజమండ్రిలోనే చవకనుకుంటాను...కాకినాడ వాళ్లకి మన రోడ్స్ ఇరుకని వాదించేవారు... మీ రాచవీధి, మెయిన్ రోడ్ దొప్పెడుంది... అనేవారు..
నేను: నిజమే, కాని మేం ఏదన్నా క్లాత్ బేనర్ కట్టాలంటే ఎక్కువ పురికోస లేకుండా సెంటర్ కు కట్టొచ్చు.. మీరైతే ఆ చివరనుంచి ఈ చివరికి ఎంత తాడయినా సరిపోదు.. అదీకాక అంత తాడు కట్టి చిన్న బేనరు కట్టినా అసహ్యంగా ఉంటుంది... మెయిన్ రోడ్ లో మేమైతే వర్షం వచ్చినా షాపు నుంచి షాపుకు తడవకుండా వెళ్లొచ్చు.. ఆసదుపాయం మీకేది..? పెద్ద రోడ్ అయితే ఆ చివరొకడూ, ఈ చివరొకడు.. ఒకడికీ ఒకడికి పొత్తేది.. మా ఊళ్లో రాసుకు, పూసుకు తిరుగుతుంటే ఆప్యాయతలు తొణికిసలాడతాయి... ఇలా ఎదుర్కొనేవాణ్ణి...
సిటీ బస్సులు అప్పట్లో కాకినాడలో టైమ్స్ మెయింటైన్ చేస్తూ చాలా బాగా నడిపేవారు.. మన ఊరిలో లేటుగా ప్రారంభమయ్యాయి.. బస్సులు పెరిగినా అన్నీ గోకవరం స్టాండు నుంచి, ధవళేశ్వరమే ఎక్కువగా వెళ్లేవి.. శ్యామలా సెంటర్ అయితే మరీ తమాషా.. ధవళేశ్వరం వైపు వెళ్లే బస్సులన్నీ అక్కడే ఉండేవి.. అన్ని ఇంజనులు ఆన్ చేసి ఉంచేవారు.. డ్రైవరు సీటులో రెడీగా ఉండేవాడు.. మన ఏ బస్సు ఎక్కుదామా అని ఆలోచిస్తుంటే బస్సు ఆక్సిలేటర్ నొక్కి డుర్రుమనిపించేవాడు.. వెళ్లిపోతోందేమోనని కంగారుగా బస్సెక్కగానే లోపలున్న కండక్టరు డబ్బులుచ్చుకుని, టిక్కట్టు కొట్టేవాడు... ఏంచేస్తాం.. కూర్చోక తప్పేది కాదు.. ముందు బస్సులు ఒకటొకటిగా వెళ్లిపోయేవి, మనబస్సు సారధులిద్దరూ...అప్పుడు తాపీగా దిగి బాతాఖూనీ..... మిర్తిపాడు వైపు ఓ బస్సు ఉండేది.. ఆ బస్సు రిటర్న్ లో గోకవరం బస్టాండులో గంటల తరబడి ఆగిపోయేది.. అద్దీ సి టీ బ స్సు.... ఇప్పుడు మనకున్న సిటీబస్సులను సమర్ధించాలంటే మనకి డిఫెన్స్ లేదు... అందుకని అడ్డంగా డబాయించేవాణ్ణి.....ఆరోగ్యానికి నడక ఉత్తమము., అందుకని మేం బస్సులెక్కము.. మీరు అస్తమానం బస్సుల్లో తిరుగుతారు.....ఆరోగ్యాలు జాగ్రత్త మరి...అని...
రాజమండ్రిలో సిటీబస్సులు రానప్పుడు శ్యామలా సెంటరులో మోటారు సైకిల్ రిక్షాలు ఒకటో రెండో ఉండేవి...ఆటోలకన్నా ఇవి కొంచెం డిఫరెంట్. అంతకన్నా ముందు జట్కాబళ్లు.. ధవళేశ్వరం గుర్రాలని గొప్ప పేరు.. ఒక అడుగు ముందరికేస్తే రెండడుగులు వెనక్కి వెళ్తాయట... భమిడిపాటి వారి రచనల్లో కూడా ధవళేశ్వరం జట్కా ప్రసక్తి వస్తుంది.. నేనెక్కలేదు కాని, చూసిన గుర్తు.... సినీమా హాల్స్ విషయంలో మనకో ప్లస్ పాయింట్.. అప్పట్లో మన ఊరిలో కాకినాడకన్నా ఎక్కువ హాల్స్ ఉండేవి... అశోకా (అంతక్రితం అది గజలక్ష్మిట), శ్యామలా, రామా (ఇప్పుడు నాగదేవి), జయ (ఇప్పుడు విజయ), కృష్ణా (ఇప్పుడు సాయి కృష్ణా), మినర్వా (అన్నపూర్ణగా మారి చరిత్రలోకి పోయింది), హనుమాన్ (జయశ్రీ అయి, తర్వాత సూర్యగా అయింది). కాకినాడలో మనకన్నా ఒకటి తక్కువ అనుకుంటా... ఆ పాయింట్ పట్టుకుని గట్టిగా వాదించేవాణ్ణి... మన ఊరు ఒక చైతన్య ప్రవాహం... కలప, అల్యూమినియం, గ్రాఫైట్...బిజినెస్సులు. బంగారం వ్యాపారానికైతే... ఇటు విజయవాడ, అటు విజయనగరం..తో సమానమైన మార్కెట్టు మనది...అంత కాంపిటీటివ్ ...
ఆధ్యాత్మిక పరిమళాలు చెప్పనక్కరలేదు.. సాహిత్య గోష్టులు సరే సరే....కృష్ణాష్టమి రోజుల్లో...గోదావరి తీరంలోని ప్రతి వీధిలోనూ వేద ఘోషే....పుష్కరాలొచ్చాయంటే ప్రతి ఇల్లూ అన్నపూర్ణ స్వరూపమే.. ఎంత చెప్పినా తరగని రాజమండ్రి విషయాలు గుర్తొస్తే మళ్లీ ముచ్చటిస్తాను.. మీకు ఇంట్రెస్ట్ గానే ఉందని నమ్ముతున్నాను....
6 comments:
మరిచిపోలేని మంచి జ్ఞాపకాలు .మన రాజమండ్రి మనకు ఎంతో ప్రియమయినది
ఎవరేమన్నా రాజమండ్రి ప్రత్యేకత ఎప్పటికైనా విభిన్నం ఎvaru కాదనగలరు .
చాలా బాగుంది వీలయినన్నిసంగతులతో మన వూరి విశిష్టత గురించి వ్రాస్తూ ఉండండి
sastry jee, very happy for your ready response.. glad to know..... you liked it.. i will write some more in near future....
ఒక సంవత్సరం ట్రైనింగ్ కాలేజిలో చదివిన మాకే రాజమండ్రి, వందల అనుభూతలను మిగిల్చింది.
ఎంతయినా రాజమండ్రే గ్రేట్ అండి. అన్నీ గుర్తు చేసారు, ధన్యవాదలండి.
నేను మొట్టమొదటి సారి జట్కా బండి ఎక్కింది రాజమండ్రి లోనే. మాది రాజమండ్రి కాదు, మీరు వివరించిన ప్రాంతాలు అన్నీ తెలియదు అయినా, నాకు బాగా నచ్చిన ఊరది. కారణం గోదావరి.
మన నల్లమందు నందు గురించి కూడా చెప్పండి
నా పోస్ట్ చూసి రాజమండ్రి కాపోయినా స్పందించిన కిషోర్ గార్కి ధన్యవాదములు..
సాధారణ పౌరులకు... నల్లమందు సందు అమ్మో అది రిచ్ సందండి బాబు, అయినా ప్రయత్నిస్తాను.
Post a Comment