Pages

Sunday, December 5, 2010

ఉపవాసమా? అంటే





వెంకట్రావ్! నీరసంగా కనపడుతున్నావు. ఉపవాసమా యేంటి?


అవునోయ్ గుర్నాధం? కార్తీక సోమవారం కదా...ఇదేఆఖరువారం కూడాను...మరి నువ్వు లేవా?


ఉపవాసాలా..నేనా...థ్రాష్.. మా ఆవిడవుంటుంది..వద్దన్నా వినదు. అయినా వెంకట్రావ్! అసలు


ఉపవాసమంటే ఏమిటి? భగవంతుడికి దగ్గరగా వుండడం..అంతేకాని భోజనం మానేయడం కాదు.


అది తెలుసుకోరు మీలాంటి వాళ్ళు...ఏమిటో మీ ఛాదస్తం.


నిజమే! ఇలాంటి గుర్నాధాలు అలాంటి వెంకట్రావులు మనకి తారసపడుతూనే వుంటారు.... ఇంత


వేదాంతం తెలుగు వాళ్ళమేచెప్పగలము...(మిగతా వారి సంగతి అంతగా నాకు తెలియదనుకోండీ).


దేముడికి దగ్గరగా వుండాలంటే ఏమిటి ?తిరుమలే వెళ్ళామనుకుందాం! ముందు మనం చూసేది


దేముణ్ణికాదు... ముందు బస తర్వాత ఫుడ్..తర్వాత తిరుగు ప్రయాణానికి యేర్పాటు అన్నీ


అయ్యాకనే దర్శనం అంతేకదా..అప్పుడు తోసుకుంటూ..తోసుకుంటూ ఆ క్యూలంబడి పోయి పోయి


గర్భగుడిలో వాలంటీర్లు...నడవండి..నడవండి అంటూ తొయ్యడం...యిక చాలు రండమ్మాఅని లాగడం...


'నడవండీ', 'చాలురండి' .. ఈ రెండుశబ్దాల నడుమ పెరుమాళ్ళ దర్శనం..రెండు ఆలోచనల మధ్య


చిద్దర్శనంలాగా...అయిందా!... లేదా!... ఏమో!.....ఆ కాసేపూ ఓ దివ్యానుభూతి.వెంటనే మాయ


కప్పేస్తుంది..."చూడనీయవయ్యా. బొత్తిగా ఇక్కడే త్రిప్పేసారు..పాపం మూటకట్టుకుంటున్నారు "...


మన సంస్కారాన్నిబట్టి రకరకాలుగా అభిప్రాయాలని కసిగా వెడలగక్కి...హుండీలో మ్రొక్కుబడులు...


అమ్మయ్యా పాపాలు పోయాయి...(మళ్ళీ క్రొత్తవి చెయ్యొచ్చు అన్నమాట)...అందరికీ అసంతృప్తే..


వెంకన్నబాబు అంటే గుడిలో వున్న వెంకన్నబాబుదర్శనం సరిగా కాలేదని....


ఓ సారి శ్రీవారి సేవా కార్యక్రమానికి వారంరోజులు వెళ్ళాము నేనూ మా శ్రీమతీ. అక్కడుండగా మా


శ్రీమతికి జ్వరం వచ్చింది.మేమున్న 'రామ్ బగీచా' వాళ్ళకి విషయంచెప్పి ఎవరైనా డాక్టరుంటారా


దగ్గరలో అని అడిగా టిటిడి హాస్పటల్ కి వెళ్ళమన్నాడు...ఎలావెళ్ళాలి అన్నా...అదిగో అక్కడ


ఆమ్బులేన్సే వుంది వెళ్ళి చెప్పు, వస్తాడన్నాడు...ఈ చిన్నదానికి ఆంబులెన్సా.....వస్తాడో రాడో


అని సందేహిస్తూనే ఆ ఆంబులెన్స్ డ్రైవరును అడిగా! వెంటనే వచ్చాడు..మమ్మల్ని హాస్పిటల్ కి


తీసుకువెళ్ళాడు. తానే ఓ.పీ వ్రాయించాడు..డాక్టరు దగ్గరకి కూడా వచ్చాడు..ఆయన మందులు


యిచ్చి..యింజషన్ చేసేదాకా దగ్గరున్నాడు.అరగంట వుండివెళ్ళమన్నారు డాక్టరు.. అప్పుడు మళ్ళా


యెవరైనా పిలుస్తారేమో అని చెప్పి; నర్సుతో చెప్తే తిరిగి వెళ్ళడానికి యింకో ఆంబులెన్స్ యేర్పాటు


చేస్తారని కూడా చెప్పి; అప్పుడు వెళ్ళాడు ఆ డ్రైవర్. తర్వాత అక్కడవున్ననర్సు ఇంకో ఆంబులెన్స్ కు


చెప్పారు....ఎవరూ కూడా డబ్బులు ఇస్తానన్నా పుచ్చుకోలేదు......స్వామి లఘుదర్శనమా..


మహాలఘా..వాళ్ళు లాగేసారా .....వీళ్ళు తోసేసారా అన్నీ మరచిపోయాము....ఎవరు ఎవరిదగ్గర


వున్నారు..దేముడి దగ్గర మనమా...మన బాగోగులు అనుక్షణం చూస్తూమనదగ్గర ఆయనా? ..


ఉచిత భోజనాలు దగ్గర...ఎంతమందో అలా వస్తూనే వుంటారు.. సాపడుతూనే వుంటారు...ఎంత వైభవం


...మొదటి రోజు మేం సేవా కార్యక్రమంలో వుండగాఓ ఆలయ వుద్యోగి అక్కడికి వచ్చాడు.మాట తీరూ అదీ


చూస్తే ఒక ఆకర్షణ..అతడు జనాంతికంగా అన్నాడు..మీరు ఇక్కడ భక్తులకు భోజనం వడ్డించే ఈ సేవ


స్వామి అనుగ్రహం వలన దొరికింది.కాలికి చెప్పులు లేకుండా,ఓ పవిత్ర కార్యక్రమంగా భావించి వడ్డించండి


అనిచెప్పాడు..క్రింద నిజానికి సాంబారూ అవీ పడి కొంచెం ఇబ్బందిగా వున్నా మేంఇద్దరమూ చెప్పులు


లేకుండానే వడ్డించాము పవిత్ర భావంతో...మేంవచ్చేసేరోజు అతడు మళ్ళీ వచ్చాడు...ఆ రోజు బుధవారం..


ఆ రోజు స్వామికిమూలవిరాట్ నుండి ఒక పవిత్రసూత్రం తీసుకువచ్చి ముందు మంటపంలో(రాములవారి


మేడ అంటారు)వేంచేసివున్న ఉత్సవమూర్తులకు కట్టి, ఆ ఉత్సవమూర్తులకు అభిషేకంచేస్తారట...కార్యక్రమం


పూర్తయ్యాక అపురూపమైన ఆపవిత్రసూత్రంప్రసాదభావంతో ముఖ్యులైనవారు స్వీకరిస్తారట...ఆ అభిషేకానికి


ఇందాక ప్రస్తావించిన ఉద్యోగి వెళ్ళి ఆ పవిత్ర సూత్రంముక్కతెచ్చి...మా ఇద్దర్నీ పిలిచి మాకు ఇచ్చాడు...


యెందుకంటే చెప్పులువదలి సేవ చేసామని. అంతేకాదు మూలవిరాట్ పాదాల మీది అక్షతలు మా చేతిలో


వుంచాడు...మన కదలికలు సదా కనిపెట్టే స్వామి దగ్గర మనం వుండాలా? ఉండగలమా?.


సరే పూమాలలు తయారుచేసే చోటికి సేవకై వెళ్ళాము.ఎన్ని పూలు..యెన్నెన్ని పూలు... బస్తాలతో వచ్చి


పడిపోతూనే వుంటాయి. దేశం నలుమూలలనించీ భక్తులు సమర్పించినవే స్వామి పూలవనంలోవి కావు..


ఒక్కోగజమాల ఒక గంటసేపు స్వామి గళసీమ నలంకరిస్తుందట..మేమందించే యేఒక్క పుష్పమైనా మా


కబురు స్వామి చెవిని వేసినా చాలు కదా...మనస్సులో ఏదో చెప్పలేని ఆనందం..యేదో మధురాతి


మధుర భావం ....అదంతా శ్రీనాథునివైభవమేకదా....


వైకుంఠ క్యూకాంప్లెక్సులో టిఫిన్ భక్తులకు అందించేసేవ. గోవిందుని దివ్యనామ సంకీర్తనతో పరవశించే


భక్తకోటికి సేవచేయగలిగే అవకాశము ఆస్వామి కల్పించిందే కదా..పాపనాశనం జలధారలలో,


కపిలతీర్థంలోని తీర్థజలాలలో, వికసించిన పూలతోటలలో, చెట్టుచేమలలో, కొండంతా తిరుగాడే


భక్త జనుల కోలాహలంలో....యెలుగెత్తి అరచే గోవిందనామంలో యెక్కడ లేడు - కొండంతా ఆ


యేడుకొండలవాని వైభవం కనపడుతూనే వుంటుంది..అలా చూడగలగడమే ఆయన దగ్గరగా వుండడం...


ఉపవసించడం.... కాదంటారా

18 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

నేను తిరుపతి వెళ్ళి సుమారు పదిహేను ఏళ్ళు దాటింది. ఇంక అక్కడికి వెళ్లక్కరలేదు. వచ్చి మీ దర్శనం చేసుకుంటే చాలనుకుంటాను.

చాలా బాగా వ్రాసారు. May GOD bless you.

సమూహము said...

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com

హనుమంత రావు said...

శ్రీ సుబ్రహ్మణ్యంగార్కి,
నమస్కారం...'దర్శనము' చాలా పెద్దమాట. అయినా
మీరు వస్తానన్నారు కనక ఆపదాన్ని పాపం అయినా
సరే అంగీకరిస్తున్నాను...మీదే ఆలస్యం...వచ్చేయండిమరి.

Admin said...

chala baaga raasaru.

మనసు పలికే said...

హనుమంత రావు గారు, టపా చాలా బాగుంది..:)

హనుమంత రావు said...

నా బ్లాగు చదివి ఇంగ్లీషులో అభినందించిన శ్రీమతి లక్ష్మిగారికీ,
తెలుగులో పలికిన మనసుగలవారికి...కృతఙ్ఞతలు తెలియచేసు
కుంటున్నాను.....దినవహి.

Hemalatha said...

చాలా బాగుందండి మీ బ్లాగ్.

హనుమంత రావు said...

శ్రీమతి హేమలతగార్కి, నమస్తే...నా బ్లాగు బాగుందన్నారు..
చాలా సంతోషము. సాహిత్యసభలలో మిమ్మల్ని చూస్తూ
వుంటాను, వింటూ వుంటానుకూడా...రాజమండ్రీ వాడ్నీ,
సాహిత్యమంటే ఇష్టపడేవాడినీ కనుక....

మిస్సన్న said...

అద్భుతం !

హనుమంత రావు said...

డియర్ మిస్సన్నగారు!,
ఏమనగలను, కృతఙ్ఞతలు అని తప్ప...

మంద పీతాంబర్ said...

మీరు వ్రాసిన మీ అనుభవం చదివిన తర్వాత , శ్రీ వేంకటేశ్వర స్వామిపై నున్న భక్తి ప్రపత్తులు మరిన్ని రెట్లు పెరిగాయి.
లోగడ TTD లొ E.O గా పని చేసిన శ్రీ ప్రసాదు గారు వారి అప్పటి అనుభవాలను వివరిస్తూ
వ్రాసిన పుస్తకం లోని విషయాలు మళ్లీ ఒకసారి గుర్తుకు వచ్చాయి. ఏదో ఒక రూపంలో మన వెన్నంటే ఉంటారన్న తలంపు
నిజానికి ఎంతో స్వాంతనను కలుగ జేస్తుంది.మంచి టానిక్కులా పని చేస్తుంది.

Unknown said...

dear sir

Chaala baaga raasaru...

హనుమంత రావు said...

పీతాంబర గారు, నిజమే శ్రీ ప్రసాద్ గారి అనుభవాలు చాల
అద్భుతంగా వుంటాయి..ఆ పుస్తకం చాలామందికి నేను
కొని యిచ్చాను.,కొనుక్కొని చదవమనీ చెప్పాను...మీ
అభిప్రాయాలు చాలా బాగున్నాయి.

శ్రీ కమ్మరగారు, మీ అభిమానానికి కృతఙ్ఞుడ.

Ravi Kiran Muddha said...

namassulu,
upavAsam mIda mIru rAsindi chadivAnu.
meeku anubhvekavaidyamainatuvanti vATini chusukoni konchem lopaliki velte, akkadinunchi nischalatvam loki vellipovacchu. prayatnam cheyandi.

హనుమంత రావు said...

రవిగారు నమస్కారము...నిశ్చలత్వం చాలా
పెద్ద మాటేమో... భావాన్ని వృద్ధి చేసుకొనే
ప్రయత్నం చేస్తాను... మీ సూచనలకు చాలా
సంతోషం...వీలైతే నా బ్లాగులో...అంతటావున్న
చైతన్య రూపం..అన్నది చూసి స్పందించండి.

హనుమంత రావు said...

అయ్యా(లు) (సమూహం కదా అందుకని బహు వచనం )...నమస్కారం. ఇదివరలో నా బ్లాగు లో మీరు వ్యాఖ్య వ్రాసారు. కాని వెంటనే నేను జవాబు ఈయలేకపోయాను . మన్నించండి..నా బ్లాగు మీ సమూహము లో చోటు సంపాదించు కున్నదో లేదో తెలియదు..మీ బ్లాగులోకివచ్చి చూసాను కాని ఎలా చేర్చాలో నా బుర్రకి అందలేదు...వీలుని బట్టి మీ సమూహంలో నన్ను కూడా చేర్చుకుని ధన్యుణ్ణి చేయండి. ఇదివరకే చేసి వుంటే తెలియ చేయండి.

YERRAPRAGADA PRASAD said...

మీరు భలేవారు సుమా! మీ పేరు ఆయన పెట్టుకున్నాడనో, లేదా ఆయన పేరు మీరు పెట్టుకున్నారనేమో కాని ఏమైతేనే హనుమంతుణ్ణి గురించి ఆయనకి తెలుసున్నంత బాగా మీరు చిన్నప్పటి గురుతులు కంటికి, మనసుకి నిండుతనం తెచ్చారు. ధన్యవాదాలండి.
ప్రేమతో....
యర్రాప్రగడ ప్రసాద్,
ఇల్లు: 2442570, సెల్లు: 9849271874

YERRAPRAGADA PRASAD said...

నిజం హనుమంతరావుగారు!
మహానుభావులు ఎంతమందో చెప్పారు.
"సేవ" లోనే జీవితపు "త్రోవ" చూసుకోవాలని.
అది భగవంతునికి ఎంతో ఇష్టమని
తిరుమల లో సేవలొ మీరు పొందిన అనుభూతి మీరు ఎంత చెప్పిన అది తక్కువౌతందని నేను భావిస్తున్నాను.
షిర్డీసాయినాధుడు కూడా అదే స్పష్టంగా తెలియచేసాడు.
క్రమక్రమముగా మనం అలా సాధనచేస్తుంటే... పరమాత్ముడు (మనలో వున్నవాడు) బయటే
తిరుగుతుంటాడు.
ఆ పుణ్యం కొద్దీ ...... తరువాత ఆయనే అంతటా కనిపిస్తూవుంటాడు ఆపై అందరిలో చాలా స్పష్టం గా
ఆయన్ని చూడగలుతామని నా అభిప్రాయం.
నమోవేంకటెశాయ:
******** యర్రాప్రగడ ప్రసాద్... రాజమండ్రి .