Pages

Saturday, November 13, 2010

ఈ నాటి బాలలు




చాచా నెహౄ పుట్టిన రోజు
చిన్నారి బాలల పండుగ రోజు

పెద్దలందరూ ముందు కొచ్చారు
ఘన కీర్తులు వల్లించుకుంటూ
వున్నవాళ్ళు క్రాఫింగులు
లేనివాళ్ళు టోపీలు సర్దుకుంటూ

చిన్నారి పసి మనస్సులకు
చెప్పారు సుద్దులెన్నో
రేపటి పౌరులు మరి మీరేనన్నారు
భావిభారత పౌరులంటూ జే జే లు పల్కారు

సుద్దులన్నీ పొందికగా సర్దారు
తమ లేత మనసుఅరల్లో నేటి బాలలు
రేపటి పౌరులయ్యాక మరి వీరే
చెప్పాలిగా రేపటిబాలలకీ సుద్దులు

1 comment:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

బాలల దినోత్సవం అంటే నెహౄ నే అనే మన పిల్లలకు
అలవాటు చేశాం! నిజానికి పిల్లల వికాసానికి "బాలానంద
సంఘం" స్థాపించి పిల్లలకు తెలుగులో మొదటి సారిగా
"బాల" పేరిట పత్రికను 1945 లోనే తీసుకొని వచ్చి,రేడియో
లో పిల్లల కార్యక్రమాలు ప్రతి ఆదివారం నిర్వహిస్తూ ఎనలేని
సేవ చేసిన బాలన్నయ్య,బాలక్కయ్యలను ఈ తరం చిన్నారులకు
గుర్తు చేయటం మనందరి కర్తవ్యం!