Pages

Thursday, October 14, 2010

పండగ స్పెషల్

దసరా కోసం ఓ స్కిట్టు.

అన్నయ్య యిచ్చిన వంద


లక్ష్మి: ఏమండీ....

రావ్: ఏమిటి లక్ష్మీ...

లక్ష్మి: వరలక్ష్మీ వ్రతానికి కుదరదన్నారు... పోనీ దసరా నాటికైనా....

రావ్: ఏమిటోయ్ ?

లక్ష్మి: అదేనండీ..ఓ కాసు బంగారం...

.రావ్: అమ్మో ! బంగారమా ! --- కాసా.....

లక్ష్మి: పోనీ....ఓ తులం...తులం చాల్లెండి, సర్దుకుంటాను.

రావ్: బాగుందోయ్--బాగుంది. తులమంటే కాసు కన్న యెక్కువ తెలుసా ? యేమిటో ... నీకంతా వేళాకోళంగా వుంది....

లక్ష్మి: (కళ్ళల్లో నీళ్ళు)..పోనీలెండి, నే నేమన్నా మీకలాగే వుంటుంది.

రావ్: నేనేమన్నానోయ్ ?

లక్ష్మి: మొన్నటికి మొన్న, మా అన్నయ్య వచ్చి వెళ్తూ.. "చెల్లీ ! గాజులేయించుకో" అని వంద రూపాయలిచ్చాడు.---యిచ్చాడా? - అది కాస్తా 'బ్యాంకులో వేస్తాను, వడ్డీ వస్తుంది' అని పట్టికెళ్ళారు. పట్టికెళ్ళారుకదా ? పోనీ..చెప్పినట్టు బ్యాంకులో వేసారా ? లేదే..."వచ్చేవి శ్రావణ భాద్రపదాలు..అప్పుడు పనికొస్తుంది" అంటూ గొడుగు కొన్నారు. అది కొని వూరుకున్నారా... లేదే....అది పట్టుకుని సిటీబస్సేక్కారు. - దిగేటప్పుడు ఆ గొడుగుకాస్తా సిటీ బస్సులో వదిలేసారు. అది దొరుకుతుందేమోనని రానూ పోనూ ఎనభై...ఎనభై రూపాయలు యిచ్చి, ఆ బస్సు డిపోకు ఆటోలో వెళ్ళి చేతులూపుకుంటూ తిరిగి వచ్చారు....(ముక్కు చీదుకుంటూ).. అన్నయ్య యిచ్చిన ఆ వందా నా చేతిలోనే వుంటే... తులం బంగారంకోసం మిమ్మల్నీ మిమ్మల్నీ అడిగే బాధ తప్పేది కదా...(నిష్క్రమణ)

*********

లక్ష్మి: (పాట)

రావ్: యేమిటోయ్...హుషారుగా వున్నావు?... ఓ కప్పు కాఫీ యిస్తావేంటి ?

లక్ష్మి: ఎందుకివ్వనూ..(లోపలికి వెళ్ళింది)

రావ్: లక్ష్మీ! యిక్కడ బ్యాంకు పాస్ బుక్ వుండాలి, నువ్వు కాని చూసావా?

లక్ష్మి: (కాఫీ కప్పుతో వస్తూ) ..ఏమిటండీ..

రావ్: అదేనోయ్ ... బ్యాంకు పాస్ బుక్...

లక్ష్మి: ఏమో నాకేం తెలుసు... అప్పట్నించీ కనపడలేదా ?

రావ్: ఎప్పట్నించి...

లక్ష్మి: అదేనండి...ఆ మధ్య మా అన్నయ్య వచ్చి, వెళ్తూ వెళ్తూ 'గాజులేయించుకో చెల్లీ' అని వంద రూపాయలు యిచ్చాడు... యిచ్చాడా? ..అది కాస్తా 'బ్యాంకులో వేస్తాను వడ్డీ వస్తుంది' అని పట్టుకెళ్ళారు. పోనీ బ్యాంకులో వేసారా...లేదే...'వచ్చేవి శ్రావణ భాద్రపదాలు అప్పుడు పనికొస్తుంది' అనిచెప్పేసి గొడుగు కొన్నారు. పోనీ కొని వూరుకున్నారా లేదే... అదిపట్టుకుని సిటీ బస్సెక్కారు....దిగేటప్పుడు ఆ గొడుగు కాస్తా సిటీ బస్సులో వదిలేసారు. అది దొరుకుతుందేమోనని, రానూ పోనూ ఎనభై....ఎనభై రూపాయలు యిచ్చి ఆటోలో బస్సుడిపోదాకా వెళ్ళి చేతులూపుకుంటూ తిరిగి వచ్చారు..... ఆ వందా నా చేతిలోనే వుంటే తులం బంగారం కోసం మిమ్మల్నీ మిమ్మల్నీ దేవురించే బాధ నాకూ తప్పివుండేది....ఈ రోజు పాసుబుక్కు కోసం మీ బుర్రమీద వున్న ఆ కాసిని వెంట్రుకులూ పీక్కునే బాధ మీకూ తప్పివుండేది. ఇదంతా నా ఖర్మండీ...ఖర్మ.....ఖర్మ....

రావ్: అబ్బబ్బా...మళ్ళీ మొదలెట్టావ్...చంపేస్తున్నావోయ్...

లక్ష్మి: అవున్లెండి...నే నేమన్నా మీ కలాగే వుంటుంది..

రావ్: సర్లే, నే నేదో మేనేజ్ చేస్తాను కాని...యేమన్నా డబ్బులుంటే జేబులో పెడ్తావా?

లక్ష్మి: డబ్బులా? నాకు డబ్బులేమన్నా వుంచుతున్నారా యేమిటి మీరు....ఆ రోజు అన్నయ్య వెళ్తూ వెళ్తూ...గాజులేయించుకో చెల్లీ అంటూ ఓ వంద రూపాయలు యిచ్చాడు...యిచ్చాడా?...అది కాస్తా...

రావ్: తల్లీ యిక ఆపు....అరే! ఏం మాట్లాడినా-ఆవు కాంపోజిషన్ లా మళ్ళీ అన్నయ్య యిచ్చిన వందకే వచ్చేస్తావ్....సర్లే జీతం రాగానే నీ వందా నీకిచ్చాస్తానులే....నన్ను చంపకు.

లక్ష్మి: వున్న విషయం చెప్తే మీ కలాగే వుంటుంది....ఆ రోజు అన్నయ్య వెళ్తూ వెళ్తూ 'గాజు లేయించుకో చెల్లీ' అంటూ వంద రూపాయలిచ్చాడు....యిచ్చాడా...అది కాస్తా బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తుందని పట్టికెళ్ళారు.....ఆ వందా నా దగ్గరే వుండి వుంటే...మీరిచ్చే వందతో రెండొందలయ్యేది...మిమ్మల్నీ మిమ్మల్నీ దేవురించకుండా యెంచక్కా నాలుగైదు తులాల బంగారం కొనుక్కునేదాన్ని..ఏంచేస్తాం... అంతా నా ఖర్మండీ...ఖర్మ...ఖర్మ...

రావ్: హతోస్మి....

------------


( మా హాసం క్లబ్ కార్యక్రమాలలో ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆమోదం పొందింది. ఇందులో మాశ్రీమతి.. విజయలక్ష్మి, నేనూ నటించాము.)

4 comments:

voleti said...

I couldn't understand the concept and twist of this comedy scene..

హనుమంత రావు said...

డియర్ శ్రీవోలేటి,
నమస్కారం. చెప్పిన డైలాగే మళ్ళీ మళ్ళీ
చెప్పడంలో ఓ సామాన్యగృహిణి అమాయకత్వం,
భర్త వంద యిస్తాననగానే ఖర్చైన వందతో
రెండువందలవును కదా అని భావించే
ఓ తెలివైన అమాయకత్వం చెప్పబోయా.
ప్రదర్శించినపుడు ప్రేక్షకులు ఆనందించారు.
అందుకనే బ్లాగు పెట్టాలని వుత్సాహపడ్డా.
మీ స్థాయికి నా రచన రాలేకపోయింది.
badluck. మెరుగైన రచనలు చేసే
ప్రయత్నం కొనసాగిస్తా. మీ విలువైన
సమయం నా కోసం వెచ్చించి అప్పుడప్పుడైనా
మీ స్పందన తెలియజేస్తూ వుండండి.
శలవు..........దినవహి.

swapna@kalalaprapancham said...

hahaha

ammyilu antene alage untaru.
nenu chinnapudu exams unapudu ma nanna ni 5 ki lepu, 6 ki lepu ani , nenu okavela levakapote nannu guddu kotto elagola lepu nanna ani thega cheppi padukune danni , theera nenu levadam late ayina, nanna bymistake 10 mins late chesina lepadam ayyo nanna na time antha poyindi ippudelaga chadivevi chala unnayi ani edisthane thappa unna time lo ayina konni anna chaduvukundam anede undadu, poyin atime ni gurtu techukoni pade pade vagutu undedanni appadu :)

హనుమంత రావు said...

స్వప్నగారికి నమస్కారం,
నిన్నటి ఙ్ఞాపకాలలోకి మిమ్మల్ని నా
యీ రచన తీసుకువెళ్ళి సంతోషింప
చేసిందంటే నా మీద నాకు
నమ్మకం పెరిగింది.మీతో పరిచయం
ఆనందదాయకం......శలవు...దినవహి.