Pages

Friday, May 20, 2011

స రి గ ప ద మ ని



ఉదయం ఏడయ్యింది..ప్రక్క మీద బద్ధకంగా దొర్లుతున్నాడు విజయారావు...
"ఇంక లేవండి! బారెడు పొద్దెక్కింది."
ఆవిడ కచేరీ ప్రారంభించింది..ఉలిక్కిపడి మంచం దిగబోయాడు
"ఆగండాగండి!..అలా దక్షిణానికి దిగకూడదుట..నిన్న పురాణం
శాస్త్రుల్లుగారు చెప్పారు. ఉత్తరానికి దిగి తూర్పు వైపుకు రండి."
ప్రస్థానం చెప్పిందావిడ. అర్థంకాక ఇంకో ప్రక్కకు దిగబోతే
"అటుకాదండి ఇటూ."
"అబ్బా అటు గోడవుందికదే?"..
"మంచిమాట చెప్తే విసుగెందుకుట?"
జయమ్మకు చాలా కోపం వస్తుందలా విసుక్కునేవాళ్ళని చూస్తే...
తను విసుక్కున్నప్పుడులేదు కాని ...తను విసుక్కుంటే ఎందుకంత
యిదయిపోతుందని విజయారావు ప్రశ్న...
మొత్తానికి మంచావరోహణ (గమనిక: గ్రామరులో రచయిత పాపం వీక్)
ప్రకృతి పలకరింపులు అయి....బద్ధకంగాలేచి గుమ్మంలో పడేసిన
న్యూస్ పేపరు తెచ్చుకుని తలుపేసి వచ్చిసోఫాలో కూర్చున్నాడు విజయారావు.
కాలింగ్ బెల్ మోగింది..లేచి తలుపు తీయబోయాడతను...అప్పుడే కాఫీ
గ్లాసుతో వస్తున్న శ్రీమతి జయమ్మ
"ఏమండీ!!ఏమిటా దూకుడు? చొక్కా రి తీసుకోండి..బొజ్జ కనపడుతోంది
అస్సయ్యంగా" అని గాత్రం మొదలెట్టింది....సన్నాయి నొక్కులు నొక్కుతూ..
"నే తీస్తాలెండి తలుపు" అని తనే తలుపు తీసింది...
ప్రక్క వాటాలో దిగిన క్రొత్త జంటలోని 'మంచి భాగం' లోపలికివచ్చింది.
"రా అమ్మా.." అని సాదరంగా ఆహ్వానించబోయాడు విజయారావు....
వెనకనించి సప్రెస్డ్ వాయిస్ లో ఆవిడ
"ఇక్కడ నే నేడిసానుగా....మీరు లోపల కూర్చోండి
(.. ఏడవండి అన్నట్టే వుంది).....
గృహస్థుగా తనకామాత్రం స్వతంత్రం లేదా అని ఇదయిపోయాడు విజయరావు
మర్యాద కోసం అమ్మాయిని పలకరించ బోయాడు....జయమ్మకు నచ్చలేదు
"మిమ్మల్ని న్నాగా" అని నొక్కిపలికింది...తిరుగు టపాలో లోపలికి
పోయాడు విజయారావు....వాళ్ళబ్బాయి పుట్టిన రోజట..అందుకని వీరిజంటను భోజనానికి
పిలవడానికి వచ్చిందా అమ్మాయి. క్రింద ఫ్లోర్ లో వున్నగురునాధంగారి జంటను;
వీరినీ మాత్రమే పిలిచామని చెప్పింది.
"అంకుల్ కు చెప్పండి..ఆయనకూడా వచ్చి మళ్ళీ చెప్తారు.." అంది.
"ఫర్వాలేదమ్మా...నే చెప్తాగా" అని జయమ్మ ఆవిడ్ని పంపించేసింది.

"బాగుందోయ్ అమ్మాయి సంసారపక్షంగా" అని సర్టిఫికెట్ యిచ్చాడు..జయమ్మమౌనరాగం.
అర్థమయి పోయింది అనుభవఙ్ఞుడికి....ఎందుకో అంత కోపం...తనేమన్నాడు...అమ్మాయి బాగుందన్నాడు...అంతమాత్రానికే....ఏమిటో ఆడోళ్ళు. అనుకున్నాడు విజయరావు.....
తర్వాత షేవ్ చేసుకుని...బ్రష్ అవీ కార్నర్ టేబిల్ పై పెట్టబోయాడు..
"అక్కడ పెట్తారేమిటి అయ్యప్పస్వామి ఫోటో కనపడ్డంలేదూ..
లెంపలేసుకోండి...పాపం మా పద్మగారిచ్చారు..ఆయన శబరిమలై వెళ్ళరుట/"
"ఇంటినిండా అన్ని కీలకస్థానాల్లోనూ నీ ఫోటోలే రకరకాల
అవతారాల్లో వున్నాయి పరంధామా ! నీవైతే మూడోకాలుకోసం స్థలం వెతికావుకాని
నాకు మొదటి కాలుకే డౌటొచ్చేస్తుంది త్రివిక్రమా...కిం కర్తవ్యం?" అని వాపోయాడా దీనుడు.
రి వాటిని పెట్టి తర్వాత స్నానం కానిచ్చి...వచ్చి తడిపిన లుంగీ దణ్ణం మీద ఆరేస్తుంటే...
"కొంచెం పిండండి...ఎలా నీళ్ళోడుతున్నాయో చూడండి"
మళ్ళీ చెకింగ్..వళ్ళు మండిపోతోంది...పీక్కుందామంటే జుట్టు అంతంతమాత్రం...
కాస్త జుట్టూ దువ్వుకుని, దువ్వెన్న పెట్టేటప్పుడు దేముడు చూడకుండా దేవుడి బొమ్మ
వెనక్కి త్రిప్పి అపుడు దువ్వెన్న భద్రపరచి తువ్వాలు బెడ్రూమ్ తలుపు మీద ఆరేసాడు...
"తడీ పొడి తువ్వాళ్ళు తలుపులమీదవేస్తారు...పాడు అలవాటు.పాడు అలవాటా అని"...
bad habit..not singing habit....పాఠకులు అపోహపడకుందురుగాక..
"అంకుల్! వంటంతా నేనే చేసా...తిని ఎలా వుందో చెప్పండి" అని వడ్డన
కుపక్రమించింది...వీణ, (అమ్మాయి పేరు,)
టమోటా పప్పు వడ్డించబోయింది..వెంటనే జయమ్మ
"వీణా! రాత్రిళ్ళు మీ అంకుల్, పప్పేసుకోరు" అని బ్రేకేసింది...విజయరావుకి
మండింది...పప్పూ టమోటా చాలా ఇష్టం పాపమతనికి... క్రొత్త
రూలెప్పుడు శాసన సభలో చట్టమైందో అంతుపట్టలేదతడికి.
గుత్తివంకాయకూర వద్దు కాశిలో వదలేద్దామనుకుంటున్నారంది..
బంగాళా దుంప, నెయ్యి, మీగడ ...కొలస్ట్రాల్ పెంచుతుంది..ఇవేవీ వద్దంది:
రాత్రిళ్ళు మజ్జిగ నజ్జు చేస్తుంది పోసుకోవద్దంది.
...కొబ్బరి పచ్చడి దగ్గొస్తుంది వద్దంది...ఐస్ క్రీమ్ జలుబు, కిళ్ళీ వేడి....
అన్నీ వద్దంటూంటే తిన్నానో లేదో అన్నట్టు తిని లేచాడు విజయరావు...

భోజనాలు అయ్యాక మిత్రులు బయటి బాల్కనీలోనూ ఆడవాళ్ళు లోపలా
కబుర్లు చెప్పుకుంటున్నారు.
"మీ అంత అనుభవఙ్ఞుడిని కాకపోయినా నా అనుభవాలు నావి." అంటూ
మొదలెట్టాడు శేఖర్
"మొన్నామధ్య మాకొలీగ్ పెళ్ళికి ఫామిలీస్ తో వెళ్ళాము...మగాళ్ళంతా ఒకచోట;
ఆడవాళ్ళంతా ఒకచోటా చేరి కబుర్లు చెప్పుకుంటున్నాము...ఇంతలో మేం వున్న
దగ్గరికి మా స్టెనో వచ్చి కబుర్లు మొదలెట్టింది..తనకింకా పెళ్ళి కాలేదు..ఒక ఆఫీసులో
వాళ్ళంకదా కొంచెం హుషారుగాసాగింది సంభాషణా పర్వం.... తర్వాత భోజనాలు....
అందరూ ఇళ్ళకు బయల్దేరారు ఇక ఇంటికి వస్తున్నంతసేపూ స్కూటర్ మీద ఈవిడ
ఒక్క మాట మాటాడలేదు....ఇంటికొచ్చాక ఎడమొహం పెడమొహం...మర్నాటి
ఉదయానికి తుఫాను తీరం తాకింది.
"ఇంటి దగ్గర ఒక్క మాట రి మాట్లాడరు...పరాయివాళ్ళతో
ఏమిటో జాజ్ సంగీతాలు. మాకూ వినిపించవచ్చు కదా సంతోషిస్తాము" అని
వాయించింది...మాట్లాడినంతమాత్రాన ఆడవాళ్ళంతా మన వెనుక పడ్డానికి మనమేమీ
'నవమన్మధులమా' చెప్పండి... వారం రోజులు నిరసన వ్రతం...." శేఖర్ అనుభవం
చెప్పాడు.
"మా ఆయనా అంతే వీణా" అక్కడ గుర్నాధంగారి భార్య చెప్తోంది వీణకి....
"ఇప్పటికీ మా వారు నాకేదో పాఠాలు చెప్తారు...నేనెక్కడికైనా వెళ్ళివస్తే వెయ్యి
ఆరాలు తీస్తారు..పెళ్ళిలో క్రొత్త జంటకు అక్షింతలువేసేటప్పుడు నా ప్రక్కనవుండండి
నే నెవ్వరి ప్రక్కనో వుంటే బాగోదు...వీడియో తీస్తారుకదా అంటే తప్పు...అక్కడికి
తన్నేదో శాసిస్తున్నట్టు ఫీలయిపోతారు."
మా ఆవిడా శ్రుతి కలిపింది...."ఫోనుల్లో తమ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఎక్కడలేని
హుషారూ వచ్చేస్తుంది...బజారులో ఫ్రెండు కలిస్తే చాలు వో ఆనందం...అక్కడ మనం
ఏదైనా కావాలని అడిగామా...ఇక చూడూ.... ఆనందం::హుషారూ ఏమైపోతాయో ....
రుసరుసలూ విసుగులూ. మనమేమైనా అంటే తప్పు....మనమేదీ చెప్పడానికి పనికిరాము
పిన్నిగారూ" సంసారంలో రి లు ఇవే.
భోజనాలయ్యాక యేమో కాని...కడుపునిండా కబుర్లు చెప్పుకున్నాక తృప్తిగా అందరం
ఇళ్ళకు కదిలాము...తెల్లారితే ఇంటా సంగీతకచ్చేరీకి విద్వాంసుడు/విద్వణ్మణి
శ్రుతి రి చేయను...న్నాడో/...న్నదో ఎవరికెరుక ?
రి ని అంటూ సంగీత శిక్షణ
రి ని అని సంసారంలో క్రమశిక్షణ
వర్ణాలవే.......క్రమ బేధం
~~~~~౦౦౦~~~~~~

.

6 comments:

Yagna said...

:)

Unknown said...

నీవైతే మూడోకాలుకోసం స్థలం వెతికావుకాని
నాకు మొదటి కాలుకే డౌటొచ్చేస్తుంది త్రివిక్రమా...కిం కర్తవ్యం?"

:-)

బులుసు సుబ్రహ్మణ్యం said...

కిం కర్తవ్యం అంటే ఏమి చెబుతారు ఎవరైనా మాష్టారూ? రోలు వెళ్ళి మద్దెలతో మొరబెట్టిన లాభమేమి? 'తందానో తాని తందానానా' అనడం అలవాటు చేసేశారు వాళ్ళు. ఇప్పుడు 'ధిక్ ధిక్కారమున్ సైతునా' అనే సాహసం చేయలేము గదా!
సరిగా పద మా ని సరిగా పద పద పదా

మిస్సన్న said...

అయ్యా ఏమైనా మీకు మీరే సాటి!

kaartoon.wordpress.com said...

అహా నుమంతరావుగారు ! సరిగపదమని బాగా చెప్పారు.నిజానికి
హాస్సెం తగిలించి ఎంతో బ్లాగుగా వుందండి ! నిజమ్ మీరు నా మాట
నమ్మాలి !..........సురేఖ

హనుమంత రావు said...

యఙ్ఞా, చైతూ,మిస్సన్న,బులుసు,సురేఖ గార్లకు,,,,నమస్తే
మీరు నా స రి గ ప ద మ ని చూసి, స్పందించి,
మెచ్చుకున్నందులకుచాల సంతోషము...
చాలా చాలా కృతఙ్ఞతలు.....