Pages

Friday, March 22, 2013

ON THE HAPPY OCCASION OF HASAM CLUB ANNIVERSARY 2004-13

                                                 హాసం క్లబ్బుకో స్కిట్టు
                                                            స్కిట్ రచన: డి.వి.హనుమంతరావు.
              
                                          (పాత్ర ధారులు: భార్య, భర్త, బాస్)

భార్య:     (పాటతో ప్రవేశం)
        మేలుకోవయ్య కావేటి రంగా
        శ్రీ రంగా మేలుకోవయ్యా...
భర్త:         (పేపరు చదువుతూ ఉంటాడు)
భార్య:    మొదలెట్టారా పొద్దున్నే పేపరు
భర్త:    (    ఒక సారి చూసి మళ్ళీ పేపరు)
భార్య:    పొయ్యిమీద కుక్కర్ పెట్టాను.. నేను పువ్వులు తేవడానికి క్రిందకెళ్తున్నాను, మూడు కూతలొచ్చాక స్టౌ కట్టేయండి.        (పాట కంటిన్యూ చేస్తూ నిష్క్రమణ)
భర్త:        అ లా  గే.....( పేపర్ చదువుతూ ఉంటాడు)
భార్య      (వస్తూ) అయ్యో..కుక్కర్ కూతొస్తోంది.. ఎన్నోదిది... లెక్క పెట్టారా ?
భర్త:        ఆఁ... కూతా.. ఏం కూతా... (పేపరులోంచే)
భార్య:     మీకు చెప్పడం నాదీ బుద్ధి తక్కువ.. మళ్ళీ అన్నం మెత్తబడిందంటే నన్ను చంపుతారు...
భర్త:        చంపుతారా ? ఎవరు.. ఎవర్ని ..?
భార్య:     నా బొంద
భర్త:        బొందా.. ఎవరిది..
భార్య:    నా ఖర్మ...
భర్త:        (పేపరు చదవడం పూర్తిచేసి) .. ఏవోయి భార్యామణీ.. ఏమైనా పని చేసి పెట్టనా.. కూరలు తరగనా... చెప్పు చెప్పు         క్షణంలో చేసి అవతల పారేస్తాను.
భార్య:     సర్లెండి .. సంబరం .. ఏమీ అక్కరలేదు కాని.. వచ్చే ఆదివారానికి, హాసం క్లబ్ కు ఓ స్కిట్ వ్రాయొచ్చుకదా... మనమే         చేయొచ్చు కూడాను.
భర్త:        ...యొచ్చు.. యొచ్చు.. సరే చూద్దాం.. రాద్దాం.. చేద్దాం..
భార్య:    వంటైంది.. వడ్డించేస్తాను వెళ్ళి స్నానం చేసిరండి.  ఆఫీసు టైమ్ అవుతోంది...
*** *****              ******                             *******                              ********
భార్య:     ఏమండోయ్.. ఇవాళ మర్చిపోకుండా స్కిట్ రెడీ చేయండి. టైము దగ్గర పడుతోంది.
భర్త:        అలాగే.. నేను ఆఫీసుకి వెళ్తున్నాను.. అన్నట్టు.. నా సెల్ ఫోన్ ఇలా ఇయ్యి.. ( సెల్ ఇస్తుంది.. అతను నిష్క్రమణ)
భార్య:    (పాట హమ్మింగ్)

                           **************                                    **************
       
        (భర్త దారిలో ఉంటాడు.. జేబులో ఫోన్ మ్రోగుతుంది.)
భార్య:    (ఫోన్ రింగ్) .. నన్నువదలి నీవు పోలేవులే.. అదీ నిజములే
        ఏమండీ.. ఈ పాట రింగ్ టోన్ వచ్చిందా ?
భర్త:        (ఇబ్బందిగా స్కూటర్ మీద కూర్చుని.. ఓ చెవిలో ఫోన్) వచ్చింది తల్లీ, మళ్లీ నువ్వు పాడడమెందుకు ?
భార్య:    లైవ్ షో అండీ, లైవ్లీగా ఉంటుందని. ఇంతకీ స్కిట్ వ్రాసారా ?   
భర్త::        అబ్బా.. ఇంకా ఆఫీసుకి చేరలేదమ్మా .. దారిలో ఉన్నాను.. ఇక్కడ విపరీతంగా ఉంది ట్రాఫిక్.. ఫోన్ పెట్టేయ్ తల్లీ...

                **************                                    **************
   
                (ఆఫీసు సీను.. భర్త ఆఫీసుకి చేరాడు)
భర్త::        గుడ్ మార్నింగ్ సర్ !
బాస్:        గుడ్ మార్నింగ్ Mr.రావ్ !
భార్య:     (ఫోన్ రింగ్) హలో.. నీవేనా నను తలచినదీ.. నీవేనా నను పిలచినదీ...
భర్త:        అబ్బా ఏమిటే నీ గోల.. మా బాస్ దగ్గరున్నాను ..
భార్య:    స్కిట్ వ్రాసారేమో అడుగుదామని...
భర్త:        ఇంకా సీటుకి కూడా వెళ్లలేదు.. ఫోన్ పెట్టేయవే బాబూ...
బాస్:        ఎవరయ్యా ఫోన్..
భర్త:        అబ్బెబ్బే.. ఏమీ లేదండి.. (సీటుకి వెళ్తాడు)
           
            **************                                    **************
   
        (మళ్ళీ ఫోను)
భార్య::     ఎలా తెలుపనూ.. మీకెలా తెలుపనూ...
భర్త:        అబ్బబ్బా.. చంపేస్తున్నావోయ్
భార్య:    స్కిట్ వ్రాసారా ? టైము దగ్గరకొచ్చేస్తోంది...
భర్త:        ఇప్పుడేకదా ఆఫీసుకొచ్చాను. కొంచెమైన పని చెయ్యాలి కదా.. అయ్యాక లంచ్ టైములో వ్రాస్తాను.. అయినా ఇది         ఆఫీసువాళ్లిచ్చిన ఫోన్ ..అలా     అస్తమానం చెయ్యకూడదు. బాస్ కు తెలిస్తే చంపేస్తాడు.. ఇంక సోది కొట్టకు ఫోన్         పెట్టేస్తున్నాను ( ఫోన్ పెట్టేస్తాడు).
బాస్:        Mr.రావ్.. మీరోసారి ఇలా రండి.. ఆ గుప్తా బ్రదర్స్ ఫైలు పట్రండి..
భార్య:    (మళ్ళీ ఫోన్)...
బాస్:        ఎవరోయ్ అస్తమానూ ఫోన్..ఇలా నాకియ్యి...(తీసుకుంటాడు)
భార్య:    (ఫోనులో) ఎప్పుడూ బాస్ ... బాస్ అంటారేమిటి. ఆయనకేం పనిలేదా ? చీటికీ మాటికీ మిమ్మల్ని పిలవడమేనా.. మీ         ఆఫీసులో ఇంకెవ్వరూ     ఉద్యోగాలు చెయ్యటంలేదా... అసలు ఆ బాసు గాడికి మొహాన నవ్వూ తుళ్ళూ ఏమైనా         ఉంటాయా... లేపోతే మన హాసం క్లబ్ కు తీసుకురండి..     నవ్వడం అంటే ఏమిటో తెలుస్తుంది. అయినా నా సంగతి         తెలియదేమో గురుడికి....
        " అంబనహో..శక్తి నహో..... అంకాళ దేవతనహో
        మన  ఊర వెలసిన జడల మారెమ్మనహో "
బాస్::        ఓర్నాయనోయ్.. ఎవత్తయ్యా ఈవిడా.. ఇలా వాయించేస్తోంది.. నీకు తెలుసా ?
భర్త::        నా భార్య సార్
బాస్:        నీ భార్యా ?  ఓహ్.. సారీ... సారీ ఆఫీస్ ఫోనులు ఇలా సొంతానికి ఇలా... ఇలా..  టూ మచ్... థ్రీ మచ్.. గట్టిగా             మాట్లాడితే బోల్డు మచ్...నో ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్.. నీకో ఇంక్రిమెంట్ కట్..నీ సెల్ ఫోన్ కట్.. నీ ఇంటి ఫోను         కూడా కట్..
భర్త:        సా....ర్...
బాస్:        నో మోర్ ఆర్గ్యుమెంట్... గో....( జుత్తు పీక్కుంటూ కుర్చీలో కూలబడ్తాడు....)

                    **************                                    **************
   

No comments: