Pages

Sunday, April 20, 2014

ఆడు మగాడు..



ఆడు మగాడురా బుజ్జీ ..
...... వారే శ్రీ ఓటరు
 

రచన: డి.వి హనుమంతరావు.


ఓటరు ఏమై పోయాడు ?

ఏమోనండి.. ఇప్పటిదాకా అక్కడ పేడ చేస్తూ ..ఎవరో వచ్చారని, వీధిలోకి వెళ్లాడు..

వెళ్ళి ?

వచ్చి .. చేతి నిండా పేడ అంటేసింది కదా .. ఆ పేడ కడిగేసుకున్నాడు

తర్వాత ?

అక్కడ గలీజుగా ఉందని చీపురెట్టి తుడిచేసాడు

ఇంట్రెస్టింగ్?

తిరుగుతున్న ఫాను ఆపేసాడు

అదేం...?

చెప్పాను కదండీ..తెలియదని...

మరి ?

బయటికివచ్చాడు .. అక్కడ  ఎవరో కారాయన, లిఫ్ట్ కావాలా అన్నాడు...

కారెక్కాడా ?...

లేదండి,, ఆ ప్రక్కనే ఒకాయన, ’తాతా! సైకిలెక్కుతావా’ అన్నాడు,

ఒహో సైకిలెక్కాడా ?

అలాగని నే చెప్పానా ?

సైకిలూ ఎక్కలేదా... మరి ?

లేదండీ బాబూ ..  చెప్పులు కూడా వేసుకోకుండా..

ఇంత ఎండలో .. అలాగే నడిచాడా ?

అదేనండి మరి...

ఆ ప్రక్కనున్న చెరువుగట్టు మీదకి  వెళ్తే చల్లగా ఉండును కదా…

మీరనేది ఆ తామర చెరువా..

ఆ అదే.

అస్సలటువైపు కూడా చూడలేదండి ..

మరి ఎక్కడికెళ్లాడండీ...

అక్కడో స్కూలు ఉంటే .. అక్కడ ఓ గదిలోకి దూరాడు .. అక్కడ  గోడమీద బూతు నెం.7  అని వ్రాసి ఉందండీ ..

ఆ ! నాకు తెలిసిపోయింది... మీకు తెలిసిందా ?..

ఏమో .. ఏ బూతు పని చేసొస్తాడో..ఎవరికి తెలుసు..?

ఆడు మగాడండీ .. బూతులోకి వెళ్లాడు కదా …  
గొప్ప మార్పుని పుట్టించే పని చేస్తాడు...ఆడు మగాడు ..

9 comments:

మిస్సన్న said...

అబ్బ! చెమటలు పట్టించేశారు కదండీ!

NSK said...

good one...

A K Sastry said...

అద్భుతం హనుమంతరావు గారూ!

అభినందనలు.

అన్నట్టు మీకు నరసాపురం తో యేమైనా కనెక్షన్‌ వుందా?

హనుమంత రావు said...

మిస్సన్నగారికి, స్వరూప్ గారికి, కృష్ణ శాస్త్రిగారికి ... మీ మీ స్పందనలకు చాలా సంతోషం.. కృతజ్ఞతాభివందనలు..శాస్త్రిగారికి మీరు ఎందుకడిగారో తెలియదు కాని నరసాపురంలో ఎవరూ బంధువులు లేరు.. బంధుత్వాలూ లేవు..

Anonymous said...

అమోఘం ఛాలా ఛాలా మన వోటర్ లని ప్రభావితం చేసే సందేశం అందించారు హాట్స్ ఆఫ్

Anonymous said...

మరి మహిళామనులు కూదా మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తున్నారు

A K Sastry said...

మా యింటి దగ్గర్లోనే వుండే దినవహి వారి 5 గురు సోదరులు మా స్నేహితులు. వాళ్లలో పై ముగ్గురూ హైదరబాదు వనస్థలి పురం లో వుంటున్నారని తెలిసింది. అందుకని అడిగాను. అంతే.

janaa said...

మీ రాజకీయ ఛతుర్లు ఛాలా చాలా బాగున్నాయి. తరుఛు వేస్థూఉండడి....జనార్ధన్

janaa said...

మీ రాజకీయ ఛతుర్లు ఛాలా చాలా బాగున్నాయి. తరుఛు వేస్థూఉండడి....జనార్ధన్