విజయదశమి శుభాకాంక్షలు
...........మన పురాణ గ్రంథాలు, మంత్రశాస్త్రాలు
విశ్వశక్తిని అనేకంగా రూపావిష్కరణ చేసాయి.
వాటిని ఆరాధించే పద్ధతుల్లోనూ మహాశాస్త్రవేత్తలు
మొదలుకొని, సామాన్యులవరకు అన్నివర్గాల
వారికీ, వివిధ బౌద్ధికస్థాయులు కలవారికి తగినట్లుగా
సాంప్రదాయాలు ఏర్పడ్డాయి.
యఙ్ఞయాగ మంత్రదీక్షలేకాక--గ్రామదేవతల పూజలు,
జాతరలు, బతుకమ్మ పండుగలువంటి సత్కర్మలు,
చిందులు, పాటలు, సంబరాలు....ఇవన్నీ ఒకే పరాశక్తిని
ఆరాధించే అనేకమైన అందమైన పరంపరలు.
ఇన్ని వైవిధ్యభరితమైన శక్త్యారాధనా ధారలను సిద్ధం
చేసుకున్న హైందవధర్మంలోని అద్భుతానికి
జో హా రు లు.తేటదనానికి సంకేతమైన శరదృతువు
--- ఆరంభంలో --తేటమనస్సుతో ఆ మహాచైతన్యాన్ని
'అమ్మా' అంటూపిలిచే నవరాత్రి వేడుకలలో
...దేశమంతా పునీతమవుతున్నది.
హిమవత్పర్వతం జ గ దం బ పుట్టినిల్లయితే, మధ్యదేశాన్ని
విం ధ్య వా సి ని కి నెలవుగా, చివరి భాగమైన మలయాళ
ఖండాన్ని మ ల యా చ ల వా సి ని - భగవతికి తావుగా
భావించిన శక్తి సాంప్రదాయం.....ఈ దేశపు ఆది, మధ్య, అంతాలను
జ గ దం బ స్థానాలుగా పూజించడమేకాక, అడుగడునా
"శక్తి పీఠాల"ను ప్రతిష్ఠించుకుంది. ఈ కారణంచేతనే ఈ
దేశాన్ని తలచుకోగానే జగన్మాతృ భావన పొంగుకువచ్చి
'వం దే మా త రం' అని మోకరిల్లుతాం. విశ్వజనీనమైన
వి శ్వ జ న నీ భావానికి వం ద నా లు....
(శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు
'ఈనాడు' అంతర్యామిలో విజయదశమి నాడు వ్రాసిన దానినుండి.)
3 comments:
ఇదే రకంగా హాస్యవల్లరి క్రిందకు వస్తుంది
స నామము వారికి (ప్రయోగం తప్పేమో-
అర్థం చేసుకుంటారుకదా),
నమస్కారం.
దొరికిపోయానండోయ్. నిజమే నా బ్లాగు పేరు
హాస్యవల్లరే...కాని నాకుహాస్యం ఆధ్యాత్మికం
రెండూ యిష్టం...ఆ విషయం నా ప్రొఫైల్ లోవ్రాసాను..
రెండూ వ్రాద్దామనే నా ప్రయత్నం. అదియునుంగాక
నాకున్న బ్లాగు యిదే కనుకన్నూ, ఈరోజు చదివిన
విషయం యిదికనుకన్నూ. ఆ చదివింది
నాకునచ్చిందికనుకన్నూ, ఆవిషయం
మనవారందరితోనూ పంచుకోవాలనే
వుత్సాహముతోనున్నూ,మరియు విజయదశమి
శుభాకాంక్షలు తొందరగా చెప్పేద్దామనిన్నీ
ఈ విధంగా చేసితిని. ప్లీజ్ అర్థం చేసుకోండీ..
(గతంలో మీరో మెయిల్ పెట్టారు...చూసా...dear hanumanatharao gaaru!
ఈనాడు కి మీరు పంపిస్తారుకదా. మీ హాస్యం
నాకు చాలా యిష్ఠం...అవి మాయింట్లో చదివి
వినిపిస్తూ వుంటాను. మీరు ఆ మీరే అన్న
విషయం దయచేసి తెలియచేయగలరు....ఆ ధైర్యంతోనే
ఈ నాలుగు ముక్కలూ....కొచెం తొందరపడ్డానేమో)
...............శలవు......దినవహి
ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............
- SRRao
శిరాకదంబం
Post a Comment