బోస్టన్ లో ఉన్న శ్రీ తాడిమర్రి శ్రీనివాస రెడ్డి గారు అంతర్జాలము ద్వారా పరిచయమై ఆత్మీయత, అభిమానము పంచారు. వారి తొలికావ్యము అనదగ్గ రచన తొలిపూజ.. ఈ రచన వారి మూడుసంవత్సరాల అంతర్మథనము తర్వాత వచ్చిన భక్తి భావస్వప్నం.. అందమైన భక్తి భావాలతో మనస్సు లోతులు తాకుతోంది ఈ రచన. ఈ పుస్తకము జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత
శ్రీ సి.నారాయణరెడ్డిగారి చేతుల మీదుగా రవీంద్రభారతి మినీ ఆడిటోరియమ్ హాలులో 16-2-2013 న ఆవిష్కరించబడింది. నన్ను ఈ కార్యక్రమమునకు తప్పక రావలసినదిగా ప్రేమతో ఆహ్వానించారు.. శ్రీనివాసరెడ్డిగారిని మొదటిసారి ఆరోజే చూసాను. సినారె గారి చేతులమీదుగా పుస్తక ఆవిష్కరించబడింది. ఆ కార్యక్రమము నిర్వహించే అదృష్టము నాకు ఇచ్చారు శ్రీ రెడ్డిగారు. వారి అభిమానమునకు వెల కట్టలేను.. మంచి రచన. సాధకులకు, సామాన్యులకు కూడా ఆనందాన్ని కలుగజేస్తున్నది రచన. మీకు కావాలంటే ఉచితముగా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయము ఉంది. మీరూ చదవండి.. నచ్చిన విషయము రచయితకు మెయిల్ ద్వారా తెలియజేయండి..ఆ సందర్భములోనిదీ ఫోటో. tolipooja.blogspot.com ద్వారా మీరూ వివరాలు తెలుసుకోవచ్చు.. ఒక్కసారి చూడండి

No comments:
Post a Comment