భావగారి కబుర్లు
రచన : డి.వి.హనుమంతరావు
9949705166
***************
ఏమండోయ్ భావగారు....రండి..రండి.....యెన్నాళ్ళకెన్నాళ్ళకి?
...ఇంటి దాకా వచ్చాక ఇప్పుడు.బాహానే పలకరిస్తారు...
బొత్తిగా నల్లపూసైపోయారు కదా?
మీరుమాత్రం మహ మణిపూసా యేమిటి?..
యెన్నాళ్ళైందండీ మనంఇలా మాట్లాడుకుని...
ఏంచేస్తాం చెప్పండీ....రోజులు మారిపోయాయి..ఇదివరకైతే మనకబుర్లకోసం నలుగురూ ఓ ఇంట రేడియో వుంటే అక్కడకు చేరిమరీ వినేవారు....యిప్పుడు ఆ రేడియో వినరు...వినడానికి టైమూలేదు..ఏమంటారు?
భావగారు చెప్పాక ఇంక నేనేమైనా అనడానికి....హార్టా--టాంకా...
బావగారూ అదేం ప్రయోగమండోయ్?
దొరల భాషలో మాట్లాడేను బావగారూ...గుండా-చెరువా అని...
బావగారు మంచి చమత్కారులుకదా మరి..
సరే కాని బావగారూ.... యేమైనా విశేషాలు చెప్పండి...వినాలని వుంది....మీకు వినాలని వున్నా నాకు చెప్పాలని లేదు
బావగారుఅదేంటి...అలా అనేసారు...
బావగారూ...రాజకీయాలగురించి...చెప్పాలంటే.... ఏముంది చెప్పడానికి....పాలన అంతా హస్తినాపుర హస్తగతం...ఎంతో గొప్పవాళ్ళని ఏదో వూడబొడుస్తారని వీళ్ళని మనం యెన్నుకున్నాం. కాని..వీరికి స్వంత తెలివి లేదు. ఆ హస్తిన చెప్తేనే వీరు పెదవి విప్పుతారు...అది వీరి ముందుచూపో లేక అతివినయమో?
మాటకడ్డొచ్చాను బావగారు...ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గోతులుతవ్వుకోవడంలో చేయితిరిగిన యోధులు...కాదంటారా?
అంతేకాదు బావగారు...సమస్యలు తవ్వుకోవడం...సవాళ్ళు విసురుకోవడం...ఛాలెంజీలు...రాజీనామాలు...ఉప యెన్నికలు..పోయేది ప్రజలడబ్బు....ఇదేకాదుభావగారు....అసెంబ్లీలో మైకులు విసురుకోవడం...కుర్చీలు విరగ్గొట్టడం....ఎవరిసొమ్ము..ఒకసారైనా ఆలోచిస్తారా? మంత్రిపదవి...ముఖ్యమంత్రి పదవికూడా వారసత్వంగా కావాలిట అందుకని దార్పులు ఓదార్పులు.ఓ మూల గద్దె మీదున్నవాడి కుర్చీ లాగేసేవారు కొందరు...ఆ గద్దెమీదున్నవాడి పదవీ కాలం కుర్చీ కాపాడుకోవడానికే సరిపోవటం లేదు. ఇక ప్రజల గోడెవ్వరికి... సమయం యెక్కడ....
ప్రతిపక్షాలు వున్నాయి కదా భావగారూ మరి...
ఉన్నాయి భావగారు...కాని పోయిన పదవి యెలావస్తుందా అన్న ఆలోచన ఒకరిదైతే : పదవి అక్కరలేదు కాని...కనపడేవన్నీతమబోటి పేదలకే అనే సిద్ధాంతం మీద జెండాలు పాతే ప్రతిపక్షం ఒకటి. తన పరిశ్రమ అనండీ, వృత్తి అనండి వాటిలో బాగా డబ్బుచేసి...ప్రజలు సడెన్ గా గుర్తుకొచ్చి...పేదలసేవ అంటూ బయలుదేరి చతికిలబడ్డాక....నిన్నఎవర్ని దుమ్మెత్తిపోసావోవారి ప్రక్కన చేరి ప్రజా సేవకోసం పాపం తపించే అవకాశ ప్రతిపక్షం ఒకటి...ఇవన్నీ చూస్తుంటే నా కర్థం కానిదొకటే భావగారు....అందరూ వుద్ధరిద్దామనుకునే ఆ పేదవాడు ఎవ్వరు......ఎక్కడుంటాడు...అసలున్నాడా?
అదేంటి భావాజీ...పేదవాడు అంటూ మీరూ మాటలాడుతున్నారు,,,బిల్డింగు తీసి మీరు రాజకీయ అరంగేట్రం కాని చేయబోతున్నారా ఏమిటి?
ఎంత మాటన్నారు...భావగారు?
ఏదో సరదాగా అన్నానులెండి....కాని భావగారూ పేదవాడు అంటేయెవరు అన్నారు చూడండీ ..అది అంత అర్రీ బుర్రీగా తేలేవిషయంకాదు భావగారు....తీరికగా ఆలోచిద్దాం...ముందు భోజనానికి లేవండి.

4 comments:
బావగారి కబుర్ల తో ఆనాటి రేడియో స్మృతులు గుర్తుకొచ్చాయి.
వీలయితే బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు బ్లాగ్ కూడా చూడండి. మీ బ్లాగ్లో లాగే చక్కటి musings ఉంటాయి.
మిస్సన్నగారు మిస్సవకుండా నా బ్లాగు చూస్తున్నారంటే చాలా
ఆనందంగా వుంది...ఈ పోస్టుకి ఎవరూ స్పందించలేదు...మీ
వుత్తరం మళ్ళీ ఉత్సాహం నింపింది...అభినందనలు...ఫణిబాబుగారి
బ్లాగు చూస్తూనేవుంటాను..ఆయన కొన్నాళ్ళు రాజమండ్రిలో
వున్నప్పుడు పరిచయం..సైంటిస్టు...మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్
వుంది..అది రచనల్లో కనపడుతూ వుంటుంది....నీ పద్యపూరణలు
యే బ్లాగులో వుంటాయో తెలియపర్చగోర్తాను....శలవు...దినవహి.
హనుమంతరావు గారూ,
చదివేవాళ్ళు 'అపోహ' పడతారు మరీ మీరు నన్ను 'సైంటిస్ట్ ' అన్నారంటే ! ఏదో ఊసుబోక కబుర్లు వ్రాస్తూంటాను.పైగా నా చదువుగురించీ ఎన్నెన్నో పోస్టులు చదివిన పాఠకులు, 'ఇదేమిటీ ఆయనేమో చదువుకీ, తనకీ ఆమడ దూరం అంటాడూ, ఈయనేమో 'సైంటిస్ట్' అంటున్నారూ' అని. మాస్టారూ మీకు అసలు అలాటి ఇంప్రెషన్ ఎలా వచ్చింది? ఎప్పుడైనా మీతో తప్పుగా ప్రవర్తించానా? ఎనీవే థాంక్స్ !!
మహాశయా, నిజమే పొరపాటు పడ్డానేమో...అందువల్లనైనా
మీరు పలకరించారు.చాలా ఆనందమైంది..అయితే నా
బ్లాగు ప్రక్కనించి వెళ్ళినట్టు అనిపించింది...ఎప్పుడైనా
లోపలకి చూసి..కామెంటండి...కృతఙ్ఞుడ....దినవహి.
Post a Comment